How to increase inverter battery life| విద్యుత్ సరఫరా నిలిచిపోయినప్పుడు మన ఇంట్లో ఇన్వర్టరే పెద్ద ఆధారం. అయితే, కరెంట్ పోగానే ఇన్వర్టర్ కొద్దిసేపటికే ఆగిపోతుందా? బ్యాటరీ ఛార్జింగ్ ఉన్నప్పటికీ ఎక్కువసేపు బ్యాకప్ ఇవ్వడం లేదా? అయితే, మీ ఇన్వర్టర్ బ్యాటరీ నిర్వహణపై దృష్టి పెట్టాల్సిన సమయం వచ్చింది. కొన్ని కారణాలు దాని పనితీరును దెబ్బతీస్తాయి. అయితే చిన్న జాగ్రత్తలు పాటిస్తే బ్యాటరీ జీవితకాలాన్ని పెంచుకోవచ్చు. మరి నీళ్లు పోసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.
ఇన్వర్టర్ బ్యాటరీపై ఉండే చిన్న ఇండికేటర్లు వాటర్ లెవెల్‌ని తెలియజేస్తాయి. వీటిలో ఉండే కలర్ ఇండికేటర్స్ గమనిస్తే నీళ్లు అవసరమో లేదో తెలుసుకోవచ్చు.
సాధారణంగా బ్యాటరీలో గ్రీన్, రెడ్ సూచనలు కనిపిస్తాయి
ప్రతి సెల్‌లో వాటర్ లెవెల్‌ని విడివిడిగా పరిశీలించాలి. బ్యాటరీ తయారీదారు సూచనలను కూడా తప్పనిసరిగా పాటించాలి.
బ్యాటరీ నిర్వహణలో సరైన వాటర్ ఎంచుకోవడం చాలా ముఖ్యం. పొరపాటున కూడా నల్లా నీళ్లు, ఆర్వో నీళ్లు ఉపయోగించకూడదు. సాధారణ నీటిలో ఉండే ఖనిజాలు బ్యాటరీలో పేరుకుపోవచ్చు. ఇవి లోపల ఉండే ప్లేట్లను దెబ్బతీసి బ్యాటరీ సామర్థ్యాన్ని తగ్గించవచ్చు. అందుకే బ్యాటరీ కోసం ప్రత్యేకంగా తయారుచేసిన డిస్టిల్డ్ వాటర్ మాత్రమే ఉపయోగించాలి. మార్కెట్లో ఇది బ్యాటరీ వాటర్ పేరుతో లభిస్తుంది. కొనుగోలు చేసేటప్పుడు బాటిల్‌పై ఉన్న వివరాలను పరిశీలించాలి.
1. అవసరానికి మించి నీళ్లు పోయడం: బ్యాటరీలో నిర్ణీత స్థాయికి మించి నీళ్లు నింపకూడదు. ఎక్కువ నీళ్లు పోస్తే ఛార్జింగ్ సమయంలో బయటకు పొంగే ప్రమాదం ఉంటుంది.
2. నీటి స్థాయిని పట్టించుకోకపోవడం: నీళ్లు తగ్గితే బ్యాటరీ ప్లేట్లు దెబ్బతినవచ్చు. ముఖ్యంగా వేసవిలో అన్ని సెల్స్‌ను క్రమం తప్పకుండా పరిశీలించాలి.
3. నీరు ఉపయోగించడం: నల్లా, ఆర్వో లేదా ఏసీ నుంచి వచ్చే నీటిని బ్యాటరీలో పోయకూడదు. తయారీదారు సూచించిన డిస్టిల్డ్ వాటర్ మాత్రమే ఉపయోగించాలి.
Also Read: స్వీట్స్ తినడం కంటే ఇది డేంజర్.. షుగర్ సమస్య పెరగడానికి అతిపెద్ద కారణం ఇదే
ఇన్వర్టర్ బ్యాటరీని క్రమం తప్పకుండా పరిశీలించడం చాలా అవసరం. వాటర్ లెవెల్‌ని క్రమంగా చెక్ చేస్తూ, సరైన డిస్టిల్డ్ వాటర్ ఉపయోగించాలి. తయారీదారు సూచించిన నిర్వహణ పద్ధతులను పాటించాలి. ఇలా చేస్తే బ్యాటరీ పనితీరును మెరుగ్గా ఉంచుకోవచ్చు.