E-Paper
Advertisement

పుదీనా పచ్చడి ఇలా చేస్తే..అన్నం మొత్తం లాగించేస్తారు!

పుదీనా పచ్చడి ఇలా చేస్తే..అన్నం మొత్తం లాగించేస్తారు!
Advertisement

Pudina pachadi: మన తెలుగు వారి వంటకాల్లో.. పచ్చళ్లకు ఉండే స్థానమే వేరు. కూరలు ఎంత బాగున్నా పక్కన కాస్త పచ్చడి ఉంటే ఆ మజానే వేరుగా ఉంటుంది. అందులోనూ.. ఆకు కూరలతో.. చేసే పచ్చళ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. ముఖ్యంగా.. ‘పుదీనా పచ్చడి’ అంటే.. ఇష్టపడని వారు ఉండరు. పుదీనాలో ఉండే ప్రత్యేకమైన సువాసన, దాని రుచి అందరి ఫేవరెట్‌గా మారుస్తుంది. అయితే చాలా మంది ఇళ్లలో పుదీనా పచ్చడి చేస్తుంటారు కానీ.. హోటళ్లలో లేదా రెస్టారెంట్లలో దొరికేలా పర్ఫెక్ట్ టేస్ట్ రాదు.ఈ సారి ఇంట్లో పుదీనా పచ్చడి చేసేటప్పుడు ఈ చిన్న ట్రిక్స్ పాటిస్తే చాలు, ఫ్యామిలీ అవతా ఈ పచ్చడితోనే ప్లేట్ ఖాళీ చేసేస్తారు!

కావలసిన పదార్థాలు:

పుదీనా ఆకులు – 2 కట్టలు

Advertisement

పచ్చిమిర్చి – 8 నుంచి 10

చింతపండు – చిన్న నిమ్మకాయ సైజ్ అంత

Advertisement

మినపప్పు – 1 స్పూన్

శనగపప్పు – 1 స్పూన్

ధనియాలు – 1 స్పూన్

జీలకర్ర – అర స్పూన్

వెల్లుల్లి రెబ్బలు – 6 నుంచి 8

పసుపు – చిటికెడు

నూనె – 2 స్పూన్లు

ఉప్పు – రుచికి సరిపడా

తయారీ విధానం:

1. ముందుగా స్టవ్ వెలిగించి.. పాన్ పెట్టి రెండు స్పూన్ల నూనె వేయాలి. నూనె వేడెక్కిన తర్వాత మినపప్పు, శన గపప్పు, ధనియాలు, జీల కర్ర వేసి దోరగా వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగాక వెల్లుల్లి రెబ్బలు, పచ్చి మిర్చి చీలికలు వేసి మూతపెట్టి మగ్గనివ్వాలి. పచ్చి మిర్చి తొక్క తేలే.. వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి.

2. అదే పాన్ లో మిగిలిన నూనెతో.. శుభ్రం చేసి పెట్టుకున్న పుదీనా ఆకులను వేయాలి. పుదీనా ఆకుల్లోని పచ్చి వాసన పోయి, ఆకులు మెత్తబడే.. వరకు మీడియం మంటపై రెండు మూడు నిమిషాల పాటు వేయించుకోవాలి. పుదీనా మరీ ఎక్కువగా వేగితే రుచి మారుతుంది కాబట్టి లైట్‌గా మగ్గితే సరిపోతుంది.

Also Read: గోధుమపిండితో చల్ల పునుగులు..మైదా లేకుండానే బెస్ట్ టేస్ట్

3.ఇప్పుడు వేయించి పెట్టుకున్న దినుసులు, చింత పండు, తగినంత ఉప్పు, కొద్దిగా పసుపు వేసి రోట్లో.. దంచితే అద్భుతమైన రుచి వస్తుంది. ఒక వేళ రోలు అందుబాటులో.. లేక పోతే, మిక్సీ జార్‌లో వేసుకొని మరీ మెత్తగా కాకుండా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. చివరగా నూనె, ఆవాలు, కరివేపాకుతో పోపు పెట్టుకుంటే గుమగుమలాడే పుదీనా పచ్చడి రెడీ!

ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పుదీనా జీర్ణశక్తిని మెరుగు పరచడంలో అద్భుతంగా పని చేస్తుంది. వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని.. ఈ పుదీనా పచ్చడి కలుపుకొని తింటే.. ఆ రుచే వేరు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ రోజే మీ ఇంట్లో ఈ స్టైల్‌లో పుదీనా పచ్చడి ట్రై చేసి మీ ఫ్యామిలీకి వడ్డించండి!

Related News

పడకగదిలో మంచానికి ఎదురుగా అద్దం ఉండకూడదంటారు ఎందుకు? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?

బియ్యంతో..రెడీ చేసే ఈ పాయసం రుచి అద్భుతంగా ఉంటుంది

ప్రేమలో అందం, ఆకర్షణలు కాదు.. బంధం బలపడాలంటే ఇది ముఖ్యం

మీల్ మేకర్ పులావ్..బిర్యానీ కూడా దీని ముందు బలాదూర్

మీ బీపీ ఎప్పుడూ ఎక్కువగా ఉంటోందా? ముందు కిచెన్‌లో ఈ 5 ఫుడ్స్ తీసి పడేయండి

ఇన్వర్టర్ బ్యాటరీ త్వరగా పాడవుతోందా? నీరు పోసేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి

తగ్గేదెలే.. ఈ 5 రాశుల్లో పుట్టినవారు చివరి నిమిషం దాకా పోరాడుతారు

Big Stories

Advertisement
×