Manchu Family: ఇండస్ట్రీలో ఎంతోకాలంగా ఉంటూ చాలామంది అభిమానులను సంపాదించుకున్న నటుడు మోహన్ బాబు. అసలు ఆఫ్ స్క్రీన్ మోహన్ బాబు ఎలా ఉంటారో, ఆయన డెడికేషన్ ఏంటో ఇప్పటికీ చాలామంది మేకర్స్ మాట్లాడుకుంటూనే ఉంటారు. అలా 50 ఏళ్లలో ఎన్నో వైవిధ్యభరితమైన పాత్రలు, గుర్తుండిపోయే సినిమాలు చేసి చాలామందికి ఫేవరెట్ అయిపోయారు మోహన్ బాబు. ఇక ఆయన ఇండస్ట్రీలోకి వచ్చి 50 ఏళ్లు అయిన సందర్భంగా ఈ ఏడాది ఆయన పుట్టినరోజును ఘనంగా నిర్వహించాలని సినీ సెలబ్రిటీలు నిర్ణయించుకున్నాడు. కానీ ఈ వేడుకల గురించి, అసలు అక్కడికి మనోజ్‌కు ఆహ్వానం అందుతుందా అనే విషయంపైనే హాట్ టాపిక్ నడుస్తోంది.
ఈసారి స్పెషల్‌గా
ప్రతీ ఏడాది మోహన్ బాబు చాలావరకు తన కుటుంబంతోనే పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటారు. కానీ ఈ ఏడాది కాస్త స్పెషల్. ఆయన ఇండస్ట్రీలో అడుగుపెట్టి 50 ఏళ్లు కావడంతో ఈ ఏడాది ఆయన పుట్టినరోజుతో పాటు ఈ 50 ఏళ్ల సెలబ్రేషన్‌ను కూడా కలిపి చేయాలని టాలీవుడ్‌లో ఆయన సన్నిహితులు ఫిక్స్ అయ్యారు. చాలాకాలంగా దీని గురించి ప్లాన్ చేస్తున్నారు కూడా. అయితే ఈ ప్లానింగ్ జరుగుతున్న సమయంలోనే మంచు ఫ్యామిలీలో గొడవలు మొదలయ్యాయి. ముఖ్యంగా మోహన్ బాబుకు, తన కుమారుడు అయిన మంచు మనోజ్‌కు మధ్య దూరం చాలా పెరిగిపోయింది. దీంతో అసలు మంచు మనోజ్ ఈ వేడుకలకు వస్తాదా అని ప్రేక్షకుల్లో చర్చలు మొదలయ్యాయి.
సెలబ్రిటీలకు ఆహ్వానం
ఇప్పటికే తిరుపతిలో అయిదు రోజులుగా మోహన్ బాబు (Mohan Babu) పుట్టినరోజు వేడుకలు జరుగుతూనే ఉన్నాయి. ఇక బర్త్ డే రోజున, దాంతో పాటు ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్లు అయిన సందర్భాన్ని కూడా సెలబ్రేట్ చేసుకోనున్నారు ఈ సీనియర్ యాక్టర్. ఇప్పటికే బుధవారం జరగనున్న సెలబ్రేషన్స్‌కు ‘కన్నప్ప’ టీమ్‌తో పాటు పలువురు టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీలకు కూడా స్పెషల్‌గా ఆహ్వానం అందిందని సమాచారం. ముఖ్యంగా టాలీవుడ్ సెలబ్రిటీలు చాలామంది కలిసి ఈ సెలబ్రేషన్స్‌ను గ్రాండ్ సక్సెస్ చేయాలని నిర్ణయించుకున్నారట. మరి మంచు మనోజ్ పరిస్థితి ఏంటి.? తనను పిలుస్తారా.? పిలిచినా వస్తాడా.? అని అందరిలో సందేహాలు మొదలయ్యాయి.
Also Read: మేము బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేయలేదు.. సుప్రిత కేసుపై స్పందించిన సురేఖ వాణి
ఆస్తి తగాదాలు
కొన్నాళ్ల క్రితం మంచు ఫ్యామిలీలో ఆస్తి వివాదాలు మొదలయ్యాయి. అవి కాస్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా మంచు మనోజ్ (Manchu Manoj).. తన తండ్రి మోహన్ బాబుపై తీవ్ర ఆరోపణలు చేశాడు. మోహన్ బాబు యూనివర్సిటీలో జరుగుతున్న తప్పుల గురించి కూడా బహిరంగంగా మాట్లాడాడు. ఇక మోహన్ బాబు కూడా మనోజ్ తన కొడుకే కాదు అన్నట్టుగా వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికీ ఈ కుటుంబంలో సమస్యలు తీరలేదు. సంక్రాంతి సమయంలో కూడా మంచు మనోజ్‌ను యూనివర్సిటీ లోపలికి రానివ్వలేదు మోహన్ బాబు. మరి ఇప్పుడు తన పుట్టినరోజు వేడుకలకు రానిస్తారా లేదా చూడాలి. తనతో పాటు మంచు లక్ష్మి కూడా ఈ వేడుకలకు వెళ్లడం డౌటే అని తెలుస్తోంది.