Brahmamudi serial today Episode: అప్పును చచ్చే వరకు కోడలిగా అంగీకరించనని.. కావాలంటే ఇంతో అంతో ఇచ్చి నువ్వే అప్పును వదిలించుకోమని ధాన్యలక్ష్మీ చెప్పడంతో కళ్యాణ్ బాధపడతాడు. నేను కూడా చచ్చేదాకా ఈ ఇంటిలో అడుగుపెట్టకూడదని అనుకున్నాను కానీ మా ఇంటికి వచ్చి మమ్మల్ని పిలిచేసరికి అప్పును కోడలిగా అంగీకరించావని అనుకున్నాను కానీ ఇలా మాట్లాడతావని అసలు అనుకోలేదని అంటాడు కళ్యాణ్. ధాన్యలక్ష్మీ మాత్రం అవేమీ పట్టించుకోకుండా దీంతో ఉంటే నువ్వు ఎప్పటికీ సుఖపడవు కళ్యాణ్ అంటూ మాట్లాడుతుంది.
ఇంతలో కోపంగా అప్పు.. అనామికను వదిలించుకున్నట్టు నన్ను కూడా వదిలించుకోమని మీ కొడుకుకు బోధిస్తున్నారా..? అయితే ఇప్పుడు చెప్తున్నాను వినండి. ఇంత మంది పెద్దల ముందు చెప్తున్నాను. మీ కోట్ల ఆస్థి నాకు వద్దు. మీ కొడుకు గొడ్డు కారం వేసి పెట్టినా అమృతంలా తింటాను. మీ ఇంటికి ఇంకోసారి మీ కొడుకు వస్తానన్నా.. నేను రానివ్వను అని చెప్పి కళ్యాణ్‌ను తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతుంది అప్పు. దీంతో అందరూ షాకింగ్ గా చూస్తుంటారు. ఇంతలో ప్రకాష్ కోపంగా ధాన్యలక్ష్మీని తిడతాడు ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా…..?చెప్పు. చచ్చేదాకా వాడు రానన్నాడు. ఇప్పుడు ఏం చేస్తావు అంటూ నిలదీస్తాడు.
దీంతో ధాన్యలక్ష్మీ వాడు మన కొడకండి మన రక్తం పంచుకుపుట్టిన కొడుకండి.. వాడు దేనితోనైనా పోనివండి.. కానీ వాడికి న్యాయం జరగాలి అని అంటుంది. దీంతో అపర్ణ న్యాయం అంటే ఏం జరగాలి ధాన్యలక్ష్మీ. ఏం కోరుకుంటున్నావు నువ్వు అని అడుగుతుంది. దీంతో ధాన్యలక్ష్మీ ఆస్థిని ముక్కలు చేయండి. నా కొడుకు వాటా వాడికి ఇవ్వండి. అని చెప్పడంతో అందరూ షాక్ అవుతారు. రుద్రాణి, రాహుల్ మాత్రం హ్యాపీగీ ఫీలవుతారు. దీంతో ప్రకాష్ అసలు ఏమైందే నీకు ఏం మాట్లాడుతున్నావు నువ్వు. నోరు మూసుకుని లోపలికి వెళ్లు అంటూ తిడతాడు. దీంతో ధాన్యలక్ష్మీ ఇంకా నేను నోరు మూసుకుని ఎలా ఉంటాననుకున్నారు. ఇక్కడి దాకా వచ్చాక ఊరుకునేదే లేదు.
ఇన్ని కోట్ల ఆస్థిని అందరూ అనుభవిస్తుంటే.. నా కొడుకు ఆటో నడుపుతూ బతకాల్సిన కర్మ ఏంటి..? అంటూ నిలదీస్తుంది. ఇంతలో ఇందిరాదేవి కూడా ధాన్యలక్ష్మీని తిడుతుంది. ఆస్థి పంచడాలు అంటే చిన్న పిల్లల ఆట అనుకున్నావా..? ఆ ఆలోచన చేయడానికి కూడా నేను ఒప్పుకోను అంటూ కరాకండిగా చెప్పగానే రుద్రాణి ఎందుకు ఒప్పుకోవు అమ్మా.. రాజ్ ఒక్కడే ఈ ఆస్థిని అనుభవించాలా? అని అడుగుతుది. ఎవరి ఆస్థి వాళ్లకు పంచితే అందరిలాగా రాహుల్, కళ్యాణ్ బతుకుతారు కదా..? అని అడుగుతుంది రుద్రాణి. దీంతో ఇందిరాదేవి.. నువ్వె్వ్వరు..? నీకు నీ కొడుకుకు ఆస్థి ఎందుకు ఇవ్వాలి..? అసలు మీకు తిండి పెట్టి పోషించడమే గొప్ప అంటుంది. అవునా నన్ను తీసుకొచ్చి పెంచుకున్నారు కదా..? ఇప్పుడు ఆస్థిలో వాటా ఇవ్వకపోతే బాగుండదు అంటూ వార్నింగ్ ఇస్తుంది రుద్రాణి.
