E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

Inzamam-ul-Haq: వ‌రుస‌గా మూడో ఓట‌మి..ఇక మీరు పాకిస్తాన్ లో అడుగుపెట్టొద్దు !

Inzamam-ul-Haq: వ‌రుస‌గా మూడో ఓట‌మి..ఇక మీరు పాకిస్తాన్ లో అడుగుపెట్టొద్దు !
Advertisement

Inzamam-ul-Haq:  మహిళల ప్రపంచకప్ 2026 టోర్నమెంట్ (2026 Women’s World Cup tournament) చాలా ఉత్కంఠ భరితంగా సాగుతోంది. ఈ టోర్నమెంట్ లో ఇప్పటికే 15 మ్యాచులు ఫినిష్ అయ్యాయి. శనివారం రోజున పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ మహిళల ( Pakistan Women vs Bangladesh Women, 15th Match) జట్ల మధ్య బిగ్ ఫైట్ జరిగింది. రోజ్ బౌల్, సౌతాంప్టన్ స్టేడియం (The Rose Bowl, Southampton) వేదికగా ఈ మ్యాచ్ జరిగింది. అయితే ఇందులో పాకిస్తాన్ అత్యంత దారుణంగా ఓటమిపాలైంది. బంగ్లాదేశ్ చేతిలో 23 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో ఈ టోర్నమెంట్ లో మొత్తం మూడు మ్యాచ్ లలో పాకిస్తాన్ ఓడిపోయినట్లు అయింది. ఈ క్రమంలో పాకిస్తాన్ ఓటమిపై మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హ‌క్ ( Inzamam ul-Haq ) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టి20 మహిళల ప్రపంచకప్ లో దారుణ ప్రదర్శన కనబరిచిన పాకిస్తాన్ క్రికెటర్లు… స్వదేశానికి రాకూడదని కోరారు. వస్తే అభిమానులందరూ, రాళ్లతో కొట్టే ప్రమాదం ఉందని హెచ్చరించారు. దీంతో ఇంజమామ్ ఉల్ హ‌క్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Also Read: Ravichandran Ashwin weighs in on Ishan Kishan: అఫ్ఘాన్ పై సెంచ‌రీ చేశాడ‌ని ఎగిరి ప‌డొద్దు..వ‌ర‌ల్డ్ క‌ప్ కు ఇషాన్ అస‌లు ప‌నికే రాడు

వ‌రుస‌గా మూడో ఓట‌మి…వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి పాక్ ఎలిమినేట్

Advertisement

మహిళల ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్లో (2026 Women’s World Cup tournament)  భాగంగా శనివారం పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ మహిళల జట్ల మధ్య బిగ్ ఫైట్ జరిగింది. ఈ మ్యాచ్ లో 23 పరుగుల తేడాతో పాకిస్తాన్ చిత్తుగా ఓడింది. ఈ మ్యాచ్ నేపథ్యంలో బంగ్లాదేశ్ మహిళల జట్టు మొదట బ్యాటింగ్ చేసింది. 20 ఓవర్లు వాడిన బంగ్లాదేశ్… ఆర్ వికెట్ల నష్టానికి 123 పరుగులు సాధించింది. ఇక ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో అట్టర్ ఫ్లాప్ అయింది పాకిస్తాన్. 20 ఓర్లు ముగిసే సమయానికి 8 వికెట్లు నష్టపోయిన పాకిస్తాన్.. 100 పరుగులు మాత్రమే. దీంతో 23 పరుగుల తేడాతో ఓడిపోయి.. వరల్డ్ కప్ నుంచి దాదాపు ఎలిమినేట్ అయింది.

పాకిస్తాన్ ఓటమిపై ఇంజమామ్ సీరియస్

మహిళల వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ లో (2026 Women’s World Cup tournament)  వరుసగా మూడో ఓటమి చవి చూసిన మహిళల పాకిస్తాన్ జట్టుపై మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హ‌క్ ( Inzamam-ul-Haq ) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దయచేసి పాకిస్తాన్ దేశానికి మళ్ళీ రాకండి… వస్తే విమానాశ్రయంలోనే రాళ్లతో కొడతారని హెచ్చరించారు. అంత ఆగ్రహంతో పాకిస్తాన్ అభిమానులు ఉన్నారని హింట్ ఇచ్చారు. కనీసం పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో అయినా నిలవాలని కోరారు. లేకపోతే టి20 మహిళల ప్రపంచ కప్ 2028 టోర్నమెంట్ ఆతిథ్య‌ హక్కులను కోల్పోవాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు ఇంజమామ్ ( Inzamam-ul-Haq ).

Advertisement

Also Read:  Tanveer Ahmed On ICC Womens World Cup 2026 Womens Pakistan Team: నీకు చేత కాక‌పోతే త‌ప్పుకో..కోచ్ వహాబ్ రియాజ్ కు వార్నింగ్

 

Related News

రిషబ్ పంత్ వ‌స్తే, కేఎల్ రాహుల్ ను తొక్కేస్తారు, ఢిల్లీని వ‌దిలితేనే బెట‌ర్‌ !

రోహిత్ శర్మ హ్యాట్రిక్ క్యాచ్ లు..కండ్లు తెరిచి చూడు అంటూ గంభీర్ పై ప‌ఠాన్ ఫైర్‌

పాకిస్తాన్ క్రికెట్ లో ముస‌లం…అత‌నితో బ‌ల‌వంతంగా రాజీనామా చేయించిన న‌ఖ్వీ

పాకిస్తాన్ కు మ‌రో టెన్ష‌న్‌…టాప్ 8లో నిల‌వ‌క‌పోతే అంతే సంగ‌తులు, 2028లో క‌ష్ట‌మే

ఎంతో క‌ష్ట‌ప‌డి జై షా ఈ స్థాయికి ఎదిగాడు..ఎవ‌రినీ బెదిరించి ICC ప‌ద‌వి ద‌క్కించుకోలేదు ! !

Kris Srikkanth: వైభ‌వ్ టెస్టులు ఆడితే, జ‌నాలు టీవీలకే అతుక్కుపోతారు

రేపే ట్రై సిరీస్ ఫైన‌ల్స్‌..వైభ‌వ్ దెబ్బ‌కు లంక ప్లేయ‌ర్ల ప్యాంట్లు త‌డ‌వ‌డం గ్యారెంటీ

Big Stories

×