Hair Care: ప్రతి ఒక్కరూ తమ జుట్టు పొడవుగా, ఒత్తుగా, అందంగా ఉండాలని కోరుకుంటారు. మీరు మీ జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచాలనుకున్నప్పుడు.. అనేక రకాల ఉత్పత్తులు మీకు చాలా సహాయపడతాయి. జుట్టు పొడవుగా, ఒత్తుగా, అందంగా ఆరోగ్యంగా ఉండేలా చూసుకునే విషయంలో హెయిర్ ఆయిల్స్ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. జుట్టు ఆరోగ్యంగా ఉండేందుకు ఎన్నో రకాల నూనెలను ఉపయోగిస్తుంటాం. వీటిలో కొన్ని నూనెలు మన జుట్టుకు మేలు చేస్తాయి. కానీ కొన్ని రకాల నూనెలు మీ జుట్టుకు హాని కలిగిస్తాయి. మరి జుట్టుకు ఎలాంటి ఆయిల్స్ వాడాలి? ఏ ఆయిల్స్ వాడకూడదు అనే విషయాలను గురించిన పూర్తి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మినరల్ ఆయిల్స్:
మీ జుట్టుకు హాని కలిగించే నూనె ఏదైనా ఉందంటే అది మినరల్ ఆయిల్ తప్ప మరొకటి కాదు. ఇది పెట్రోలియం నుండి తీస్తారు. మీ జుట్టు పొడవుగా, ఒత్తుగా ఉండాలని మీరు కోరుకుంటే మాత్రం మార్కెట్ లో దొరికే రసాయనాలు కలిపిన హెయిర్ ఆయిల్స్ అస్సలు వాడకూడదు. ఇది మీ జుట్టును మెరిసేలా మార్చగలుగుతుంది. కానీ దీనిని తరుచుగా వాడట వల్ల మీ జుట్టుపై మీకు తెలియకుండానే మందపాటి పొర తయారవుతుంది. దీని కారణంగా, తేమ మీ జుట్టులోకి చొచ్చుకుపోకండా ఉంటుంది.
సువాసన కలిగిన నూనెలు:
మార్కెట్‌లో దొరికే కొన్ని రకాల ఆయిల్స్ చాలా మంచి సువాసనను కలిగి ఉంటాయి. ఎందుకంటే వాటిలో సింథటిక్ సువాసనలు వాడతారు. ఈ సువాసన రావడానికి అనేక రకాల రసాయనాలు ఉపయోగిస్తారు. ఇలా తయారు చేసిన ఈ నూనెలను క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల అలెర్జీ, చికాకు ఏర్పడతాయి. ఇందులో ఉండే రసాయనాలు మీ జుట్టుకు నష్టం కలిగిస్తాయి. అంతే కాకుండా జుట్టును పూర్తిగా దెబ్బతీస్తాయి.
Also Read: సోంపు తింటే.. మతిపోయే లాభాలు !
సిలికాన్ హెయిర్ ఆయిల్ :
మీరు మీ జుట్టుకు సిలికాన్ ఆధారిత హెయిర్ ఆయిల్‌లను ఉపయోగించినప్పుడు.. అవి మీ జుట్టుకు చాలా హాని కలుగజేస్తాయి. అంతే కాకుండా ఇవి మీ జుట్టును రాలిపోయేలా చేస్తాయి. దీని కారణంగా, మీ జుట్టు నిర్జీవంగా కనిపించడం ప్రారంభమవుతుంది. సిలికాన్ ఆధారిత నూనెలను ఎక్కువగా ఉపయోగించడం వల్ల జుట్టు పూర్తిగా డ్యామేజ్ అవుతుంది. అంతే కాకుండా వీటిని తరుచుగా వాడటం వల్ల జుట్టు యొక్క ఆకృతిని పాడు చేస్తుంది. మీ స్కాల్ప్ కూడా జిడ్డుగా అనిపించడం ప్రారంభిస్తుంది. జుట్టుకు సంబంధించిన మార్కెట్ లో ఆయిల్స్ కొనేటప్పుడు రసాయనాలు లేకుండా చూసుకోండి. వీలైతే గానుగ పట్టిన కొబ్బరి, ఆముదం పూనెలను ఉపయోగించండి. వీటిని వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అంతే కాకుండా జుట్టు రాలకుండా ఉంటుంది. చుండ్రు తగ్గేందుకు కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
గమనిక: ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసమే. పలు పరిశోధనలు.. అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించదని గమనించగలరు.