E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

తేనె కాదు డ్రగ్స్.. కిలో రూ.10000.. ఈ తేనె కావాలంటే ప్రాణాలు ఫణంగా పెట్టాలి..

తేనె కాదు డ్రగ్స్.. కిలో రూ.10000.. ఈ తేనె కావాలంటే ప్రాణాలు ఫణంగా పెట్టాలి..
Advertisement

తేనె ఆరోగ్యానికి ఎంతో మంచింది. అయితే తేనెలో కూడా చాలా రకాలు ఉన్నాయి. వాటిలో ఒక ప్రత్యేకమైన తేనె “మ్యాడ్ హనీ”. హిమాలయ పర్వత ప్రాంతాల్లో మాత్రమే ఈ ప్రత్యేకమైన తేనె లభిస్తుంది. దీనిని స్థానికులు “మ్యాడ్ హనీ” అని పిలుస్తారు. ఈ తేనె ఎరుపు రంగులో ఉండి అడవుల్లో పెరిగే రోడోడెండ్రాన్ పువ్వుల నుంచి తయారవుతుంది. సాధారణ తేనెతో పోలిస్తే ఇందులో ప్రత్యేకమైన సహజ కెమికల్స్ ఉంటాయి. ఈ కెమికల్స్ కారణంగా ఈ తేనె తిన్నవారిలో మతిభ్రమించడం, తల తిరగడం, మత్తుగా అనిపిస్తుంది. ఒక రకంగా డ్రగ్స్ తీసుకున్నంత హాయిగా ఉంటుందట.

తరతరాలుగా కొనసాగుతున్న పురాతన సంప్రదాయం

మ్యాడ్ హనీ చరిత్ర శతాబ్దాల నాటిది. నేపాల్‌లోని గురుంగ్ జాతికి చెందిన వారు ఈ తేనె సేకరణ సంప్రదాయాన్ని తరతరాలుగా కొనసాగిస్తున్నారు. గతంలో దీన్ని ఔషధంగా ఉపయోగించేవారు. స్థానిక ప్రజలు దీని విలువను చాలా కాలం క్రితమే గుర్తించారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఈ తేనెకు ప్రత్యేక గుర్తింపు లభించడంతో విదేశీ పర్యాటకులు కూడా దీనిపై ఆసక్తి చూపుతున్నారు.

మ్యాడ్ హనీ సేకరించాలంటే ప్రాణాలు ఫణంగా పెట్టాలి

Advertisement

ఈ తేనెను సేకరించడం అత్యంత కష్టమైన పని. తేనె సేకరించే వేటగాళ్లు వసంత, శరదృతువులలో ఈ పని ప్రారంభిస్తారు. హిమాలయాల్లోని కాస్కీ, లామ్‌జుంగ్ వంటి ప్రాంతాలకు వెళ్తారు. ఎత్తైన కొండచరియలపై వేలాడే భారీ తేనెపట్టులను చేరుకోవడానికి సాధారణ తాళ్లు, వెదురు నిచ్చెనలను ఉపయోగిస్తారు. ఒక చిన్న పొరపాటు కూడా ప్రాణాపాయానికి దారితీస్తుంది. వీటికి తోడు ఆ ప్రాంతానికి చెందిన హిమాలయ తేనెటీగలు దాడి చేసే ప్రమాదం కూడా ఉంటుంది.

ప్రపంచంలో అత్యంత ఖరీదైన తేనెలలో ఒకటి

మ్యాడ్ హనీకి ప్రపంచ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. ఒక కిలో తేనె ధర దాదాపు రూ.10,000 వరకు ఉంది. అరుదుగా లభించడం, సేకరణలో ఉన్న ప్రమాదం, అంతర్జాతీయ డిమాండ్ వంటి కారణాలతో దీని ధర భారీగా పెరుగుతోంది. పర్యాటకులు, ఈ తేనె కోసం అధిక ధరలు చెల్లించడానికి సిద్ధంగా ఉంటారు.

