BigTV English

Beauty tips: కనురెప్పల వెంట్రుకలు దట్టంగా పెరిగితేనే అందం, ఇందుకోసం మీరు ఇంట్లోనే ఈ చిన్న చిట్కాలను పాటించండి

Beauty tips: కనురెప్పల వెంట్రుకలు దట్టంగా పెరిగితేనే అందం, ఇందుకోసం మీరు ఇంట్లోనే ఈ చిన్న చిట్కాలను పాటించండి

Beauty tips: ముఖంలో అందాన్ని ఇచ్చేవి కళ్ళే. కళ్ళు అనగానే కేవలం నల్లటి కనుగుడ్డే కాదు.. కళ్ళ ఆకారం, కనురెప్పలు, కనురెప్పలకు ఉన్న వెంట్రుకలు, కనుబొమ్మలు అన్నీ వస్తాయి. అవన్నీ అందంగా ఉంటేనే కళ్ళు అందంగా కనిపిస్తాయి. కొందరికి కనురెప్పలకు ఉండే వెంట్రుకలు చాలా పలచగా ఉంటాయి. వారు ఆర్టిఫిషియల్ కనురెప్పలను పెట్టుకుంటూ ఉంటారు. నిజానికి కొన్ని చిట్కాలను పాటించే ద్వారా కనురెప్పలకుండే వెంట్రుకలు దట్టంగా పెరిగేలా చేసుకోవచ్చు. కాస్త ఓపికగా కొన్ని పనులు చేయడం అలవాటు చేసుకోండి. కేవలం నెల రోజుల్లోనే మీరు మార్పును గమనిస్తారు.


కనురెప్పలు పెరిగేందుకు చిట్కాలు

కనురెప్పలపై ఉండే వెంట్రుకలు పెరిగేందుకు షియా బటర్ ఎంతో మేలు చేస్తుంది. కాస్త షియా బటర్‌ను వేలితో తీసుకొని నిద్రపోయే ముందు మీ కనురెప్పలకు సున్నితంగా మసాజ్ చేయండి. ఒక పావు గంట సేపు అలా వదిలేసి తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా ప్రతిరోజు చేస్తే కొన్ని రోజులకు మీకు కనరెప్పల వెంట్రుకలు పెరగడం ప్రారంభమవుతాయి.


కొబ్బరి నూనెతో

కొబ్బరి నూనె మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఒక స్పూను కొబ్బరి నూనె తీసుకొని అందులో దూది నుంచి మీ కనురెప్పల పైన రాస్తూ ఉండండి. కానీ కళ్లలోకి వెళ్ళకుండా జాగ్రత్త పడండి. రాత్రి పడుకునే ముందు ఇలా చేసి నిద్రపోండి. ఉదయం లేచాక చల్లని నీటితో శుభ్రం చేసుకోండి.

ఆముదం

ఆముదం వాసన బాగోకపోయినా అది చేసే మేలు మాత్రం ఎక్కువే. రాత్రి నిద్ర పోయేముందు కాస్త ఆముదాన్ని తీసి కనురెప్పల వెంట్రుకలకు రాసుకోండి. కళ్ళు మూసుకుని అప్లై చేస్తే కంటి లోపలికి వెళ్ళకుండా ఉంటుంది. అలానే నిద్రపోయి రోజూ దీన్ని శుభ్రం చేసుకోండి. కొన్ని రోజులకు కనురెప్పల వెంట్రుకలు మందంగా పెరగడం ప్రారంభమవుతాయి.

Also Read: ఎక్కువ సేపు స్మార్ట్ ఫోన్ చూడడంతో కంటి సమస్యలు.. ఈ సెటింగ్స్ తో మీ ఆరోగ్యం కాపాడుకోండి!

గ్రీన్ టీ

గ్రీన్ టీ బ్యాగులతో టీ చేసుకుని తాగేసాక ఆ బ్యాగులను పడేయకండి. వేడి నీటిలో ఆ బ్యాగ్ లోని గ్రీన్ టీ మిశ్రమాన్ని వేసి మళ్లీ మరిగించండి. కొంచెం నీళ్లలో మరిగిస్తే సరిపోతుంది. దాన్ని వడకట్టి ఆ నీటిని అప్పుడప్పుడు కనురెప్పలపై అప్లై చేస్తూ ఉండండి. ఇది అక్కడ జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

కలబంద

ప్రతి ఇంట్లోనూ ఇప్పుడు కలబంద మొక్క కనిపిస్తోంది. కలబంద ఆకును కట్ చేస్తే అందులోంచి సహజసిద్ధమైన జెల్ బయటికి వస్తుంది. ఆ జెల్ కనురెప్పలపై అప్లై చేయండి. ఒక అరగంట పాటు అలా వదిలేసి చల్లని నీటితో శుభ్రం చేసుకోండి. వీలైతే రాత్రి కనురెప్పలకి అప్లై చేసుకున్నాక నిద్రపోతే మంచిది. వరుసటి రోజు ఉదయం లేచాక క్లీన్ చేసుకోవాలి. ఇలా చేస్తే నెల రోజుల్లోనే మీకు వెంట్రుకలు కాస్త మందంగా చిక్కగా పెరగడం మొదలవుతాయి. కళ్ళు కూడా అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తాయి.

 

Related News

Non-vegetarian food: ముక్క లేనిదే ముద్ద దిగడం లేదా ? అయితే జాగ్రత్త !

Parenting Tips: పిల్లల అరుపులు ఎలా అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రులకు అవసరమైన సమాచారం

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Big Stories

×