Daily Hair Care Routine: పొడవాటి, ఒత్తైన, మెరిసే జుట్టు కావాలని ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు చెప్పండి. కానీ ప్రస్తుతం కాలుష్యం, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా జుట్టు రాలే సమస్య చాలా సాధారణంగా మారింది. ఇలాంటి సమయంలోనే జుట్టు సంబంధిత సమస్యల నుండి బయటపడాలంటే.. అంతే కాకుండా మీ జుట్టు పొడవుగా, మందంగా మారాలని మీరు కోరుకుంటే.. రసాయనాలతో తయారు చేసిన ప్రొడక్ట్స్ వాడటానికి బదులు, కొన్ని సులభమైన టిప్స్ పాటించండి. ఈ టిప్స్ పాటించడం ద్వారా మీరు కూడా తక్కువ సమయంలోనే పొడవాటి , మందపాటి జుట్టును సులభంగా పొందవచ్చు. మరి ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
రివర్స్ దువ్వడం:
మీ తలలో రక్త ప్రసరణ సరిగ్గా ఉంటే జుట్టు రాలదు. తలలో రక్త ప్రసరణను మెరుగుపరచడానికి రివర్స్ దువ్వడం అనేది మంచి మార్గం. దీని కోసం, మీరు మీ జుట్టు మొత్తాన్ని ముఖం ముందు ఉంచాలి. తరువాత వెనక నుండి ముందు వరకు దువ్వండి. ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
వారానికి రెండుసార్లు ఆయిల్ మసాజ్:
నడుము వరకు జుట్టు పెరగాలంటే.. వారానికి కనీసం రెండుసార్లు మీ జుట్టుకు నూనెతో మసాజ్ చేయండి. కొబ్బరి, బాదం లేదా ఆముదం నూనె జుట్టుకు అప్లై చేయడం మంచిది. దీనిని ఉపయోగించడానికి.. నూనెను కొద్దిగా వేడి చేసి.. వేళ్లతో తలకు మసాజ్ చేయండి. సరిగ్గా మసాజ్ చేయడం వల్ల నూనె జుట్టులోకి బాగా కలిసిపోతుంది. ఇది జుట్టుకు పోషణ నిస్తుంది. తలస్నానం చేయడానికి రెండు గంటల ముందు జుట్టుకు నూనె అప్లై చేయండి. రాత్రంతా జుట్టుకు నూనె అప్లై చేసి అలాగే ఉంచకూడదు.
వారానికి మూడు సార్లు షాంపూ వాడండి:
ప్రతిరోజూ షాంపూ వాడటం వల్ల జుట్టు పూర్తిగా శుభ్రం అవుతుందని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. వారానికి మూడు సార్లు మాత్రమే మీ జుట్టుకు షాంపూ వాడండి. షాంపూ కొనే సమయంలో.. అందులో ఎలాంటి రసాయనాలు ఉండకూడదని గుర్తుంచుకోండి. మీ షాంపూ సల్ఫేట్ , పారాబెన్ రహితంగా ఉండాలి. జుట్టును రుద్దడానికి బదులుగా.. లోపలి నుండి మురికి శుభ్రం అయ్యేలా సున్నితంగా శుభ్రం చేయడం మంచిది.
Also Read: మందార పూలను ఇలా వాడితే.. జుట్టు జెట్ స్పీడ్‌లో పెరుగుతుంది
డీప్ కండిషనింగ్ కోసం హెయిర్ మాస్క్:
జుట్టును బలోపేతం చేయడానికి డీప్ కండిషనింగ్ అవసరం. దాని కోసం.. జుట్టుకు డీప్ కండిషనింగ్ ఇవ్వడం అవసరం. దీని కోసం.. నాణ్యమైన కండిషనర్ ఉపయోగించండి. మీరు జుట్టును డీప్ కండిషనింగ్ చేయడానికి పెరుగు మాస్క్‌ను కూడా ఉపయోగించవచ్చు. ఈ మాస్క్ తయారు చేయడానికి.. 2 టీస్పూన్ల పెరుగు, 1 టీస్పూన్ తేనె , 1 టీస్పూన్ కొబ్బరి నూనె కలిపి జుట్టుకు అప్లై చేయండి. ఈ మాస్క్‌ను జుట్టు మీద ఒక గంట పాటు ఉంచి.. తర్వాత తలస్నానం చేయండి.
జుట్టు కత్తిరించడం అవసరం:
ప్రతి 8-10 వారాలకు ఒకసారి జుట్టును కత్తిరించకపోతే.. చివర్లు చిట్లిపోయే ప్రమాదం ఉంటంది. చివర్లు చిట్లిపోవడం వల్ల జుట్టు పెరగదు. మీరు జుట్టును పదే పదే కత్తిరించుకుంటూ ఉంటే.. జుట్టు వేగంగా పెరుగుతుంది. వాటి పెరుగుదల ఆరోగ్యంగా ఉంటుంది.