ఈ తేనె ప్రత్యేకతలు

Advertisement

మ్యాడ్ హనీలో గ్రయానోటాక్సిన్ అనే సహజ పదార్థం ఉంటుంది. ఈ తేనెలో ఇదే పెద్ద హైలైట్. తక్కువ పరిమాణంలో తీసుకుంటే ప్రశాంతత, రిలాక్సేషన్ కలిగించవచ్చు. అయితే ఎక్కువగా తీసుకుంటే వికారం, తల తిరగడం, మతిభ్రమించి లేని వస్తువులు కనిపించడం వంటి సమస్యలు రావచ్చు. తీవ్రమైన సందర్భాల్లో తాత్కాలిక పక్షవాతం కూడా సంభవించే అవకాశం ఉంది.

ఆరోగ్య ప్రయోజనాలపై అనేక నమ్మకాలు

చాలామంది మ్యాడ్ హనీ ఆరోగ్యానికి మేలు చేస్తుందని నమ్ముతారు. కొందరు జీర్ణ సమస్యల కోసం ఉపయోగిస్తారు. మరికొందరు కీళ్ల నొప్పులు తగ్గుతాయని భావిస్తారు. లైంగిక ఆరోగ్యానికి కూడా ఉపయోగపడుతుందని కొందరు చెబుతారు. అయితే ఈ ప్రయోజనాలపై శాస్త్రీయ ఆధారాలు పరిమితంగానే ఉన్నాయి. అందువల్ల వైద్యుల సలహా లేకుండా దీనిపై పూర్తిగా ఆధారపడకూడదు.

Also Read: మీరు తరచూ రక్తదానం చేస్తున్నారా? అయితే ఈ విషయాల్లో జాగ్రత్త.. శరీరంలో జరిగే మార్పులు ఇవే

వేగంగా పెరుగుతున్న మ్యాడ్ హనీ పర్యాటకం

ఇటీవలి కాలంలో మ్యాడ్ హనీకి సంబంధించిన పర్యాటకం విస్తరించింది. ప్రత్యేక టూర్ కార్యక్రమాల ద్వారా పర్యాటకులు ఘలేగావ్, ఘన్పోఖరా వంటి గ్రామాలను సందర్శిస్తున్నారు. అక్కడ సంప్రదాయ తేనె వేటను ప్రత్యక్షంగా వీక్షిస్తారు. స్థానిక సంస్కృతి, జీవన విధానాన్ని కూడా తెలుసుకుంటారు. దీనివల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు మద్దతు లభిస్తోంది.

తేనె సేకరణలో పర్యావరణ సవాళ్లు

వాతావరణ మార్పులు హిమాలయ ప్రాంత జీవవైవిధ్యంపై ప్రభావం చూపుతున్నాయి. అడవుల నరికివేత, నిర్మాణ పనులు, అధిక వాణిజ్య డిమాండ్ తేనెటీగల నివాసాలను దెబ్బతీస్తున్నాయి. అధిక స్థాయిలో తేనె సేకరణ కూడా సమస్యగా మారుతోంది. ఈ పరిస్థితులు భవిష్యత్తులో మ్యాడ్ హనీ ఉత్పత్తిని తగ్గించే అవకాశం ఉంది.

Also Read: జెన్ Z కొత్త ట్రెండ్.. డేటింగ్స్ యాప్స్ దూరమవుతన్న యువత.. కారణాలివే

Related News

వర్షాకాలం వచ్చేసింది.. రోగనిరోధక శక్తిని పెంచే సూపర్ ఫుడ్స్ తినడం తప్పనిసరి

ఫాదర్ డే 2026.. రోజంతా నాన్నతో సంతోషంగా గడిపేందుకు ఈ పనులు చేయండి

ఫాదర్స్ డే సందర్భంగా.. నాన్నకు ప్రేమతో స్పెషల్ విషెస్ చెప్పండిలా!

బీర్‌కు బ్రీజర్స్‌కు మధ్య తేడా ఏంటీ? ఏది ఆరోగ్యకరం? ఏది డేంజర్?

ఈ తేదీలో పుట్టినవారిది దానం చేసే గుణం.. ఇవ్వడంలో ఎప్పుడూ ముందుంటారు

మౌనంగా ఉండడం మీకు అలవాటుగా మారిందా? ఈ 5 నష్టాలకు అదే కారణం.. ఈ పరిస్థితుల్లో నోరు విప్పాల్సిందే

రోగనిరోధక శక్తిని పెంచే నేరేడు షర్బత్.. రుచికరంగా కాలా జామున్ డ్రింక్ ఇలా చేయండి

Big Stories

×