Furniture Marks: ఫర్నీచర్‌పై మరకలు దాని అందాన్ని తగ్గిస్తాయి. కొన్నిసార్లు వీటిని తొలగించడం కూడా కష్టం అవుతుంది. చెక్క బల్లపై టీ-కాఫీ మరకలు పడినా, క్లాత్ సోఫాపై మరకలు పడినా కొన్ని రకాల టిప్స్ పాటించి వాటిని తొలగించవచ్చు. అంతే కాకుండా హోం రెమెడీస్ కూడా వీటిని తొలగించడానికి ఉపయోగించవచ్చు. మరి ఎలాంటి హెం రెమెడీస్ ఉపయోగించి ఫర్నీచర్‌పై ఉన్న మరకలను తొలగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఖరీదైన రసాయనాలను ఉపయోగించే బదులు.. మీ ఫర్నిచర్ కొత్తగా కనిపించేలా చేయడానికి మీరు కొన్ని సరళమైన , ప్రభావ వంతమైన చిట్కాలను ప్రయత్నించవచ్చు. ఈ చర్యలతో.. మీరు మరకలను తొలగించడమే కాకుండా ఫర్నిచర్ యొక్క మెరుపును కాపాడుకోవచ్చు.
1.నీటి గుర్తులను తొలగించడానికి:
కావాల్సినవి:
టూత్‌పేస్ట్ (జెల్ కానిది- తగినంత
బేకింగ్ సోడా
ఎలా వాడాలి ?
ముందుగా టూత్‌పేస్ట్ తీసుకుని దానికి కాస్త బేకింగ్ సోడా కలపండి. తర్వాత ఈ మిశ్రమాన్ని శుభ్రమైన క్లాత్‌తో మరకపై సున్నితంగా రుద్దండి. తర్వాత పొడి క్లాత్‌తో తుడవండి. ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అంతే కాకుండా ఇది మరకలను తొలగించడంలో కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది.
2.వేడి టీ / కాఫీ మరకలు:
కావాల్సినవి:
వెనిగర్ – అరకప్పు
ఆలివ్ ఆయిల్ – అరకప్పు
ఎలా వాడాలి ?
అర కప్పు వైట్ వెనిగర్ తీసుకుని దానిలో అర కప్పు ఆలివ్ ఆయిల్ వేసి మిక్స్ చేయండి.
ఈ మిశ్రమాన్ని శుభ్రమైన క్లాత్‌కు పట్టించి.. మరకలు ఉన్న ప్రదేశంలో సున్నితంగా అప్లై రుద్దండి. మరకలు ఉన్న చోట క్లాత్‌తో రుద్ది ఆ తర్వాత ఆరనివ్వండి. ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఎంతటి టీ మరకలు అయినా కూడా ఈజీగా తొలగిపోతాయి.
3.పెయింట్ లేదా స్క్రాచ్ మార్క్స్:
కావాల్సినవి:
బేకింగ్ సోడా – 1 కప్పు
నీరు- తగినంత
ఎలా వాడాలి ?
ముందుగా బేకింగ్ సోడాలో నీటిని కలిపి పేస్ట్ లాగా తయారు చేయండి. తర్వాత గీసిన లేదా పెయింట్ పడినా, లేదా ఇతర మరకలు ఉన్న ప్రదేశంలో దీనిని రుద్ది కాసేపటి తర్వాత క్లాత్ తో తుడవండి.
4. ఆహార పదార్థాల మరకలు:
కావాల్సినవి:
బేకింగ్ సోడా- 1 చిన్న కప్పు
నీరు- తగినంత
వెనిగర్- చిన్న కప్పు
ఎలా వాడాలి ?
ముందుగా ఒక గిన్నెలో 1 టీస్పూన్ బేకింగ్ సోడా, 2 టీస్పూన్ల వెనిగర్, 1 కప్పు నీటిని వేసి మిక్స్ చేయండి. తర్వాత దానిని స్ప్రే బాటిల్‌లో పోసి మరక మీద చల్లుకోండి.
5-10 నిమిషాలు అలాగే ఉంచండి. తరువాత శుభ్రమైన క్లాత్‌తో తుడవండి. ఈ పద్ధతి చాక్లెట్ లేదా రసం మరకలను కూడా తొలగిస్తుంది.
5. లెదర్ సోఫా:
కావాల్సినవి:
ఆల్కహాల్ – తగినంత
కాటన్ బాల్స్
ఎలా వాడాలి ?
కాటన్ బాల్‌కు రబ్బింగ్ ఆల్కహాల్ రాయండి. తర్వాత వీటితో మరక మీద తేలికగా రుద్దండి. తర్వాత శుభ్రమైన, పొడి క్లాత్‌తో తుడిచి ఆరనివ్వండి. మరక పోకపోతే.. వెనిగర్, నీటిని ఉపయోగించండి.
6. గ్రీజు, జిడ్డు మరకలు:
కావాల్సినవి:
మొక్కజొన్న పిండి
Also Read: దోసకాయ తింటే గుండె, కిడ్నీలకు మేలు.. ఇంకా ఎన్నో లాభాలు !
ఎలా వాడాలి ?
మరక మీద కొద్దిగా మొక్కజొన్న పిండి చల్లుకోండి. ఇది అప్పుడే పడిన గ్రీజు మరకలను గ్రహిస్తుంది. తర్వాత దీనిని తర్వాత శుభ్రమైన క్లాత్‌తో తుడవండి. మొండి మరకలు అయితే.. నీటిలో కొద్దిగా డిష్ వాష్ బార్ కలిపి ఉపయోగించండి. మంచి ఫలితం ఉంటుంది.