E-Paper
Advertisement

స్పాంజ్‌బాబ్ ఫ్రెండ్ పాట్రిక్‌కి సొంతంగా షో…. నవ్వులు పూయించేందుకు వచ్చేసిన నయా సీజన్

స్పాంజ్‌బాబ్ ఫ్రెండ్ పాట్రిక్‌కి సొంతంగా షో…. నవ్వులు పూయించేందుకు వచ్చేసిన నయా సీజన్
Advertisement

Animated Comedy Series: కిడ్స్ నుంచి పెద్దవాళ్ల వరకు అందరినీ అలరించిన ‘స్పాంజ్‌బాబ్ స్క్వేర్‌ప్యాంట్స్’ (SpongeBob SquarePants) కార్టూన్ గురించి తెలియని వారుండరు. అందులో స్పాంజ్‌బాబ్‌కు బెస్ట్ ఫ్రెండ్‌గా కనిపించే పింక్ కలర్ స్టార్ ఫిష్ పాట్రిక్ స్టార్ చేసే అల్లరి అంతా ఇంతా కాదు. అమాయకంగా కనిపిస్తూనే తన వింత ఆలోచనలతో చుట్టూ ఉన్నవారిని ఇబ్బందుల్లో పడేయడం అతని ప్రత్యేకత. ఈ పాపులర్ క్యారెక్టర్‌ను ప్రధానంగా తీసుకుని నికెలోడియన్ రూపొందించిన స్పిన్-ఆఫ్ సిరీసే ‘ది పాట్రిక్ స్టార్ షో’ (The Patrick Star Show). ఇప్పటికే ప్రేక్షకులను నవ్వించిన ఈ యానిమేటెడ్ సిట్‌కామ్ ఇప్పుడు ఆరో సీజన్‌తో తిరిగి వచ్చింది. పాట్రిక్ తన ఇంటినే టీవీ స్టూడియోగా మార్చుకుని చేసే హంగామా, కుటుంబ సభ్యులతో కలిసి సృష్టించే గందరగోళం ఈ కొత్త ఎపిసోడ్‌లలోనూ కొనసాగుతుంది. మరి ఈ సీజన్‌లో పాట్రిక్ ఎలాంటి కొత్త కష్టాలు కొనితెచ్చుకున్నాడో కథలో చూద్దాం.

కథలోకి వెళ్తే…

బికినీ బాటమ్ అనే సముద్రపు అడుగున ఉన్న నగరంలో పాట్రిక్ స్టార్ తన కుటుంబంతో కలిసి నివసిస్తుంటాడు. అతని తండ్రి సెసిల్ స్టార్, తల్లి బన్నీ స్టార్, చెల్లెలు స్క్విడినా స్టార్, తాత గ్రాండ్‌ప్యాట్ అతని కుటుంబ సభ్యులు. వీళ్లందరి మధ్య పాట్రిక్ జీవితం ఎప్పుడూ ఏదో ఒక గందరగోళంతోనే సాగుతుంది. సాధారణంగా టీవీ షోలను చూసి ఆనందించే పాట్రిక్ మాత్రం తన బెడ్‌రూమ్‌నే స్టూడియోగా మార్చేసి సొంతంగా ఒక షో నడుపుతుంటాడు. అతని షోలో ఏం జరుగుతుందో పాట్రిక్‌కే తెలియని పరిస్థితులు చాలాసార్లు ఎదురవుతుంటాయి. ఒక్కోసారి తన ఊహల్లోనే కొత్త ప్రపంచాలను సృష్టించుకుంటూ, వాటిలో వింత వింత సాహసాలు చేస్తుంటాడు. ఈ సిరీస్‌లో పాట్రిక్ చేసే టాక్ షోతో పాటు, అతని కుటుంబ సభ్యుల జీవితాల్లో జరిగే సరదా సంఘటనలు కూడా కనిపిస్తాయి.

