BigTV English

RC 16 Update : మెగా కాంబో సెట్టు… “ఆర్సీ 16″లో మరో స్టార్ హీరో

RC 16 Update : మెగా కాంబో సెట్టు… “ఆర్సీ 16″లో మరో స్టార్ హీరో

RC 16 Update : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘గేమ్ ఛేంజర్’. శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా జనవరిలో రిలీజ్ కాబోతోంది. అయితే ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతుండగా, రామ్ చరణ్ తన నెక్స్ట్ మూవీ షూటింగ్లో బిజీ అయిపోయారు. ‘ఆర్సీ 16’ అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాకు బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుంచి క్రేజీ రూమర్ ఒకటి బయటకు వచ్చింది. రామ్ చరణ్ ‘ఆర్సి 16’ (RC 16) సినిమాలో మరో స్టార్ హీరో భాగం కాబోతున్నాడు అనేది ఆ వార్త సారాంశం.


బుచ్చిబాబు దర్శకత్వంలో, రామ్ చరణ్ (Ram Charan) హీరోగా తెరకెక్కుతున్న మరో పాన్ ఇండియా సినిమా ‘ఆర్సి 16’. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాహ్నవి కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ మైసూర్ లో జరుగుతుంది. షూటింగ్లో చరణ్ చాలా యాక్టివ్ గా పాల్గొంటున్నాడు. ఈ నేపథ్యంలోనే సినిమాలోని ఒక పవర్ ఫుల్ పాత్రలో సల్మాన్ ఖాన్ ను అనుకుంటున్నారట మేకర్స్. బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ తో ఈ మేరకు చిత్ర బృందం సంప్రదింపులు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. ఒకవేళ ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తే, ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ లో సల్మాన్ ఖాన్ పవర్ ఫుల్ ఎంట్రీ సినిమాపై మరింత అంచనాలు పెరిగే అవకాశం ఉంది.

నిజానికి మెగా ఫ్యామిలీతో సల్మాన్ ఖాన్ స్నేహబంధం గురించి అందరికీ తెలిసిందే. చిరంజీవితో పాటు ‘గాడ్ ఫాదర్’ సినిమాలో సల్మాన్ ఖాన్ అతిధి పాత్రలో కనిపించారు. అయితే ఈ రోల్ కోసం ఒక్క పైసా కూడా వసూలు చేయకపోవడం విశేషం. ఈ ఒక్క విషయాన్ని బట్టి మెగా ఫ్యామిలీతో సల్మాన్ కు ఎంత గాఢమైన స్నేహబంధం ఉందో చెప్పవచ్చు. ఇది మాత్రమే కాదు మెగా ఫ్యామిలీతో ఉన్న అనుబంధం నేపథ్యంలో సల్మాన్ ఖాన్ (Salman khan) హైదరాబాద్ కి వచ్చినప్పుడల్లా చరణ్ ఆయనకు ఆతిథ్యం ఇస్తూ ఉంటారు. ఇక చెర్రీ ముంబైకి వెళ్ళాడు అంటే చాలు బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఇంట్లో ఆతిథ్యాన్ని స్వీకరించాల్సిందే. ఇలాంటి బలమైన స్నేహ బంధం ఉన్న నేపథ్యంలో రామ్ చరణ్ సినిమాలో సల్మాన్ అతిథి పాత్ర పోషించడం అనేది ఆసక్తిని పెంచేస్తోంది. ఒకవేళ ఈ కాంబో సెట్ అయితే గనక దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ సంక్రాంతికి వచ్చే ఛాన్స్ ఉంది.


ఇప్పటికే ఈ సినిమాలో ‘మీర్జాపూర్’ మున్నా భయ్యా అలియాస్ దివ్యేందుని కీలకపాత్ర కోసం తీసుకున్నాం అని ప్రకటించి, సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశారు మేకర్స్. ఇక ఇప్పుడు సల్మాన్ ఖాన్ (Salman khan) కూడా భాగమైతే సినిమా బాక్సాఫీస్ ని తగలబెట్టేయడం ఖాయం అంటున్నారు మెగా అభిమానులు. కాగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన ‘గేమ్ ఛేంజర్’ సినిమా సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 10న థియేటర్లలోకి రాబోతోంది.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×