అందరూ ఆస్తి కోసం గొడవ పడుతుటే కావ్య, ధాన్యలక్ష్మీని చిన్నత్తయ్యా ఎందుకు మీకు ఇలాంటి బుద్ది పుట్టింది. నాలుగు రోజులు పోతే ఈ ఆవేశాలు అన్ని పోతాయి. మీ అబ్బాయి ఎక్కడికి పోతాడు అని నచ్చజెప్తుంటే… ధాన్యలక్ష్మీ కోపంగా నువ్వెవ్వరు నాకు నీతులు చెప్పడానికి. అసలు నీకేం హక్కు ఉంది అంటూ కావ్యను నానా మాటలు తిడుతుంది. దీంతో అపర్ణ, ధాన్యలక్ష్మీ నీకు అహంకారం తలకెక్కింది. పండంటి సంసారం ముక్కలు చేయాలని ఆలోచన మొదలైనప్పుడే నీలో స్వార్థం ఎంత మొదలైందో అర్తం అయింది. నీ మాజీ కోడలు అనామిక లాగా కోర్టుకు ఎక్కలేదు అంటూ తిట్టగానే ఎవరు ఎన్నైనా మాట్లాడండి కానీ నా కొడుక్కి న్యాయం జరగకపోతే ఈ ఇంటికి ఒకే కోడలు ఉంటుంది. నేను ఉండను అంటూ తెగేసి చెప్పడంతో సీతారామయ్య కల్పించుకుని ధాన్యలక్ష్మిని తనకు కొంచెం టైం ఇవ్వమని అడుగుతాడు. ఈ లోపు సమస్యకు పరిష్కారం ఆలోచిస్తానంటాడు. ధాన్యలక్ష్మీ సరే అంటూ లోపలికి వెళ్లిపోతుంది.
అనామిక హ్యాపీగా ఫీలవుతుంది. చాలా సంతోషంగా ఉందని సామంత్ తో చెప్తుంది. సామంత్ కూడా అనామికను అనుకున్నది సాధించావని.. కంగ్రాట్స్ చెప్తాడు. నువ్వు అనుకున్నది అనుకున్నట్లుగా చేస్తున్నావు కానీ దీని వల్ల నాకేంటి లాభం అని అడుగుతాడు. దీంతో అనామిక ఆ కుంటుంబంలో ఆస్తి గొడవలు ఎక్కువ అయితే కంపెనీని పట్టించుకోరు అప్పుడు కంపెనీ షేర్లు పడిపోతాయి. చివరకు ఆ కంపెనీని నువ్వు తక్కువకు కొనేయవచ్చు అని చెప్తుంది అనామిక. ఓ సూపర్ ఐడియా అంటూ సామంత్ అనామికను ఆకాశానికి ఎత్తుతాడు.
ఇంట్లో జరిగిన గొడవ గురించి కళ్యాణ్ ను తప్పు పడుతుంది అప్పు. నువ్వు ఆటో నడపడం వల్లే ఇంత గొడవ జరిగిందని కోట్లకు వారసుడైన కొడుకు ఆటో నడుపుతున్నాడంలే ఏ తల్లి అయినా ఇలాగే మాట్లాడుతుందని చెప్తుంది అప్పు. దీంతో నువ్వు కూడా నన్నే తప్పు పడుతున్నావా..? పొట్టి అని కళ్యాణ్ అడుగుతాడు. దీంతో అప్పు.. అవునని నువ్వు ఆటో నడపడం మానేయమని చెప్తుంది. ఆటో నడపకపోతే మన పరిస్థితి ఏంటో నీకు తెలుసు కదా? అంటాడు కళ్యాణ్. దీంతో నేను పిజ్జా డెలివరీ చేసి సంపాదిస్తాను. నువ్వు మాత్రం ఆ సినిమా రైటర్ దగ్గర చాన్స్ కోసం ప్రయత్నించు అని చెప్తుంది. కళ్యాణ్ వద్దని అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
ధాన్యలక్ష్మీని అడ్డుపెట్టుకుని ఎలాగైనా ఆస్తి పంపకాలు జరిగేలా చూడాలని రుద్రాణి అనుకుంటుంది. అందుకోసం ధాన్యలక్ష్మీని మరింత రెచ్చగొడుతుంది. నువ్వు ఎన్ని మాటలు మాట్లాడినా.. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆస్థి పంపకాలు జరగవని.. ఆ కావ్య ఏదైనా చేసి ఆస్థి పంపకాలు జరగనివ్వదని రెచ్చగొడుతుంది. దీంతో ధాన్యలక్ష్మీ ఈ సారి ఆస్థి పంపకాలు జరగకపోతే నేనేంటో చూపిస్తాను అంటూ రుద్రాణి వెళ్లిపోతుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.