Advertisement

తల్లి బన్నీ, తండ్రి సెసిల్, చెల్లెలు స్క్విడినా, తాత గ్రాండ్‌ప్యాట్‌లతో పాట్రిక్‌కు ఎదురయ్యే సంఘటనలు ఒక్కో ఎపిసోడ్‌లో ఒక్కో కొత్త కామెడీకి దారితీస్తాయి. ఇక స్పాంజ్‌బాబ్, స్క్విడ్‌వార్డ్ వంటి బికినీ బాటమ్ పాత్రలు కూడా సందర్భానుసారం కథలోకి వస్తూ నవ్వులు పంచుతుంటాయి. ఇక ఆరో సీజన్ మొదటి ఎపిసోడ్ ‘స్క్విడినా అండ్ ది బ్రెయిన్’లో పాట్రిక్ తన మెదడును ఇంట్లోనే మర్చిపోయి బయటకు వెళ్లిపోతాడు. దీంతో మెదడు లేకుండా తిరుగుతున్న పాట్రిక్‌ను తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడానికి స్క్విడినా రంగంలోకి దిగుతుంది. పాట్రిక్ శరీరాన్ని, అతని మెదడును మళ్లీ కలపడానికి ఆమె చేసే ప్రయత్నాలు ఎలాంటి గందరగోళానికి దారితీశాయనేది ఈ ఎపిసోడ్‌లో సరదాగా చూపించారు. రెండో ఎపిసోడ్ ‘డే ఆఫ్ ది స్నెయిల్’లో స్పాంజ్‌బాబ్ తన తల్లిదండ్రులతో కలిసి బయటకు వెళ్లడంతో, తన పెంపుడు నత్త గ్యారీని చూసుకోవాల్సిన బాధ్యతను పాట్రిక్‌కు అప్పగిస్తాడు.

ఏ ఓటీటీలో ఉంది ?

‘ది పాట్రిక్ స్టార్ షో’ ఆరో సీజన్ అక్టోబర్ 30 నుంచి జియోహాట్‌స్టార్ (JioHotstar)లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం సీజన్ ప్రారంభంలో విడుదలైన మొదటి రెండు ఎపిసోడ్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఈ యానిమేటెడ్ సిరీస్‌కు ల్యూక్ బ్రూక్‌షియర్ (Luke Brookshier), మార్క్ చెక్కరెల్లి (Marc Ceccarelli) క్రియేటర్లుగా వ్యవహరించారు. క్లాడియా స్పినెల్లి (Claudia Spinelli) ఈ షోను టెలివిజన్ కోసం అభివృద్ధి చేశారు. ఇంగ్లీష్ భాషలో అందుబాటులో ఉన్న ఈ సిరీస్‌లో బిల్ ఫాగర్‌బాక్కే, టామ్ విల్సన్, క్రీ సమ్మర్, జిల్ టాలీ, డానా స్నైడర్ తదితరులు వాయిస్ ఆర్టిస్టులుగా కొనసాగుతున్నారు. స్పాంజ్‌బాబ్ ప్రపంచాన్ని మళ్లీ చూడాలనుకునేవారికి, ముఖ్యంగా పాట్రిక్ అల్లరి ఇష్టపడేవారికి ఈ కొత్త సీజన్ మరోసారి నవ్వులు పంచనుంది.

Advertisement

Read Also: రిటైర్మెంట్‌ తీసుకున్న దొంగకు భారీ దోపిడీ ఛాన్స్‌… వంద మిలియన్ డాలర్ల ప్లాన్‌ బెడిసికొడితే… హై వోల్టేజ్‌ హీస్ట్ థ్రిల్లర్‌

Related News

అరేబియా సముద్రంలో ఆఖరి ప్రయాణం… వెనుక వెంటాడే మిస్టరీ… సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్

ఏలకుల తోటలో అర్ధరాత్రి దుండగుల దాడి… భర్తను కాపాడుకోవడానికి ఒంటరి పోరాటం… మైండ్ బ్లాక్ చేసే మలయాళం సర్వైవల్ థ్రిల్లర్‌

ఓటీటీ ప్రేక్షకులకు నవంబర్ ఫుల్ మీల్స్… ఏకంగా 30 కొత్త సినిమాలు, సిరీస్‌లు… ఏ ఓటీటీలో ఏ సినిమా వస్తుందో తెలుసా ?

నెట్ ఫ్లిక్స్ పొరపాటు.. లీక్ అయిన రణబాలి ఓటీటీ స్ట్రీమింగ్ డేట్!

ఓటీటీలో జైలర్ 2 డబుల్ ట్రీట్.. కొత్త సీన్స్ యాడ్!

పసిపాప మాస్క్‌ వేసుకున్న సైకో కిల్లర్‌… కల్లో కనిపించిన కిల్లర్ నిజమైతే… వెన్నులో వణుకు పుట్టించే థ్రిల్లర్

పిచ్చి పట్టి చచ్చే ఫ్యామిలీ… ఎక్స్ లవర్ ఉసురు తగిలి నాశనం… ఒళ్లు గగుర్పొడిచే సూపర్ నేచురల్ థ్రిల్లర్ సిరీస్

Big Stories

Advertisement
×