BigTV English

Belly Fat : బానపొట్టతో ఇబ్బందులా.. ఈ డ్రింక్ తాగి వ్యాయామం చేస్తే ఇట్టే తగ్గిపోతుంది

Belly Fat : బానపొట్టతో ఇబ్బందులా.. ఈ డ్రింక్ తాగి వ్యాయామం చేస్తే ఇట్టే తగ్గిపోతుంది

Drink for Belly Fat : కాలం మారింది. లైఫ్ స్టైల్ మారింది. సామాన్యంగా ఉండటం నుంచి హుందాతనం అలవాటైంది. వీటితోపాటు.. ఆహారపు అలవాట్లు మారాయి. ఎలా అంటే.. మనం తినే ఆహారం వల్లే చేతులారా మన ఆరోగ్యాన్ని మనమే పాడుచేసుకునేంత. జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, పిజ్జాలు, బర్గర్లు, బిర్యానీలు, షవర్మాలు.. అబ్బో ఒకటేమిటి.. చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్ట్ ఉంటుంది.


పొద్దున లేచింది మొదలు.. రాత్రి పడుకునే వరకూ.. కాదు కాదు.. అర్థరాత్రుళ్లు, తెల్లవారుజాముల్లోనూ.. ఎప్పుడు పడితే అప్పుడు ఏది పడితే అది తినేస్తున్నారు. ఫలితంగా లేనిపోని అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు. ఏమన్నా అంటే మిడ్ నైట్ క్రేవింగ్స్, ఎర్లీ మార్నింగ్ క్రేవింగ్స్ అంటున్నారు. మీ క్రేవింగ్స్ సంగతి సరే.. ఆరోగ్యం మాటేమిటి. శరీర బరువుపై కంట్రోల్ లేకపోతే అది మీ ఆయుష్షును మింగేస్తుంది. ఊబకాయం, బానపొట్టతో నానా ఇబ్బందులు పడక తప్పదు. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. మీరు అధిక పొట్టతో ఇబ్బంది పడుతుంటే.. వ్యాయామం చేసి .. కొవ్వును కరిగించే డ్రింక్ తీసుకోండి. పొట్టదగ్గర కొవ్వు పేరుకుపోతే అది ఆరోగ్యానికి చాలా ప్రమాదం.

Also Read : గుండెపోటుకు కారణమయ్యే కొలెస్ట్రాల్‌ను తగ్గించే బెస్ట్ ఫుడ్స్ ఇవే !


ఉద్యోగాల పేరుతో ఆఫీసుల్లో గంటలతరబడి కుర్చీలకే పరిమితం కాకూడదు. ప్రతి అరగంటకో గంటకో లేచి.. కాస్త తిరగడానికి ట్రై చేయండి. లేదంటే సీట్లోనే ఉండి మీ శరీరాన్ని స్ట్రెచ్ చేయండి. మెటబాలిజం బాగుంటుంది.

అలాగే ప్రతిరోజూ ఉదయం కనీసం 30 నిమిషాలపాటు వాకింగ్ చేయాలి. కేలరీలు కరిగి.. బరువు తగ్గుతారు.

ఆఫీసులకు వెళ్లినా, షాపింగులకు వెళ్లినా లిఫ్టులకు బదులుగా మెట్లు ఎక్కి వెళ్లేందుకే ప్రాధాన్యమివ్వండి. బెల్లీ ఫ్యాట్, తొడల్లో పేరుకున్న కొవ్వు కరుగుతుంది. అలాగే ప్లాంక్స్, సిట్ అప్స్ వంటి వ్యాయామాలు చేయడం అలవాటు చేసుకోవాలి.

యోగాసన్నాల్లో.. కోనాసనం, ఉష్టాసనం, ధనుర్వక్రాసనం వంటి ఆసనాలను వేయడం అలవాటు చేసుకోండి. మొదట్లో కష్టంగా ఉన్నా చేసే కొద్దీ అలవాటవుతాయి.

పొట్టకొవ్వును కరిగించే డ్రింక్

ఈ డ్రింక్ చేసుకోవడం చాలా సులభం. ఆపిల్ సైడర్ వెనిగర్, పుదీనా ఆకులు, చియా విత్తనాలు, నీరు, అల్లం రసం రెడీ చేసుకోవాలి. ఒక గ్లాసు నీటిలో ఆపిల్ సైడర్ వెనిగర్ ఒక టీ స్పూన్, నాన బెట్టుకున్న చియా విత్తనాలు ఒక టీ స్పూన్, 4-5 పుదీనా ఆకులు, 1 టీ స్పూన్ అల్లం రసం కలిపి బాగా కలుపుకుని.. పరగడుపునే తాగాలి. ఇలా క్రమం తప్పకుండా కొన్నినెలలపాటు తాగితే.. మీ పొట్ట తగ్గడాన్ని గమనించవచ్చు.

Tags

Related News

Stress And Heart attack: స్ట్రెస్ ఎక్కువైతే.. హర్ట్ ఎటాక్ వస్తుందా ?

Health Benefits: ఈ ఒక్క చపాతీ తింటే చాటు.. ఆ సమస్యలన్నీ మాయం

Magnesium Deficiency: మీలో ఈ లక్షణాలున్నాయా ? జాగ్రత్త

Healthy Looking Skin: ఆరోగ్యవంతమైన చర్మం కోసం.. ఎలాంటి చిట్కాలు పాటించాలి ?

Sleep: తగినంత నిద్ర ఎందుకు ముఖ్యమంటే ?

Drink For Hair Fall: ఈ డ్రింక్స్‌తో.. హెయిర్ ఫాల్‌కు చెక్

Big Stories

×