E-Paper
Advertisement

దీపావళి స్పెషల్ ఆఫర్స్.. ఈ 5 సెడాన్ కార్లపై లక్షల్లో డిస్కౌంట్లు!

దీపావళి స్పెషల్ ఆఫర్స్.. ఈ 5 సెడాన్ కార్లపై లక్షల్లో డిస్కౌంట్లు!
Advertisement

Diwali Car Offers 2026: దీపావళి పండుగ సందర్భంగా కొత్త కారు కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే, మీకు గుడ్ న్యూస్. పండుగ సీజన్‌లో కార్ల అమ్మకాలను పెంచేందుకు ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు భారీ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, క్యాష్ డిస్కౌంట్లను ప్రకటిస్తున్నాయి. ముఖ్యంగా సెడాన్ కార్లపై ఆకర్షణీయమైన ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. హోండా, హ్యుందాయ్, వోక్స్‌ వ్యాగన్ కంపెనీలకు చెందిన ఐదు సెడాన్ కార్లపై ఏకంగా రూ.1.25 లక్షల వరకు బెనిఫిట్స్ అందిస్తున్నాయి. ఆ కార్లు, వాటి ధరలు, ఆఫర్ల వివరాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1.హోండా సిటీ.. రూ.1.25 లక్షల వరకు ఆఫర్

ఈ దీపావళి సీజన్‌లో ఎక్కువ డిస్కౌంట్ అందిస్తున్న సెడాన్ హోండా సిటీ. ఈ కారు పెట్రోల్ వేరియంట్లపై రూ.1.25 లక్షల వరకు ప్రయోజనాలు లభిస్తున్నాయి. ఇందులో రూ.60,000 వరకు క్యాష్ డిస్కౌంట్, రూ.50,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ ఉన్నాయి. ఇప్పటికే హోండా కారు ఉన్నవారికి అదనపు ఎక్స్ఛేంజ్, లాయల్టీ బోనస్‌లు కూడా లభిస్తాయి. కార్పొరేట్ ఆఫర్‌తో పాటు రూ.19,000 విలువైన ఫ్రీ డాష్‌ క్యామ్, ఎక్స్‌ టెండెడ్ వారంటీపై తగ్గింపు కూడా ఉంది. దీని ప్రారంభ ధర రూ.12.08 లక్షలు కాగా, టాప్ వేరియంట్ ధర రూ.17.44 లక్షలు.

2.హ్యుందాయ్ వెర్నా.. రూ.80 వేల వరకు తగ్గింపు

Advertisement

హ్యుందాయ్ వెర్నా కొనుగోలుపై రూ.80,000 వరకు ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో రూ.40,000 వరకు క్యాష్ డిస్కౌంట్, రూ.10,000 కార్పొరేట్ బోనస్, రూ.25,000 వరకు స్క్రాపేజ్ బోనస్ ఉన్నాయి. స్క్రాపేజ్‌కు బదులుగా రూ.20,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ పొందవచ్చు. పాత కార్లను కలిగి ఉన్నవారికి అడిషనల్ బెనిఫిట్స్  కూడా ఉన్నాయి. వెర్నా ధర రూ.10.99 లక్షల నుంచి రూ.18.31 లక్షల వరకు ఉంది.

3.వోక్స్‌ వ్యాగన్ వర్టస్.. రూ.80 వేల ఆఫర్

వోక్స్‌ వ్యాగన్ వర్టస్‌పై కూడా భారీ ఆఫర్లు ఉన్నాయి. ఈ కారుపై రూ.50,000 వరకు క్యాష్ డిస్కౌంట్, రూ.30,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ కలిపి మొత్తం రూ.80,000 వరకు బెనిఫిట్స్ పొందవచ్చు. దీని ధర రూ.10.71 లక్షల నుంచి రూ.19.20 లక్షల వరకు ఉంది.

4.హోండా అమేజ్.. రూ.43 వేల వరకు ఆఫర్

Advertisement

బడ్జెట్‌లో సెడాన్ కొనాలనుకునేవారికి హోండా అమేజ్ మంచి ఆప్షన్. ఈ కారుపై రూ.15,000 వరకు నగదు తగ్గింపు, రూ.21,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.4,000 లాయల్టీ బోనస్, రూ.3,000 కార్పొరేట్ బోనస్ లభిస్తున్నాయి. మొత్తం రూ.43,000 వరకు ప్రయోజనాలు ఉన్నాయి. ఎక్స్‌ టెండెడ్ వారంటీపై రూ.16,900 తగ్గింపు కూడా అందిస్తున్నారు. దీని ధర రూ.7.65 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఉంది.

5.హ్యుందాయ్ ఆరా.. రూ.40 వేల వరకు ఆఫర్లు

హ్యుందాయ్ ఆరా కొనుగోలుపై కూడా పండుగ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. CNG వేరియంట్లపై రూ.30,000 వరకు, పెట్రోల్ వేరియంట్లపై రూ.15,000 వరకు క్యాష్ డిస్కౌంట్ లభిస్తుంది. వీటితో పాటు రూ.5,000 వరకు స్క్రాపేజ్ బోనస్, రూ.5,000 గ్రామీణ ఆఫర్ ఉన్నాయి. అత్యధికంగా రూ.40,000 వరకు బెనిఫిట్స్ పొందవచ్చు.

Read Also: దీపావళి సీజన్‌లో కళ్లు చెదిరే ఆఫర్లు.. ఈ 5 కార్లపై లక్షల్లో తగ్గింపు!

Tags

Related News

ఈవీ మార్కెట్‌లో హీరో విడా దూకుడు.. 2026లో 2 లక్షలు దాటిన అమ్మకాలు!

దీపావళి సీజన్‌లో కళ్లు చెదిరే ఆఫర్లు.. ఈ 5 కార్లపై లక్షల్లో తగ్గింపు!

బజాజ్ చేతక్‌ కు భారీ డిమాండ్.. ఉత్పత్తిని పెంచేందుకు కంపెనీ బిగ్ ప్లాన్!

సింగిల్ ఛార్జ్ తో 355 కి.మీ రేంజ్‌.. హ్యుందాయ్ కొత్త ఎలక్ట్రిక్ SUV!

బజాజ్ ఆటో బిగ్ ప్లాన్.. మార్కెట్లోకి మరో రెండు కొత్త బైక్ బ్రాండ్లు!

భారత్ లోకి డెంజా Z9 GT.. లాంచ్‌ కు ముందే టీజర్ రిలీజ్!

ఆరేళ్లలో 3.5 లక్షల అమ్మకాలు.. టాటా ఆల్ట్రోజ్ సరికొత్త రికార్డు..

Big Stories

Advertisement
×