Dangers With Pigeons: పావురాలు అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది. వాటిని పెంచడం ఒక హాబీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇంకా చిన్న పిల్లలు వాటిని చూస్తే చెప్పలేని ఆనందం వస్తుంది. అవి ఎక్కడ కనిపించిన సరే వాటి దగ్గరకు వెళ్లడానికి, వాటికి గింజలు వేయడానికి ట్రై చేస్తుంటారు. అయితే పావురాలు మన చుట్టూ ఉన్నా.. అలాగే వాటిని మనం పెంచుకున్న దాని వల్ల ఎన్నో సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు. ముఖ్యంగా ఊపిరితిత్తులను శాశ్వతంగా దెబ్బతీస్తాయని చెబుతున్నారు.
పావురాల వల్ల కలిగే అనారోగ్య సమస్యలు
పావురాలు తమ రెట్టలు, ఈకలు, మరియు శరీరంపై ఉండే ధూళి ద్వారా పర్యావరణాన్ని కలుషితం చేస్తాయి. ఈ కలుషిత పదార్థాలు మానవులకు అనేక ఆనారోగ్య సమస్యలను కలిగిస్తుంది. ముఖ్యంగా శ్వాసకోశ సంబంధిత వ్యాధులు మరియు అలర్జీలు.
పావురాల రెట్టలు ఎండిపోయి గాలిలో ధూళిగా మారి, శ్వాసకోశ సమస్యలను కలిగిస్తాయి. అలాగే పావురాల ఈకలు, వాటి శరీరంపై ఉండే ధూళి అలర్జీలను ప్రేరేపిస్తాయి. ఇవి పేనులు (lice), గోచీలు (mites) వంటి పరాన్నజీవులను మోసుకెళ్లవచ్చు, ఇవి మానవులకు చర్మ సమస్యలను కలిగించవచ్చంటున్నారు. పావురాలు బ్యాక్టీరియా, ఫంగస్, మరియు వైరస్‌లను వ్యాప్తి చేస్తాయి, తీవ్రమైన అంటు వ్యాధులకు కారణమవుతాయి.
పావురాల వల్ల వచ్చే వ్యాధులు
పావురాలతో సన్నిహితంగా ఉండటం లేదా వాటి రెట్టలు, ఈకలతో సంబంధం కలిగి ఉండటం వల్ల కింది వ్యాధులు సంక్రమించే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
i. శ్వాసకోశ సంబంధిత వ్యాధులు
హిస్టోప్లాస్మోసిస్ (Histoplasmosis):
హిస్టోప్లాస్మా క్యాప్సులాటం అనే ఫంగస్, ఇది పావురాల రెట్టలలో మరియు వాటి నివాస స్థలాలలో కనిపిస్తుంది. దీని వల్ల జ్వరం, దగ్గు, ఛాతీ నొప్పి, శ్వాస ఆడకపోవడం వంటివి సమస్యలు వస్తాయి. అలాగే రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో తీవ్రమైన ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌కు దారితీయవచ్చు.
క్రిప్టోకాకోసిస్ (Cryptococcosis):
క్రిప్టోకాకస్ నియోఫార్మాన్స్ అనే ఫంగస్, ఇది పావురాల రెట్టలలో సమృద్ధిగా ఉంటుంది. ఇది తలనొప్పి, జ్వరం, గందరగోళం, తీవ్రమైన సందర్భాలలో మెదడు ఇన్‌ఫెక్షన్స్‌కి కారణమవుతుంది. దీనివల్ల HIV/AIDS ఉన్నవారు లేదా రోగనిరోధక శక్తి లోపం ఉన్నవారు ఎక్కువ ప్రమాదంలో ఉంటారు.
సిటాకోసిస్ (Psittacosis):
క్లామిడియా సిటాసీ అనే బ్యాక్టీరియా, ఇది పావురాలు మరియు ఇతర పక్షుల ద్వారా వ్యాప్తి చెందుతుంది. జ్వరం, దగ్గు, కండరాల నొప్పి, న్యుమోనియా. ఇది ఊపిరితిత్తులకు సంబంధించిన తీవ్రమైన ఇన్ఫెక్షన్‌గా మారవచ్చు.
ii. అలర్జీ సంబంధిత సమస్యలు
అలర్జిక్ రైనైటిస్ (Allergic Rhinitis):
పావురాల ఈకలు, ధూళి గాలిలో కలిసినప్పుడు, తుమ్ములు, ముక్కు కారడం, కళ్లలో దురద లాంటి అలర్జీ లక్షణాలు కనిపిస్తాయి
iii. చర్మ సంబంధిత సమస్యలు
డెర్మటైటిస్ (Dermatitis):
పావురాల ఈకలు, రెట్టలు లేదా వాటి పరాన్నజీవులతో సంపర్కం వల్ల చర్మంపై దురద, ఎరుపు లేదా దద్దుర్లు ఏర్పడవచ్చు. వీటి పేనులు లేదా గోచీలు మానవుల చర్మంపైకి వచ్చి చర్మ ఇన్ఫెక్షన్‌లను కలిగించవచ్చు.
iv. ఇతర అంటు వ్యాధులు
సాల్మొనెల్లోసిస్ (Salmonellosis):
పావురాల రెట్టల ద్వారా సాల్మొనెల్లా బ్యాక్టీరియా వ్యాప్తి చెందవచ్చు. దీంతో జ్వరం, విరేచనాలు, కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు. పావురాల రెట్టలలో ఈ. కోలై బ్యాక్టీరియా ఉంటుంది, ఇది కలుషితమైన ఆహారం లేదా నీటి ద్వారా వ్యాప్తి చెందుతుంది.
Also Read: ఈ ఫుడ్స్ తింటే మీరు డేంజర్‌లో ఉన్నట్లే.. అవేంటో తెలుసా?
అందుకే పావురాల చుట్టు తిరగడం మానేయండి. ఒకవేళ వెళితే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. గుంపు ఎక్కువగా ఉన్న దగ్గరకు అస్సలు వెళ్లకూడదని పలు నిపుణులు హెచ్చరిస్తున్నారు.