BigTV English

Girl Friend Secrets: అమ్మాయిలు తమ బాయ్ ఫ్రెండ్‌ను దూరంగా ఉంచేందుకు కారణాలు ఏమిటీ? అసలు సంగతి తెలిస్తే మైండ్ బ్లాకే!

Girl Friend Secrets: అమ్మాయిలు తమ బాయ్ ఫ్రెండ్‌ను దూరంగా ఉంచేందుకు కారణాలు ఏమిటీ? అసలు సంగతి తెలిస్తే మైండ్ బ్లాకే!

అమ్మాయిలు తాము ప్రాణంలా ప్రేమిస్తున్న అబ్బాయిలను కూడా ఒక్కోసారి దూరంగా పెడతారు. దూరంగా నిలిచి మాట్లాడేందుకే ఇష్టపడతారు. చేయి పట్టుకోడానికి కూడా అనుమతి ఇవ్వరు. అలా అని ఆమె మిమ్మల్ని ప్రేమించడం లేదని కాదు ఆమె కళ్ళల్లో, చేతల్లో మీపై ఎంతో ప్రేమ కనిపిస్తుంది. కానీ మీరు భౌతికంగా దగ్గరకు వస్తే మాత్రం దూరం జరుగుతుంది. ఆమె హృదయం మీతోనే ఉన్నా, శరీరకంగా మాత్రం దూరంగా ఉండడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు ఆమె మీకు చెప్పదు. కాబట్టి మీరే తెలుసుకోవాలి. ఇక్కడ ఇచ్చిన కొన్ని కారణాలవల్లే మీ ప్రేయసి మీకు దూరం జరుగుతూ ఉంటుంది. వీటిని వెంటనే మార్చుకోండి.


 గెడ్డం ఉన్నా…
ముఖంపై కొంతమంది అబ్బాయిలు తెగ గెడ్డం పెంచుకుంటారు. చూడగానే రగ్‌డ్ లుక్ వస్తుంది. ఇది అబ్బాయిలకి ఇష్టంగా ఉండవచ్చు, కానీ అమ్మాయిలకు మాత్రం నచ్చదు. ముఖాన్ని తమ చేతులతో ముట్టుకోవాలంటే… ఆ ముఖం చాలా శుభ్రంగా ఉండాలని వారు కోరుకుంటారు. ముఖంపై ఎక్కువ వెంట్రుకలు ఉంటే వారికి వారు దూరంగా జరుగుతారు. కాబట్టి కాస్త షేవ్ చేసుకొని అమ్మాయి దగ్గరికి వెళ్లేందుకు ప్రయత్నించండి.

నోటి శుభ్రత
దుర్వాసన వచ్చే అబ్బాయిలకు అమ్మాయిలు దూరంగా ఉంటారు. వారి బట్టలు పరిశుభ్రంగా లేకపోయినా, మాసిపోయినట్టు ఉన్నా, ఆ దుస్తులు నుండి వాసన వస్తున్నా అమ్మాయిలు ఇబ్బందిగా ఫీలవుతారు. మీకు దూరంగా జరుగుతూ ఉంటే ఓసారి మీ బట్టల వాసన మీరే చూసుకోండి.


అమ్మాయిలకి నీట్ గా ఉండే అబ్బాయిలను చూస్తే నచ్చుతుంది. మాసిన బట్టలతో కనిపిస్తే వారు మిమ్మల్ని ఇష్టపడరు. మట్టి పూసిన చెప్పులు, మాసిపోయిన షర్టులతో వాళ్ళ ముందుకు వెళ్ళకండి. వారు దూరంగా జరిగిపోతారు. వీలైనంతవరకు ఉతికిన దుస్తులను వేసుకొని వారి దగ్గరకు వెళ్ళండి.

మాట్లాడుతున్నప్పుడు నోటి నుంచి తుంపర్లు వస్తున్నా, దుర్వాసన వేస్తున్నా కూడా వారు మీకు దూరంగా జరిగిపోతారు. కాబట్టి సిగరెట్లు, ఆల్కహాల్ వంటివి తాగిన తర్వాత నోటి దుర్వాసన రాకుండా చూసుకోండి. లేకపోతే మీ ప్రయోజనం దూరంగా నెట్టేయడం ఖాయం.

మీ స్నేహితుల ద్వారా మీ గురించి ఏమైనా నిజాలు ఆమెకు తెలిసినా కూడా ఆమె మిమ్మల్ని దూరం పెడుతుంది. కాబట్టి ప్రేమలో పడ్డాక సరైన మార్గంలో నడవడానికి ప్రయత్నించండి. ఆమెను మోసం చేసేందుకు ఏమాత్రం ప్రయత్నించకండి.

మీ ప్రేయసి కలిసినప్పుడు ఆమెలోని లోపాలను పదేపదే ఎత్తి చూపడానికి ప్రయత్నించవద్దు. అలాగే ముఖంపై  జుట్టు, మొటిమలు వంటివి పెరగకుండా చూసుకోండి. అవి ఎక్కువగా ఉన్నా కూడా అమ్మాయిలకు నచ్చదు. అలాగే ఉద్యోగం, హోదా వంటివి కూడా అమ్మాయిలు చూస్తారు. టాలెంటెడ్ అబ్బాయిని అమ్మాయిలు ఇష్టపడతారు. కాబట్టి మీలో ఏదో ఒక నైపుణ్యం ఉండాలి. మాట్లాడే తీరు, నడిచే తీరు ఏదైనా కూడా అమ్మాయిల్ని ఆకర్షించే విధంగా ఉండేలా చూసుకోండి.ఇక లైంగిక జీవితం విషయానికి వస్తే మీకు నచ్చినట్టు ప్రవర్తించడం కాదు, వారికి నచ్చినట్టు ప్రవర్తించేందుకు ప్రయత్నించండి. అది వారిలో ఇష్టమే పెంచుతుంది. ఉన్నంతలో వారితో నిజాయితీగా ఉండేందుకు ప్రయత్నించండి. అమ్మాయిలు నిజాయితీగా ఉండే అబ్బాయిని ఇష్టపడతారు. అబద్ధాలు చెప్పారని తెలిస్తే ఆ క్షణమే వదిలేస్తారు.

Related News

Parenting Tips: పిల్లల అరుపులు ఎలా అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రులకు అవసరమైన సమాచారం

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Big Stories

×