Boda kakarakaya: బోడ కాకర కాయలు మార్కెట్‌లో ఎక్కువగా వర్షకాలంలో కనిపిస్తాయి. వీటిలో అనేక రకాల ఆయుర్వేద గుణాలు లభిస్తాయి. ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్లు వీటిని క్రమం తప్పకుండా ఆహారాల్లో తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర పరిమాణాలు కూడా అదుపులో ఉంటాయి. ఇవి తెలంగాణాలో ఎక్కువగా ఆదిలాబాద్ ప్రాంతాల్లో ఎక్కువగా లభిస్తాయి. వీటిని తరచుగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే వర్షాకాలంలో వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
బోడ కాకర కాయల్లో లభించే పోషకాలు:
బోడ కాకర కాయల్లో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు లభిస్తాయి. ఇందులో విటమిన్ సి, ఆల్కలాయిడ్స్, ఫ్లేవనాయిడ్స్, గ్లైకోసైడ్లు, అమైనో ఆమ్లాలులతో పాటు జింక్, పొటాషియం, ఫాస్పరస్ ఉంటాయి. కాబట్టి క్రమం తప్పకుండా ఆహారాల్లో తీసుకోవడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
బోడ కాకర కాయ ప్రయోజనాలు:
డయాబెటిస్ మాయం
బోడ కాకర కాయ మధుమేహంతో బాధపడుతున్నవారికి ఎంతో ప్రభావంతంగా సహాయపడుతుంది. ఇందులో ఉండే గుణాలు గ్లైసెమిక్ ఇండెక్స్‌పై ప్రభావితం చేస్తుంది. దీని కారణంగా రక్తంలోని చక్కెర పరిమాణాలు నియంత్రణలో ఉంటాయి. దీంతో మధుమేహం కారణంగా వచ్చే అనారోగ్య సమస్యలు దూరమవుతాయని వైద్యులు చెబుతున్నారు.
బరువుకు చెక్
బరువు తగ్గాలనుకునేవారికి కూడా బోడ కాకర కాయ ప్రభావంతంగా సహాయపడుతుంది. ఇందులో అధిక పరిమాణంలో ఫైబర్ లభిస్తుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందడమేకాకుండా శరీరం యాక్టివ్‌గా తయారవుతుంది. దీనిలో పీచు పదార్ధం ఎక్కువగా ఉంటుంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
రక్తపోటు సమస్యను నివారిస్తుంది
బోడ కాకర కాయలో పొటాషియం కూడా అధిక పరిమాణంలో లభిస్తుంది. కాబట్టి తరచుగా రక్తపోటు సమస్యలతో బాధపడేవారు తప్పకుండా వీటిని ఆహారాల్లో తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులోని విటమిన్లు, ఖనిజాలు రోగనిరోధక శక్తిని పెంచడానికి బాగా ఉపయోగపడుతుందని పలు వైద్యులు హెచ్చరిస్తున్నారు.
క్యాన్సర్ నివారణ
బోడ కాకర కాయలో క్యాన్సర్‌తో పాటు గుండె సమస్యలను నివారించే అనేక రకాల మూలకాలు లభిస్తాయి. అంతేకాకుండా ఇందులో విటమిన్ సి కూడా ఉంటుంది. బోడ కాకరలోని పోషకాలు కండరాలను బలోపేతం చేయడానికి సహాయపడతాయి, చర్మ సమస్యలు ఉన్నవారు.. మొటిమలు, తామర వంటి సమస్యలకు కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఇన్ఫెక్షన్లు, జులుబు, దగ్గు నుండి రక్షణ కల్పిస్తుంది మరియు శరీరంలోని టాక్సిన్స్‌ను తొలగిస్తుంది.
Also Read: మీ చుట్టూ పావురాలు ఉంటున్నాయా? అయితే మీరు ప్రమాదంలో పడినట్టే..
బోడ కాకరకాయ, ముఖ్యంగా వర్షాకాలంలో, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కాబట్టి క్రమం తప్పకుండా వీటిని తినడం వల్ల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది.