E-Paper
Advertisement

పూర్వీకుల ఇంట్లో చిన్నారిని వెంటాడే పురాతన శాపం… మలయాళం ఫాంటసీ హారర్ థ్రిల్లర్

పూర్వీకుల ఇంట్లో చిన్నారిని వెంటాడే పురాతన శాపం… మలయాళం ఫాంటసీ హారర్ థ్రిల్లర్
Advertisement

Horror Movie : సమ్మర్ హాలిడేస్ అనగానే ప్రతి ఒక్కరికీ అమ్మమ్మ ఇళ్లే గుర్తొస్తుంది. కానీ తీరా అక్కడికి వెళ్ళాక నైట్ మేర్ లాంటి శాపం వెంటాడితే ఎలా ఉంటుంది ? ఊహించుకోవడానికే భయమేస్తోంది కదా. మరి ఆ శాపం ఓ ఎనిమిదేళ్ళ చిన్నారిని వెంటాడితే… ఇదే స్టోరీ లైన్ తో రూపొందిన మూవీ ‘గు’ (Gu). పైగా ఇదో మలయాళం హర్రర్ థ్రిల్లర్ కావడం విశేషం. మరి ఈ మూవీ కంప్లీట్ స్టోరీ ఏంటి ? ఎక్కడ చూడవచ్చు ? అనే విషయాలపై ఒక లుక్కేద్దాం పదండి.

స్ట్రీమింగ్ ఏ ఓటీటీలో ?

మలయాళ ఇండస్ట్రి ఫోక్‌లోర్, పురాణాలు, హారర్ ఎలిమెంట్స్‌ ను అద్భుతంగా మేళవించి సినిమాలు తీయడంలో ఎప్పుడూ ముందంజలో ఉంటుంది. అలాంటి విభిన్నమైన ఫాంటసీ హారర్ థ్రిల్లర్ ‘గు’ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. 2024 మేలో థియేటర్లలో విడుదలై, జూలైలో రీ-రిలీజ్ అయిన ఈ చిత్రం రెండేళ్ల తర్వాత డిజిటల్ స్క్రీన్స్‌పైకి వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. జూన్ 19 నుంచి ఈ మూవీ మనోరమ మ్యాక్స్ (Manorama Max)లో స్ట్రీమింగ్ అవుతోంది.

కథలోకి వెళ్తే…

Advertisement

కథ ఎనిమిదేళ్ల చిన్నారి అప్పు (దేవా నంద), అతని కజిన్ మిన్నా చుట్టూ తిరుగుతుంది. సాయి (సాయిజు కురుప్), అతని భార్య నిమిష తమ ఎనిమిదేళ్ల కూతురు మిన్నాతో (దేవా నంద) కలిసి మొదటిసారి తమ పూర్వీకుల ఇంటికి వస్తారు. చిన్నతనంలోనే అదే ఇంట్లో తన తల్లిని కోల్పోవడంతో సాయికి అక్కడకు రావడం పెద్దగా ఇష్టం ఉండదు. అయితే ఆ ఇంటికి వచ్చిన మిన్నాకు అక్కడి స్థానిక పురాణ గాథ అయిన ‘గుళికన్’ గురించి తెలుస్తుంది. స్థానిక నమ్మకాల ప్రకారం గుళికన్ అనే దైవ శక్తి పిల్లలను రక్షిస్తుందని నమ్ముతారు. ఈ కథలు మిన్నాను ఎంతగానో ఆకర్షిస్తాయి.

కానీ వాళ్ళు అక్కడికి చేరిన కొన్ని రోజుల్లోనే ఆ ఇంట్లో కొన్ని వింత సంఘటనలు జరగడం స్టార్ట్ అవుతుంది. మిన్నా కజిన్ అయిన పారు అనే అమ్మాయి ప్రవర్తన పూర్తిగా మారిపోతుంది. గతంలో ఆ ప్రాంగణంలో అకాల మరణం చెందిన ఒక అమ్మాయి ఆత్మ పారుకు పట్టిందని పెద్దలు నమ్ముతారు. ఆ దుష్టశక్తిని వెళ్లగొట్టడానికి కుటుంబ సభ్యులంతా కలిసి పెద్ద పూజలు, తంత్రాలు ప్లాన్ చేస్తారు. ఇక్కడే కథ ఊహించని టర్న్ తీసుకుంటుంది.

