BigTV English

Samantha: నిర్మాణ సంస్థలపై హాట్ బాంబ్ పేల్చిన సమంత.. బేధాభిప్రాయాలు ఎక్కువంటూ..?

Samantha: నిర్మాణ సంస్థలపై హాట్ బాంబ్ పేల్చిన సమంత.. బేధాభిప్రాయాలు ఎక్కువంటూ..?

Samantha:స్టార్ హీరోయిన్ సమంత (Samantha) రీసెంట్ గా ఓ నిర్మాణ సంస్థను స్థాపించిన సంగతి మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నిర్మాణ సంస్థ గురించి వైరల్ కామెంట్స్ చేసింది. అంతేకాకుండా నా లాగా ఏ అమ్మాయి పరిస్థితి కాకూడదు అంటూ సమంత మాట్లాడిన మాటలు ప్రస్తుతం ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. మరి ఇంతకీ సమంత ఎందుకు ఆ మాటలు మాట్లాడింది.. వేరే వాళ్ళ జీవితం నాలా కాకూడదు అని సమంత (Samantha) మాట్లాడడానికి రీజన్ ఏంటి? అనేది ఇప్పుడు చూద్దాం.. సినిమా ఇండస్ట్రీ స్టార్ట్ అయినప్పటి నుండే హీరోలకు ఎక్కువ రెమ్యూనరేషన్స్, హీరోయిన్లకు తక్కువ రెమ్యూనరేషన్స్ అనే తంతు కొనసాగుతోంది. కానీ ఈ విషయంలో కొంతమంది హీరోయిన్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తారు.


హీరోయిన్లకు తక్కువ రెమ్యూనరేషన్ ఇస్తారు..

అయితే ఆ హీరోయిన్ల లిస్టులో సమంత కూడా చేరిపోయింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నేను ఎన్నో సినిమాల్లో చేశాను. కానీ హీరోల కంటే హీరోయిన్లకు తక్కువ రెమ్యూనరేషన్ ఇస్తారు. నాకు సినిమాల్లో అనుభవం ఎక్కువగానే ఉన్నా కూడా రెమ్యూనరేషన్ మాత్రం తక్కువగా ఇచ్చేవారు. కానీ ఈ విషయం నాకు అస్సలు ఇష్టం లేదు. నేను ఏదైనా సరే అందరూ సమానమే అని చూస్తాను. అందుకే నా నిర్మాణ సంస్థలో ఇలాంటి అవకతవకలు జరగకుండా నా నిర్మాణ సంస్థలో పనిచేసే స్త్రీలకు కూడా ఒకే రకమైన గౌరవం, రెమ్యూనరేషన్ ఇస్తాను. నేను అనుభవించిన పరిస్థితులు నాలాగా మరో అమ్మాయి అనుభవించకూడదు అనే ఉద్దేశంతో నా నిర్మాణ సంస్థల్లో అందరికీ ఒకే విధమైన చెల్లింపులు చేస్తాను. ఇక ఈ సమాజంలో ఆడవాళ్లు అంటే కేవలం పెళ్లి చేసుకొని పిల్లల్ని కనడం మాత్రమే అన్నట్టు చూస్తారు. కానీ ఇది మాత్రమే జీవితం కాదు.


నా నిర్మాణ సంస్థలో అందరినీ సమానంగా చూస్తాను..

కేవలం ఆడవాళ్లు అంటే పెళ్లి చేసుకొని, పిల్లల్ని కనడం వరకే అని ఆలోచించడం అనేది చాలా పెద్ద తప్పు.. ఆడవాళ్లు సమాజం చెప్పినట్టు కాకుండా తమకు ఇష్టమైన విధంగా ఉండి తాము ఏం చేయగలుగుతామో, ఆ పని చేసి చూపించాలి. ఇలా చేస్తే ఆ అమ్మాయిలు కూడా హ్యాపీగా ఉంటారు. అలాగే నేను నా నిర్మాణ సంస్థలో పనిచేసే వాళ్ళని చాలా బాధ్యతగా, భద్రతగా చూసుకుంటాను. ఇండస్ట్రీ అనేది నా రెండో ఇల్లు లాంటిది. అందుకే నేను నా రెండో ఇల్లుని కూడా చాలా నీట్ గా ఉంచుకోవడమే కాకుండా అందులో ఉండే వాళ్ళందరినీ కాపాడుకుంటాను అంటూ సమంత చెప్పుకొచ్చింది. అయితే సమంత (Samantha) హీరోలకు ఎక్కువ రెమ్యూనరేషన్, హీరోయిన్లకు తక్కువ రెమ్యూనరేషన్ అని మాట్లాడడంతో చాలామంది నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. అనుభవం ఉన్నా కూడా తక్కువ రెమ్యూనరేషన్ ఇస్తున్నారని మీరు అంటున్నారు. కానీ అది చాలా తప్పు..ఎందుకంటే హీరోల ఇమేజ్ ని బట్టి వారి రేంజ్ మార్కెట్లో ఏ విధంగా ఉందో అని తెలుసుకొని నిర్మాతలు డబ్బులు ఇస్తారు. హీరోలను చూడ్డానికే చాలామంది జనాలు థియేటర్లకు వస్తారు అంటూ సమంత (Samantha)కు కౌంటర్లు ఇస్తున్నారు. మొత్తానికైతే నిర్మాణ సంస్థలన్నింటిపై కూడా సమంత హాట్ బాంబ్ పేల్చిందని పలువురు నెటిజెన్స్ కామెంట్లు చేస్తున్నారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×