BigTV English

Pimple: ముఖంపై మొటిమలా ? ఇలా చేస్తే ప్రాబ్లమ్ సాల్వ్

Pimple: ముఖంపై మొటిమలా ? ఇలా చేస్తే ప్రాబ్లమ్ సాల్వ్

Pimples: మారుతున్న వాతావరణంతో పాటు అనేక కారణాలు ముఖంపై మొటిమలు వచ్చేలా చేస్తాయి. చర్మం సున్నితంగా ఉంటే మాత్రం అన్ని సీజన్లలో ఈ సమస్య పెరుగుతుంది. మొటిమల వల్ల మచ్చలు వచ్చే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది. మారుతున్న సీజన్ ప్రకారం చర్మంపై ఆయిల్ , తేమ స్థాయిలు చాలా వరకు మారతాయి. ఇవే మొటిమలకు కారణం అవుతాయి. ఇటువంటి సమయంలోనే ముఖంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం. మొటిమలపై శ్రద్ధ చూపకపోతే ముఖాన్ని మొత్తం పాడు చేస్తాయి.


ముఖాన్ని శుభ్రం చేసుకోవడం:

వాతావరణం మారుతున్నప్పుడు ముఖంపై నూనె పేరుకుపోతుంది. ఇది మొటిమలు రావడానికి కారణం అవుతుంది. ఇలా జరగకుండా ఉండాలంటే రోజుకు రెండు సార్లు తప్పకుండా ఫేస్ వాష్ చేసుకోవాలి. ఇలా చేస్తే చర్మం శుభ్రంగా ఉంటుంది. అంతే కాకుండా ముఖ రంధ్రాలు మూసుకుపోకుండా ఉంటాయి. ఫేస్ వాష్ చేసిన ప్రతీ సారి మృదువైన క్లాత్‌తో వాష్ చేయండి.


మాయిశ్చరైజర్ వాడండి:
ముఖం కడుక్కున్న తర్వాత చర్మం తేమగా ఉండటం కోసం మాయిశ్చరైజర్ వాడటం ముఖ్యం. ముఖ్యంగా పొడిబారిన , నిర్జీవంగా ఉన్న చర్మానికి మాయిశ్చరైజర్ వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. మీ చర్మ రకాన్ని బట్టి మాయిశ్చరైజర్ ఎంపిక చేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

చర్మాన్ని ఎక్స్ ఫోలియేట్ చేయండి:
వారానికి ఒకటి లేదా రెండు సార్లు స్క్రబ్ లేదా పసుపు , శనగపిండితో తయారు చేసిన ఫేస్ ప్యాక్ వాడటం మంచిది. ఇది సహజ ఎక్స్ ఫోలియేటర్ గా పనిచేస్తుంది. ముఖంపై పేరుకుపోయిన చర్మ కణాలను తొలగించడానికి ఇది చాలా బాగా పనిచేస్తుంది.మీరు బయట మార్కెట్ నుండి ఎక్స్ ఫోలియేటింగ్ క్లెన్సర్ లను కొనుగోలు చేస్తే మాత్రం ముందుగా ప్యాచ్ టెస్ట్ చేయండి.

బంగాళదుంప , రోజ్ వాటర్:
మీ ముఖంపై తరచుగా మొటిమలు వస్తుంటే గనక మీరు గులాబీ లేదా బంగాళదుంపలను ఉపయోగించవచ్చు. రోజ్ వాటర్ లేదా బంగాళదుంపల రసాన్ని మొటిమలపై అప్లై చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అంతే కాకుండా ఇది చర్మానికి పోషణను అందిస్తుంది. అంతే కాకుండా మొటిమలను కూడా తగ్గిస్తుంది.

పోషకాహారం తినండి:
మనం తినే ఆహారం కూడా మొటిమలు రావడానికి కారణం అవుతుంది. మీరు ఆకు కూరలు. పండ్లు, విటమిన్లు అధికంగా ఉన్న ఆహార పదార్థాలు తింటే మంచి ఫలితం ఉంటుంది. ఆకు పచ్చ కూరగాయలు, పండ్లు, విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాలను చేర్చుకోవాలి. చాక్లెట్ల వంటివి అస్సలు తినకూడదు. ఇది పగుళ్లకు కారణం అవుతాయి. అందుకే శరీరానికి నష్టం చేసే పదార్థాలను తినకుండా ఉండటం మంచిది.

Also Read: తరచుగా వ్యాధుల బారిన పడుతున్నారా ? అయితే ఇవి తినండి

బాగా నిద్రపోండి:
కొన్ని సార్లు మీ ముఖం మీద మొటిమలు ఒత్తిడి, నిద్ర లేకపోవడం వల్ల కూడా వస్తాయి. సరిగ్గా నిద్ర పోకపోతే మాత్రం మీరు తప్పకుండా తగినంత నిద్ర పోయేలా చేసుకోండి. 7- 8 గంటల నిద్ర ప్రతి ఒక్కరికీ అవసరం. శరీరానికి తగినంత నీరు త్రాగడం కూడా అలవాటు చేసుకోండి.

Related News

Heart Problems: రాత్రిపూట తరచూ గురక.. నిర్లక్ష్యం చేస్తే తీవ్రమైన 5 ఆరోగ్య సమస్యలు

Thyroid Disease: థైరాయిడ్ ఉన్న వారు.. పొరపాటున కూడా ఇవి తినొద్దు !

Easy Egg Recipes: ఎగ్స్‌తో తక్కువ టైంలో.. సింపుల్‌గా చేసే బెస్ట్ రెసిపీస్ ఇవే !

Dondakaya Fry: పక్కా ఆంధ్రా స్టైల్ దొండకాయ ఫ్రై.. ఇలా చేస్తే సూపర్ టేస్ట్

Health tips: గుండెల మీద ఎవరైనా కూర్చొన్నట్లు అనిపిస్తోందా? దానిని ఏమంటారో తెలుసా?

Navratri Fasting: నవరాత్రి ఉపవాస సమయంలో.. ఈ ఫుడ్ తింటే ఫుల్ ఎనర్జీ !

Fast Eating: టైం లేదని వేగంగా తింటున్నారా ? ఎంత ప్రమాదమో తెలిస్తే ఈ రోజే మానేస్తారు !

Dates Benefits: డైలీ రెండు ఖర్జూరాలు తింటే ? బోలెడు లాభాలు !

Big Stories

×