Kurnool Elections: ఉమ్మడి కర్నూలు జిల్లాలో పురపోరు పోలింగ్ అత్యంత ప్రశాంతంగా ముగిసింది. అభ్యర్థుల భాగ్యరేఖలు నిక్షిప్తమైన బ్యాలెట్ బాక్సులు ఇప్పటికే స్ట్రాంగ్ రూమ్‌లకు చేరుకున్నాయి. దీంతో కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునేది ఎవరు? మున్సిపాలిటీల్లో చైర్మన్ గిరి ఎవరికి దక్కబోతోంది? అనే ఉత్కంఠ ఇప్పుడు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పీక్ స్టేజ్‌కు చేరింది. ఒకవైపు గెలుపుపై అధికార కూటమి, ప్రతిపక్ష వైసిపి ధీమా వ్యక్తం చేస్తుంటే.. మరోవైపు అప్పుడే పందాల రాయుళ్లు రంగంలోకి దిగారు. అసలు ఉమ్మడి జిల్లాలో పోలింగ్ సరళి ఎలా సాగింది? ఎక్కడెక్కడ ఎంత శాతం ఓట్లు పోలయ్యాయి? పొలిటికల్ ల్యాండ్‌స్కేప్‌లో వినిపిస్తున్న టాక్ ఏంటి? రేపు వెలువడే స్థానిక సంస్థల ఎన్నికల రిజల్ట్ ఏలా ఉంటుందో అన్న సస్పెన్షన్ ఏర్పడింది కర్నూలు జిల్లాలో జరుగుతున్న ఈక్వేషన్ ఏంటో లెట్స్ వాచ్ ది స్టోరీ..
ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ సమరం ముగిసింది. పట్టణ ఓటర్లు తమ తీర్పును బ్యాలెట్ బాక్సుల్లో భద్రపరిచారు. అధికారులు పోలింగ్ ముగిసిన వెంటనే బ్యాలెట్ పెట్టెలను భారీ భద్రత నడుమ స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించారు. అయితే ఈసారి పోలింగ్ సరళిని గమనిస్తే కొన్నిచోట్ల ఓటర్లు నీరసంగా స్పందించగా.. మరికొన్ని చోట్ల మాత్రం భారీగా తరలివచ్చారు.ఉమ్మడి జిల్లాలో నమోదైన పోలింగ్ శాతం కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్: 53.77 శాతం ఆదోని మున్సిపాలిటీ: 53.59 శాతం నంద్యాల మున్సిపాలిటీ: 62.49 శాతం డోన్ మున్సిపాలిటీ: 67.54 శాతం ఎమ్మిగనూరు మున్సిపాలిటీ: 67.90 శాతం ఓట్లు పోలయ్యాయి.
మున్సిపాలిటీలతో పోలిస్తే గూడూరు నగర పంచాయతీల్లో ఓటర్లు భారీగా తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే, కర్నూలు కార్పొరేషన్ పరిధిలో మాత్రం కేవలం 53.77 శాతం మాత్రమే పోలింగ్ నమోదు కావడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నగరంలో వార్డుల పునర్విభజన జరిగిన తర్వాత.. కొత్త ఓటర్ స్లిప్పులు ఓటర్లకు పూర్తిగా అందకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. పోలింగ్ కేంద్రాల వద్ద తమ ఓటు ఎక్కడ ఉందో తెలియక చాలామంది ఓటు వేయకుండానే వెనుదిరిగినట్లు క్షేత్రస్థాయి లో చర్చలో జరుగుతున్నాయట. చదువుకున్న విద్యార్థులు ఉద్యోగులు చైతన్యం ఉన్న కార్పొరేషన్ లోనే ఓటింగ్ శాతం పెరగలేదంటే ఈ ప్రభావం ఏ పార్టీ వైపు పడుతుందో అనే టెన్షన్ అన్ని వర్గాల్లో నెలకొందట.
Also read: విమాన ప్రయాణం వేస్ట్.. ఈ రైలు జర్నీనే బెస్ట్.. 5-స్టార్ హోటల్ ఫీలింగ్!
ఇక పోలింగ్ ముగియడంతో అప్పుడే పొలిటికల్ హీట్ అంచనాలకు మించిపోతోంది. పోలింగ్ కేంద్రాల్లో పెద్ద ఎత్తున రిగ్గింగ్ జరిగిందంటూ వైసీపీ నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. అయితే ప్రత్యర్థులు మాత్రం వైసిపి ఆరోపణలను కొట్టిపారేస్తున్నారు. ఓటమి భయంతోనే ఆధారాలు లేని విమర్శలు చేస్తున్నారని.. కర్నూలు కార్పొరేషన్ పీఠాన్ని తామే క్లీన్ స్వీప్ చేయబోతున్నామని టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అటు ఆదోని మున్సిపాలిటీలో మాత్రం రెబల్ అభ్యర్థులు ఎవరి ఓట్లను చీల్చారు? ఎవరి విజయావకాశాలను దెబ్బతీశారనే దానిపై ప్రధాన పార్టీల్లో టెన్షన్ మొదలైంది.
ఫలితాల కంటే ముందే ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బెట్టింగులు జోరందుకున్నాయి. కర్నూలు మేయర్ పీఠం ఎవరికి దక్కుతుంది? ఆదోని, నంద్యాల, ఎమ్మిగనూరు, డోన్ చైర్మన్ స్థానాల్లో జెండా పాతేది ఎవరు? అంటూ ప్రధాన కూడళ్లలో పందాల రాయుళ్లు కోట్ల రూపాయల చేతులు మార్చుకుంటున్నారటా. ఎవరి లెక్కల్లో వారు గెలుపు ధీమాతో ఉన్న ఈ పురపోరులో అసలైన విజేత ఎవరో తెలియాలంటే కౌంటింగ్ వరకు వేచి చూడాల్సిందే.
చూశారుగా.. ఉమ్మడి కర్నూలు జిల్లా పురపోరు పోలింగ్ ముగిసినా, దాని చుట్టూ తిరుగుతున్న రాజకీయ సమీకరణాలు మరియు బెట్టింగులు మాత్రం జిల్లాను హీటెక్కిస్తున్నాయి. ఓటర్ల తీర్పు ఎలా ఉందో తెలియాలంటే కొన్ని గంటలు ఓపిక పట్టాల్సిందే. ఇరు పార్టీల నేతలు కార్యకర్తల్లో కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది ఈ ఎన్నికల పోరులో ఏ పార్టీ నెగ్గుతుందో చూడాలి మరి..
Also Read: తెలంగాణ పోలీసులు చేసిన ఆ ఒక్క పనితో.. 20.2 శాతం తగ్గిన సైబర్ ఆర్థిక నష్టాలు!