Pooja Hegde : బుట్ట బొమ్మ పూజా హెగ్డే (Pooja Hegde) మరోసారి రీఎంట్రీలో వరుస అవకాశాలతో దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ అమ్మడు ‘దేవా’ (Deva) అనే బాలీవుడ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా ‘దేవా’ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఆమె తనకు లైఫ్ ఇచ్చిన ‘అల వైకుంఠపురం’ (Ala Vaikunthapurramuloo) లో మూవీ గురించి మాట్లాడుతూ నోరు జారిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో నెటిజన్లు బుట్ట బొమ్మను ఏకి పారేస్తున్నారు.
‘అల వైకుంఠపురం’లో మూవీ ఏ భాషదో కూడా తెలీదా?
షాహిద్ కపూర్ (Shahid Kapoor) హీరోగా నటించిన హిందీ చిత్రం ‘దేవా’ (Deva). ఇందులో పూజా హెగ్డే (Pooja Hegde) హీరోయిన్ గా నటించగా, రోషన్ ఆండ్రూస్ అనే మలయాళ డైరెక్టర్ దర్శకత్వం వహించారు. రీసెంట్ గా థియేటర్లోకి వచ్చిన ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వస్తోంది. ఈ మూవీ ప్రమోషన్ లో భాగంగా పూజా హెగ్డే మాట్లాడుతూ ‘అల వైకుంఠపురం’లో మూవీ తమిళ సినిమా అని చెప్పడం వివాదానికి దారి తీసింది. పూజా హెగ్డే మాట్లాడుతూ “అల వైకుంఠపురంలో (Ala Vaikunthapurramuloo) అనే తమిళ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో రీచ్ అయ్యింది. అలాగే డీజే మూవీ నార్త్ లో కూడా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది” అంటూ చెప్పుకొచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, అల్లు అర్జున్ ఫ్యాన్స్ పూజా హెగ్డేను ట్రోలింగ్ తో ఓ ఆట ఆడుకుంటున్నారు.
పూజా హెగ్డేను ఏకి పారేస్తున్న బన్నీ ఫ్యాన్స్
పూజా హెగ్డే (Pooja Hegde) కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంటే ముందుగా గుర్తొచ్చే మూవీ ‘అల వైకుంఠపురంలో’. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీలో అల్లు అర్జున్ హీరోగా నటించారు. ఇక ఈ మూవీ తర్వాత పూజా హెగ్డే కి విపరీతమైన పాపులారిటీ దక్కింది. ముఖ్యంగా ఆమెను దేశవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ ముద్దుగా బుట్టబొమ్మ అని పిలుచుకోవడం మొదలు పెట్టారు. అప్పటిదాకా యావరేజ్ సినిమాలు చేసిన పూజా కెరీర్ కు ఈ మూవీనే మంచి బూస్ట్ ఇచ్చింది. బ్లాక్ బస్టర్ హిట్ ను ఇచ్చింది.
ఇక తాజా వైరల్ వీడియోను చూశాక ఇంతటి గుర్తింపునిచ్చిన ఈ మూవీ అసలు ఏ భాష మూవీలో కూడా తెలియకుండా సినిమాలు చేస్తోంది పూజా హెగ్డే అంటున్నారు బన్నీ ఫ్యాన్స్. “నీకు కైఫ్ ఇచ్చిన మూవీ ఏ భాషలో రూపొందిందో కూడా తెలియకుండా చేసావా?” అంటూ కామెంట్స్ తో ఏకిపారేస్తున్నారు. ఈ మూవీ 250 కోట్లకు పైగా కలెక్షన్లను కొల్లగొట్టి, బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత పూజా హెగ్డే ను వరుసగా ఫ్యాన్ ఇండియా అవకాశాలు పలకరించాయి. కానీ ఆమె అసలు ఈ సినిమానే ఏ భాషకు చెందిందో గుర్తుపెట్టుకోలేకపోవడం విమర్శలకు దారి తీస్తోంది.
If Ala Vaikunthapuram lo is a Tamil film
They’d call it
Ala church lo …@hegdepooja how did you miss such basic pointpic.twitter.com/5KwAmPIWgU
— 🧠 (@BackupBrainy) February 3, 2025