BigTV English

OTT Movies : క్రైమ్ నుంచి కామెడీ దాకా…. ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్న అచ్చ మలయాళ సినిమాలు ఇవే

OTT Movies : క్రైమ్ నుంచి కామెడీ దాకా…. ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్న అచ్చ మలయాళ సినిమాలు ఇవే

OTT Movies : మలయాళం సినిమాలకు ఇప్పుడు ఓటీటీలో మంచి డిమాండ్ ఉంది. ప్రేక్షకుల నుంచి ఈ మలయాళ సినిమాలకు మంచి ఆదరణ లభిస్తోంది. సహజత్వానికి దగ్గరగా ఉండే స్టోరీలతో మాలీవుడ్ మేకర్స్ ప్రేక్షకులను అట్రాక్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల విడుదలైన టాప్ మలయాళ చిత్రాలను ఒకసారి చూద్దాం. వీటిలో ఎక్కువ భాగం కామెడీ అండ్ క్రైమ్, యాక్షన్ చిత్రాలే ఉన్నాయి.


నునక్కులి – జీ5 
దృశ్యం దర్శకుడు జీతూ జోసెఫ్ తెరకెక్కించిన నూనక్కులి చిత్రం తాజాగా ఓటీటీలో విడుదలై ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటోంది. ఊహించని ట్విస్ట్‌లతో సరదాగా సాగే ఈ సినిమాలో బాసిల్ జోసెఫ్ హీరోగా నటించాడు. ఈ మూవీ తెలుగులో కూడా అందుబాటులో ఉంది.

తలవన్ – సోనిలివ్
తలవన్ ఒక మలయాళ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సినిమా. ప్రస్తుతం సోనీలివ్ ఓటీటీలో ప్రసారం అవుతోంది. ఒక హత్య ఇద్దరు పోలీసు అధికారుల కెరీర్‌కు ముప్పు కలిగిస్తుంది. ఈ కుంభకోణం నుంచి వీరిద్దరూ ఎలా బయటపడ్డారు అనే కథను ఈ సినిమాలో ఇంట్రెస్టింగ్ గా చెప్పారు. ఊహించని ట్విస్ట్ లతో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీ కూడా సూపర్ గా ఉంటుంది.


వాజా – డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
వాజ ఒక మలయాళ కామెడీ డ్రామా. ఇది సోమవారం అంటే సెప్టెంబర్ 23 నుండి కన్నడలో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ప్రసారం కానుంది. జీవితంలో లక్ష్యం లేకుండా తిరుగుతూ ఓడిపోయిన ఐదుగురు స్నేహితుల చుట్టూ ఈ మూవీ తిరుగుతుంది. మలయాళంలో దీనికి మంచి స్పందన వచ్చింది.

Vaazha OTT release: When and where to watch biopic of billion boys

స్వకార్యం సంభవహులం – మనోరమ మాక్స్
స్వకార్యం సంభవహులం మూవీ ఊహించని మలుపులు, ట్విస్ట్ లతో కూడిన ఫ్యామిలీ డ్రామా. స్వకార్యం సంభవహులం చిత్రం కూడా ఇటీవల విడుదలై టాప్ 10 ఓటీటీ సినిమాలలో స్థానం దక్కించుకుంది. ఈ సినిమా మనోరమ మ్యాక్స్ అనే ఓటీటీలో ప్రసారం అవుతోంది. నజీర్ బహరుద్దీన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఒక కుటుంబం చుట్టూ తిరుగుతుంది. ఊహించని మలుపులతో చివరి వరకు మంచి థ్రిల్ ఇస్తుంది.

జలధార పంపుసెట్ సిన్స్ 1962 – జియో సినిమా
జలధార పంప్ సెట్ 1962 అనేది మరో మలయాళ కామెడీ ఎంటర్టైనర్. తన ఇంట్లోని పంపుసెట్‌ను దొంగిలించినందుకు భర్తను కోర్టు మెట్లు ఎక్కించిన  ఓ మహిళ కథ ఇది. ఈ సినిమాలో కామెడీతో పాటు అనేక సామాజిక అంశాల గురించి కూడా చూపించారు.

సిఐడీ రామచంద్రన్ రిటైర్డ్ ఎస్ఐ – మనోరమ మాక్స్
ఇది ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ. సంబంధం లేని కేసులో ఇరుక్కున్న యువకులకు న్యాయం చేయాలని రిటైర్డ్‌ ఎస్‌ఐ చేసే పోరాటమే ఈ చిత్రం. మలయాళ సినిమా నుంచి ఇప్పటికే ఎన్నో ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్లు వచ్చాయి. అందులో ఇదొకటి.

అడియోస్ అమిగో – నెట్‌ఫ్లిక్స్
అడియోస్ అమిగో కూడా మలయాళ హాస్య చిత్రం. ఈ సినిమాలో ఆసిఫ్‌ అలీ, సూరజ్‌ వెంజరమూడు ప్రధాన పాత్రల్లో నటించారు. బస్టాప్‌లో అనుకోకుండా కలిసే ఇద్దరు స్నేహితుల చుట్టూ తిరిగే సరదా కథ ఇది.

Related News

OTT Movie : భర్తే భార్యను వేరొకడితో … కుంభకోణాల ట్విస్ట్‌ లు, సీట్ ఎడ్జ్‌ థ్రిల్లర్ లు … ఒక్కసారి చూశారంటే

OTT Movie : డ్రగ్ ట్రాఫికింగ్ చుట్టూ తిరిగే బెంగాలీ సిరీస్ … తల్లీకూతుర్లదే అసలు స్టోరీ … IMDBలో కూడా మంచి రేటింగ్

OTT Movie : ఆటకోసం అబ్బాయిగా మారే అమ్మాయి … ట్రయాంగిల్ లవ్ స్టోరీతో అదిరిపోయే థ్రిల్లింగ్

OTT Movie : అడవిలో ఒంటరి అమ్మాయి … రాత్రీపగలూ అతడితోనే … క్లైమాక్స్ వరకూ రచ్చే

OTT Movies : ఈ వీకెండ్ ఓటీటీలోకి కొత్త సినిమాలు.. మిస్ అవ్వకుండా చూసేయ్యండి…

OTT Movie : కామాఠిపురంలో కాలుజారే ఒంటరి జీవితాలు … లాక్ డౌన్ మిగిల్చిన జ్ఞాపకాలు … ఒక్కో స్టోరీ ఒక్కో స్టైల్లో

Big Stories

×