Barefoot walking: ప్రస్తుత కాలంలో చాలా మంది పేరెంట్స్ పిల్లలను చెప్పులు లేనిదే బయటకు పంపించరు. కొందరు అయితే సాక్సులు, షూస్ వేసి పంపిస్తారు. కానీ ఇలా నడిపించడం వల్ల కొన్ని ఆరోగ్య లాభాలను వారు పొంద లేకపోతున్నారు. పిల్లలను చెప్పులు లేకుండా నేలపై, పచ్చటి గడ్డిలో నడిపించడం వల్ల శారీరక, మానసిక ప్రయోజనాలు అందుతాయి. ఇది వారి కండరాలను బలోపేతం చేస్తుంది, ఎముకలను దృఢంగా మారుస్తుంది. పిల్లలు ఇలా నేల మీద ఆడుకోవడం, అన్వేషించడం వల్ల వారి చుట్టూ ఉన్న ప్రపంచాన్ని తెలుసుకోవడానికి, సామాజిక నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి, వారి ఊహాశక్తిని పెంచుకోవడానికి సహాయపడుతుంది.
కండరాలు, ఎముకలు బలంగా మారతాయి:
నేల మీద నడిచేటప్పుడు పిల్లలు తమ కాళ్లను, కోర్ కండరాలను ఉపయోగించాల్సి ఉంటుంది, దీంతో వారి కండరాలను బలోపేతం చేస్తుంది. అంతేకాకుండా పిల్లలు నేల పై నడిచేటప్పుడు బరువు మోసే వ్యాయామం చేయడం వల్ల ఎముకలు దృఢంగా మారతాయి, వారికి సరైన రక్త ప్రసరణ జరుగుతుంది. నేల మీద నడవడం, పరిగెత్తడం వల్ల శరీరంలో అనేక మార్పులు జరుగుతాయి. అలాగే పిల్లల శారీరక శ్రమ గుండె, ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, మనస్సుకు ప్రశాంతతను కలిగిస్తుంది.
మెదడు చురుకుదనం:
చిన్న వయసులో చెప్పులేసుకుని తిరిగిన వారితే పోల్చితే చెప్పులేకుండా తిరిగిన వారికి మెదడు చురుగ్గా పని చేస్తుందని పలు అధ్యయనాల్లో తేలింది. ఇందుకు మెదడుతో అనుసంధానమై ఉన్న ప్రెజర్ పాయింట్స్ పై ఒత్తిడి పడడమే కారణమని, దీని వల్ల మెదడులోని నాడులు ఉత్తేజితమవుతాయని చెబుతున్నారు. ఫలితంగా వారి ఆలోచనల్లో సామర్థ్యం, జ్ఞాపకశక్తి వంటివి మెరుగుపడుతుందని, అందుకే పిల్లలను చెప్పులేకుండా నడిపించమని వైద్యులు సూచిస్తున్నారు. అలాగే రోజూ కాసేపు పచ్చటి గడ్డిలో నడిపించడం, ఆడించడం వంటివి చేయడం వల్ల శరీరంలో హ్యాపీ హార్మోన్లుగా పిలిచే ఎండార్ఫిన్లు విడుదలవుతాయని, మనసులో టెన్షన్లన్నీ మాయమై, మానసిక ప్రశాంతత సొంతమవుతుందని తెలిపారు. అంతేకాకుండా దీని వల్ల ఏకాగ్రత పెరగడం, మెదడు ఒత్తిడి తగ్గడం వంటివి జరుగుతాయి.
సుఖమైన నిద్ర:
పిల్లలు ఎక్కువగా ఇంట్లో ఆడుకుంటే అస్సలు అలసిపోరు దీని వల్ల ఎలాంటి ఉపయోగం కూడా ఉండదు, కానీ వారు బయటకు వెళ్లి ఆడుకోవడం వల్ల అనేక లాభాలు ఉంటాయి. వారు బయటకి వెళ్లి ఆడుకోవడం వల్ల వారికి శరీరంలో అనేక మార్పులు జరుగుతాయి. అంతేకాకుండా వారు ఎక్కువగా బయట ఆడుకోవడం వల్ల బాడిలోని హార్మోన్లు బ్యాలెన్స్ అవుతాయి. దీంతో అలసిపోయి ప్రశాంతమైన నిద్ర పడుతుంది, ఇతర అనారోగ్యాల బారిన పడకుండా జాగ్రత్తపడవచ్చని సూచిస్తున్నారు. అలాగే ఇలా నడిపించడం వల్ల వారి కళ్ల ఆరోగ్యానికి కూడా మంచిదని పలు వైద్య నిపుణులు చెబుతున్నారు.
Also Read: డైలీ ఇలా చేస్తే.. జుట్టు ఊడమన్నా ఊడదు తెలుసా ?
ఇతర ప్రయోజనాలు:
పెద్దలతో పాటు పిల్లలు కూడా నెగిటివ్‌గా ఆలోచిస్తుంటారు. దీని వల్ల పిల్లల మైండ్‌లో నెగిటివిటీ పెరిగిపోతుందని వైద్యులు చెబుతున్నారు. అందుకే పిల్లలను పచ్చని గడ్డిలో, మట్టిలో నడిపించడం వల్ల శరీరంలోని నెగిటివ్ ఎలక్ట్రాన్లు తొలగిస్తుంది. అంతేకాకుండా భూమిలోని పాజిటివ్ ఎలక్ట్రాన్లు శరీరంలోకి చేరుతాయి. దీంతో వారి మానసికంగా, శారీరకంగా ప్రశాతంగా ఉంటారు. ముఖ్యంగా పిల్లలు బయట ఆడుకొనేటప్పుడు వారిని తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలి. లేదంటే వారు ఆడుకుంటూ గాయాలు చేసుకుంటే తర్వాత ఇబ్బందులు పడాల్సి ఉంటుందని పలు వైద్యులు హెచ్చరిస్తున్నారు.