Advertisement

పెద్దల మాటలు, పురాణ గాథల కథలను విన్న మిన్నా… ఆ దుష్టశక్తి నుండి తన కజిన్ పారును కాపాడాలని డిసైడ్ అవుతుంది. మిన్నా తన మిగతా కజిన్స్‌ తో కలిసి ఒక సాహసోపేతమైన ‘మిషన్’ ప్రారంభిస్తుంది. పిల్లలందరూ కలిసి తమకు తెలిసిన గుళికన్ నమ్మకంతో ఆ దెయ్యాన్ని ఎలా ఎదుర్కొన్నారు ? ఇంతకీ ఆ దెయ్యం పారుకు ఎందుకు పట్టింది? ఈ క్రమంలో వాళ్ళు ఎదుర్కొన్న భయంకరమైన సంఘటనలు ఏంటి ? క్లైమాక్స్ లో ఏమయ్యింది ? అనేది మిగతా కథ.

మోహన్‌లాల్ గంభీరమైన వాయిస్ ఓవర్ ఇచ్చిన ఈ చిత్రంలో హారర్‌తో పాటు డ్రామా, ఎమోషన్, ఫ్యామిలీ బంధాలను కూడా అద్భుతంగా చూపించారు. సైజు కురుప్, అశ్వతీ మనోహరన్, నందిని గోపాలకృష్ణన్ వంటి నటీనటులు కీలక పాత్రల్లో మెరిశారు. కేరళ గ్రామీణ జానపద సంస్కృతి, పురాణాలు, మంత్రగత్తెల గాథలు, చిన్నారుల ధైర్యం, కుటుంబ బంధం, భయం మధ్య సాగే ఎమోషనల్ జర్నీ ఆకట్టుకుంటుంది. హారర్ ఎలిమెంట్స్‌తో పాటు హార్ట్‌వార్మింగ్ స్టోరీటెల్లింగ్ తో పాటు మోహన్‌లాల్ వంటి వాయిస్ ఓవర్ స్పెషల్ టచ్ తో ఈ సినిమా ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఈ సినిమా మనోరమ మ్యాక్స్లో జూన్ 19 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.

Read Also : ఈ ఇద్దరమ్మాయిల రచ్చ చూస్తే నిద్ర కరువు… సింగిల్ గా చూడాల్సిన మూవీ భయ్యా

Related News

ఇంట్లో కూర్చుని 80 లక్షల సంపాదన… హర్రర్ గేమ్ ఆడుతూ ఆగమాగం… ఈ హర్రర్ థ్రిల్లర్ పెద్దలకు మాత్రమే

నైట్‌క్లబ్‌లో లేడీ డాన్సర్ల పవర్ వార్… రెండు కొప్పులు ఒకే చోట ఇమడవు అంటే ఇదేనేమో… తెలుగులో టర్కిష్ మూవీ

చిల్లర బ్యాచ్ కాదు… సీట్-ఎడ్జ్ యాక్షన్‌తో పాటు కడుపుబ్బా నవ్వించే కామెడీ

సినిమా పిచ్చితో సీక్రెట్ పనులు… అపరిచితుడి ఎంట్రీతో అదిరిపోయే ట్విస్ట్… సింగిల్స్ కి మాత్రమే

కోటి బహుమతి కోసం ఎక్స్‌తో జోడీ… కట్ చేస్తే కాటికి తీసుకెళ్ళే ట్విస్ట్… సీక్రెట్ క్లబ్‌లో హారర్ మిస్టరీ

బైక్ పై ఇద్దరమ్మాయిల రచ్చ… అదిరిపోయే రోడ్ ట్రిప్ డ్రామా… నెవర్ బిఫోర్ కథ

కామాంధులను శిక్షించడానికి రంగంలోకి దిగే రహస్య శక్తి… మృత్యుదేవత విలయతాండవం

ఇన్సూరెన్స్ కోసం ముసలోళ్ల ఇంటికెళ్తే ఇదేం అరాచకం భయ్యా ? ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు హర్రర్ మూవీ

Big Stories

Advertisement
×