Aakash Chopra criticises Shehbaz Sharif : హాంకాంగ్ సిక్సెస్ 2026 టోర్నమెంట్ లో (Hong Kong Sixes 2026) భాగంగా శుక్రవారం టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఫైట్ జరిగింది. ఈ మ్యాచ్ లో టీమిండియాను ఓడించిన పాకిస్తాన్.. నాలుగు వికెట్ల తేడాతో విక్టరీ అందుకుంది. దీంతో పాకిస్తాన్ క్రికెట్ జట్టును మెచ్చుకుంటూ ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ హాట్ కామెంట్స్ చేశారు. టీమిండియాను ఇలాగే ఓడిస్తూ ముందుకు సాగాలని పిలుపునిచ్చాడు. అయితే హాంకాంగ్ సిక్సెస్ లాంటి చిన్న టోర్నమెంట్ లో టీమిండియా ఓడిపోయినందుకు పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ స్పందించడం బుద్ధి తక్కువ పని అంటూ ఆకాష్ చోప్రా మండిపడ్డారు.
గల్లీ క్రికెట్ లో టీమిండియాను ఓడిస్తే వరల్డ్ కప్ వచ్చినట్టుగా షరీఫ్ ఫీలవుతున్నాడని కౌంటర్ పేల్చాడు. ఈ చిన్న మ్యాచ్ పై ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి స్పందించడం దిగజారడమే అంటూ ఆగ్రహించాడు. క్రికెట్ పై అవగాహన లేని వ్యక్తులు ఇలాగా ప్రవర్తిస్తారంటూ మండిపడ్డాడు. దమ్ముంటే అంతర్జాతీయ మ్యాచుల్లో టీమిండియాను ఓడించి చూపించాలని సవాల్ విసిరాడు. దీంతో పాక్ ప్రధాని షరీఫ్ పై అకాశ్ చోప్రా చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
హాంకాంగ్ సిక్సెస్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో ప్రధాని షరీఫ్ చేసిన ట్వీట్ పై ఆకాష్ చోప్రా తన స్టైల్ లో రియాక్ట్ అయ్యారు. టీమిండియాను ఓడించామని చెప్పుకునే ప్రధాని షరీఫ్… ముందుగా యూఏఈ చేతిలో పాకిస్తాన్ జట్టు ఓడిపోయిన విషయాన్ని కూడా గుర్తించుకుంటే మంచిదంటూ కౌంటర్ ఇచ్చాడు. పసికూన యూఏఈ చేతిలో ఓడిపోవడంతో మీ పరుగు కూడా పోయింది కదా ? అంటూ ఫైర్ అయ్యాడు. దేశ ప్రధాని స్థాయిలో ఉన్న షరీఫ్ చిన్న హాంకాంగ్ సిక్సెస్ టోర్నమెంట్ గురించి ట్వీట్ చేశాడంటే, పాకిస్తాన్ క్రికెట్ నాణ్యత ఎంత దిగజారిందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చంటూ సెటైర్లు వేశాడు. అంతర్జాతీయ మ్యాచులలో ప్రతిసారి టీమిండియాదే పై చేయన్నాడు. ఈ చేతకాని దద్దమ్మలు ఏదో అదృష్టం కొద్దీ హాంకాంగ్ సిక్సెస్ టోర్నమెంటులో గెలిచారంటూ ఫైర్ అయ్యాడు.
అటు ఇండియన్ ఫ్రాన్స్ కూడా పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ పై దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. ఒక్క చిన్న మ్యాచ్ లో గెలిస్తేనే ప్రధాని షరీఫ్ స్పందిస్తాడా? ఇదెక్కడి దిక్కుమాలిన సంస్కృతి అంటూ కౌంటర్లు ఇస్తున్నారు. ఈ విజయంతో పాకిస్తాన్ లో పది రోజుల పాటు హాలిడే కూడా ప్రకటించండి అంటూ మరి కొంత మంది సెటైర్లు వేస్తున్నారు. ఇలాగే వదిలేస్తే ఈ విజయంతో లాహోర్ వీధుల్లో కూడా ర్యాలీలు నిర్వహిస్తారంటూ ఎద్దేవా చేస్తున్నారు. కాగా హాంకాంగ్ సిక్సెస్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో 4 వికెట్ల తేడాతో టీమిండియా ఓడిపోయింది.