E-Paper
Advertisement

హస్తినలో ఇండీ నిరసన గళాలు! హైదరాబాద్‌లో బీజేపీ బల ప్రదర్శనలు! అమిత్ షా రాకతో బీజేపీలో సందడి..! తెలంగాణపై షా స్పెషల్‌ ఫోకస్‌!

హస్తినలో ఇండీ నిరసన గళాలు! హైదరాబాద్‌లో బీజేపీ బల ప్రదర్శనలు! అమిత్ షా రాకతో బీజేపీలో సందడి..! తెలంగాణపై షా స్పెషల్‌ ఫోకస్‌!
Advertisement

తెలంగాణపై అమిత్ షా స్పెషల్‌ ఫోకస్‌ పెట్టారు. తెలంగాణలో ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలనే వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు మోటు భాయ్‌. ఇక్కడ సీనియర్లు తలోదారిగా ఉండి.. పార్టీని ఎదగనీయకుండా చేస్తున్న వైనంపైనా దృష్టి పెట్టారు. దీన్ని నివారించేందుకు సునీల్‌ బన్సల్‌ను తెలంగాణ పార్టీ ఇంచార్జిగా పంపారు.

ఇక ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతున్న సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా, ఎస్‌ఐఆర్‌ అంశాలపై ఇండీ కూటమి పట్టు బిగిస్తోంది. ప్రధానంగా కాంగ్రెస్ చేస్తున్న వరుస ఉద్యమాలతో బీజేపీకి డ్యామేజీ జరుగుతోంది. ఈ నేపథ్యంలో నవంబర్‌ 1 ఆదివారం నాడు ఇండీ కూటమి ఢిల్లీలోని రాంలీలా మైదానంలో చేపడుతున్న ‘ఓట్‌ బచావో- దేశ్‌ బచావో’ ఉద్యమం ప్రాధాన్యత సంతరించుకున్నది. దీనిపై అంచనాలు పెరుగుతున్నాయి.

Advertisement

ఇండీ కూటమి కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నది. ఈ ఉద్యమాన్ని నిలువరించేందుకు, కేంద్రం ప్రత్యేక రైళ్ల అనుమతికి నో చెప్పింది. టీపీసీసీ ఆధ్వర్యంలో రైల్‌ నిలయం ముట్టడి కూడా తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. దీంతో తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున తరలివెళ్లేందుకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తోంది టీపీసీసీ. ఇప్పటికే అంతా ఢిల్లీ తరలివెళ్లారు.

అంతా హస్తినవైపు ఆసక్తిగా చూస్తున్న వేళ.. హైదరాబాద్‌ గడ్డపై మోటు భాయ్‌ కాలుమోపనున్నారు. బీజేపీ ఆధ్వర్యంలో ఇండీ కూటమికి కౌంటర్‌గా చేపడుతున్న ‘లోక్‌తంత్ర్‌ బచావో.. అరాచ్‌కతా హఠావో’ అనే నినాదంతో భారీ ర్యాలీకి సన్నద్దమయ్యారు. ఇదే అంశంపై దేశ వ్యాప్తంగా ఈ పాదయాత్రలు చేస్తున్నా.. ప్రత్యేకంగా అమిత్ షా హైదరాబాద్‌ను ఎంచుకోవడానికి కారణం… తెలంగాణపై ప్రత్యేక ఫోకస్‌ పెట్టడమేనంటున్నారు కమల నాథులు.

Advertisement

బీఆర్‌ఎస్‌ను మూడోస్థానానికి పడదోసి.. తామే ప్రత్యామ్నాయం అని చూపేందుకు ఈ రెండేళ్ల కాలాన్ని బాగా వినియోగించుకోవాలనేది అమిత్‌ షా వ్యూహంగా కనిపిస్తోంది. సీనియర్లను నమ్ముకుంటే ఈసారి కూడా పార్టీ పరిస్థితి అధోగతేనని అధిష్టానం డిసైడ్ అయిపోయింది. అందుకే తెర వెనుక అమిత్‌షా, తెరముందు బన్సల్‌ .. వీరిద్దరే ఇప్పుడు తెలంగాణ బీజేపీని ముందుండి నడిపించే లీడర్లు. అమిత్‌ షా .. ఇలా తరుచూ తెలంగాణలో పలు కార్యక్రమాలు పెట్టడం ద్వారా బీజేపీ బల ప్రదర్శనతో జనంలో ఓ టాక్‌ రావాలని భావిస్తున్నారు.

అందుకే ఆయన ప్రత్యేకించి తెలంగాణలో ఇండీ కూటమికి పోటాపోటీగా నిరసన రూపాన్ని ఎత్తుకున్నారు. కాంగ్రెస్‌ నేతలంతా హస్తిన బాట పడితే.. మోటు భాయ్‌ హైదరాబాద్‌ గడ్డ మీద కాలుమోపారు. ఇప్పుడిదే చర్చ హాట్‌ టాపిక్‌గా మారింది తెలంగాణ రాజకీయాల్లో. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు, ఖైరతాబాద్‌ ఉప ఎన్నిక, గ్రేటర్ హైదరాబాద్‌ మున్సిపల్‌ ఎన్నికలు.. ఈ మూడింటినీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నది బీజేపీ.

అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగే ఈ ఎన్నికల్లో సత్తా చాటడం ద్వారా తాము బలపడ్డామనే సంకేతాలు ఇవ్వాలని అమిత్ షా భావిస్తున్నారు. అందుకే గతంలో జరిగిన ఎన్నికల గురించి పట్టింపు లేదు.. కానీ ఇకపై జరిగే ప్రతి ఎన్నికా ప్రతిష్టాత్మకమేనని క్యాడర్‌కు బలమైన సంకేతాలు పంపారు. ఓ రకంగా ఎన్నికల యుద్దానికి సిద్దమయ్యేందుకు అన్ని అస్త్రాలను బీజేపీ ప్రోదీ చేసుకుంటున్నదని చెప్పాలి.

Tags

Related News

ఆప్ ను అందలమెక్కించిన ఢిల్లీ విద్యా విప్లవం..! సర్కారీ విద్యకు అత్యధిక ప్రాధాన్యం..! భారీ సంస్కరణలతో మంచి ఫలితాలు.. పంజాబ్ లో గెలుపుకీ దోహదం!

సర్కారీ విద్య బలోపేతానికి భారీ సిఫార్సులు! మియాపూర్ భూముల అమ్మకం సొమ్మును వినియోగించాలని సూచన..! తన మాటవింటే మళ్లీ గెలవటం పక్కా అంటున్న మురళి!

మూడు పార్టీలు.. మూడు స్కెచ్‌లు.. ఒక్కటే టార్గెట్!

ఎల్‌నినో దెబ్బకు చెక్.. అర్నబ్ తుపాన్‌తో నిండిన ఉత్తరాంధ్ర రిజర్వాయర్లు

సెల్ఫ్‌ డిక్లరేషన్‌ పత్రాలు అడుగుతున్నారని ప్రచారం! ఏకంగా ప్రెస్‌మీట్‌లోనే ఆ పత్రాన్ని చూపిన కేటీఆర్‌..! సర్కార్‌ ఖండించినా ఆగని దుష్ప్రచారం!

రాహుల్‌ను ప్రధానిని చేయలేదు..:! కేటీఆర్‌ను సీఎం చేస్తా..! కేసీఆర్‌కు కలిసిరాని కాలం! ఎంతెంత దూరం.. ఇంకెంత దూరం..?

గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదులో కనిపించని జోష్.. ఎందుకో తెలుసా..?

Big Stories

Advertisement
×