BigTV English

Actress Death: ఇండస్ట్రీలో విషాదం… క్యాన్సర్ తో ప్రముఖ నటి మృతి?

Actress Death: ఇండస్ట్రీలో విషాదం… క్యాన్సర్ తో ప్రముఖ నటి మృతి?

Actress Death: ఇటీవల కాలంలో ఇండస్ట్రీలో వరస మరణాలు అందరినీ ఎంతో దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి. ఇటీవల టాలీవుడ్ ఇండస్ట్రీలో(Tollywood Industry) కోట శ్రీనివాసరావు (Kota Srinivas Rao)గారి మరణ వార్త మరచిపోక ముందే మరొక సీనియర్ నటి సరోజా దేవి, స్టంట్ మాస్టర్ రాజు వంటి తదితరుల వరస మరణాలు తెలుగు చిత్ర పరిశ్రమను దిగ్భ్రాంతిలోకి నెట్టేసాయి. ఇలా వీరి మరణ వార్త నుంచి అభిమానులు బయటపడక ముదే మరొక నటి క్యాన్సర్ తో బాధపడుతూ మరణించారని తెలుస్తోంది. మరి క్యాన్సర్ తో బాధపడుతూ మరణించిన నటి ఎవరు? ఏంటి అనే విషయానికి వస్తే.. దక్షిణ కొరియా(South Korean) నటి కాంగ్ సియో-హా(Kang Seo-ha ) 31 సంవత్సరాల వయసులో క్యాన్సర్‌తో (Cancer)పోరాడుతూ మరణించారు.


క్యాన్సర్ తో మరణించిన నటి..

నటి కాంగ్ సీయో జులై 14వ తేదీ మరణించినట్టు క్యుంగ్‌హ్యాంగ్ ఈ వార్తను ధృవీకరించింది. అదే విధంగా కాంగ్ సియో అంత్యక్రియలు జులై 16వ తేదీ దక్షిణ జియోంగ్‌సాంగ్ ప్రావిన్స్‌లోని హామన్‌లో జరగబోతున్నాయని తెలుస్తోంది. ఇక ఈమె మరణ వార్త తెలిసిన దక్షిణ కొరియా చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి గురి అవ్వడమే కాకుండా ఈమె మరణం పట్ల స్పందిస్తూ నివాళులు అర్పిస్తున్నారు. అయితే గత కొంతకాలంగా క్యాన్సర్ తో పోరాడుతున్న ఈమె తుది శ్వాస విడిచారు. క్యాన్సర్ తో బాధపడుతున్న ఈమె కీమో థెరపీ చేయించుకుంటూ ఉన్నారు. కాంగ్ రెండవ రౌండ్ కీమోథెరపీ సమయంలో ఆరోగ్యం క్షీణించడంతో జూలై 13 మధ్యాహ్నం మరణించిందని ఆమె కుటుంబం తెలిపింది.


బాధ నుంచి విముక్తి..

ఇలా ఈమె మరణ వార్తను కుటుంబ సభ్యులు సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ ఎమోషనల్ అయ్యారు .అదేవిధంగా ఈమె జ్ఞాపకార్థంగా ఒక వీడియోని కూడా షేర్ చేశారు. ఈ వీడియోని షేర్ చేసిన ఈమె కుటుంబ సభ్యులు ఈమె గురించి పోస్ట్ చేస్తూ…” ఇప్పటికీ మేము ఈ విషయాన్ని నమ్మలేకపోతున్నాము ఉన్ని. ఇంత బాధను భరిస్తూనే నువ్వు నీ చుట్టూ ఉన్న వారి గురించి,మా గురించి ఎంతగానో ఆలోచించావు. నువ్వు గత కొన్ని నెలలుగా సరైన భోజనం చేయకపోయినా మాకు కడుపునిండా భోజనం పెట్టావు.ఇన్ని రోజులు ఎంతో బాధను భరించిన నీవు ఇప్పుడు ఉన్నచోట సంతోషంగా ఉండాలని, ఈ బాధ నుంచి విముక్తి పొందావు అని ఆశిస్తున్నాను” అంటూ ఒక ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు.

చిన్న వయసులోనే మరణం…

కాంగ్ ఇంత చిన్న వయసులోనే ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఈమె
హా కె-డ్రామాస్ స్కూల్ గర్ల్ డిటెక్టివ్స్, అసెంబ్లీ, ఫ్లవర్స్ ఆఫ్ ది ప్రిజన్, ఫస్ట్ లవ్ ఎగైన్, త్రూ ది వేవ్స్, హార్ట్ సర్జన్స్ మరియు నోబడీ నోస్‌లలో కనిపించారు. ఇలా ఇండస్ట్రీలో ఎంతో మంచి జీవితం ఉన్నటువంటి కాంగ్ అకాల మరణం అందరినీ ఎంతో దిగ్బ్రాంతికి గురి చేస్తోంది. ఇక ఈమె మరణ వార్త తెలిసిన అభిమానులు తన మృతి పట్ల నివాళులు అర్పిస్తూ తన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నారు.

Also Read: HHVM Censor Talk: వీరమల్లు సెన్సార్ టాక్ వచ్చేసింది.. ఈ కథతో హిట్ కొట్టేస్తారా?

Related News

SIIMA 2025: సైమా 2025.. విజేతలు వీరే

Maadhavi Latha: టెంపుల్స్ లో స్కిన్ షో… చెప్పు తీసుకొని కొట్టాలి

SIIMA – 2025: పుష్పగాడి రూల్.. అవార్డుల వర్షం కురిపించిందిగా!

Ashish Vidyarthi: పొట్టకూటి కోసం అలా చేయక తప్పలేదు -ఆశిష్ విద్యార్థి!

Meenakshi Chaudhary : టాలీవుడ్ కి మీనా గుడ్ బై.. బాలీవుడ్ లో బంఫర్ ఆఫర్..

Ilaiyaraaja : మైత్రి మూవీ మేకర్స్ కు దిమ్మతిరిగే షాక్.. 5 కోట్లు డిమాండ్..

Big Stories

×