BigTV English

Tips To Keep Lizards Out Of Kitchen: కిచెన్‌లో బల్లి తిరుగుతోందా?.. ఈ చిట్కాలు పాటిస్తే ఇక రావు!

Tips To Keep Lizards Out Of Kitchen: కిచెన్‌లో బల్లి తిరుగుతోందా?.. ఈ చిట్కాలు పాటిస్తే ఇక రావు!

Tips To Keep Lizards Out Of Kitchen| మీరెప్పుడైనా సంతోషంగా ఇంట్లో మీకిష్టమైన వంట చేస్తున్నప్పుడు కిచెన్ లో గోడలపై బల్లి తిరుగుతుంటే మీకెలా అనిపిస్తుంది. చాలామందికి బల్లిని చూస్తే.. ఒళ్లు చలిస్తుంది. బల్లి అంటే కంపరంగా భావిస్తారు. కిచెన్ లో అపరిశుభ్రంగా ఉండడంతో ఏదైనా పురుగులు లాంటి ఆహారం దొరుకుతుందని బల్లులు వంటగదిలోకి తిరుగుతుంటాయి. ఇదంతా చూసి చాలామంది బల్లిని తరిమేందుకు ఏదైనా కెమికల్ స్ప్రే చేస్తూ ఉంటారు. కానీ బల్లులను కిచెన్ వరకు రానివ్వకుండా చిన్న చిన్న నాచురల్ చిట్కాలున్నాయి.


కోడి గుడ్డు పెంకులు (egg shells): వంట గదిలో మీరు ఎగ్ కర్రీ, ఎగ్ బుర్జీ వంటి కోడి గుడ్డు వంటకాలు చేశాక వాటి పెంకులు పడేయకండి. అవి బల్లిని కిచెన్ లో రానివ్వకుండా ఉపయోగపడతాయి. బల్లికి కోడి గుడ్డు పెంకులోని పచ్చి వాసన నచ్చదు. అందుకే ఆ కోడి గుడ్డు పెంకులను కిచెన్‌లోని మూలల్లో లేదా బల్లి తిరిగే చోట పెట్టండి. ప్రతి రెండు మూడు రోజులకోసారి ఆ పెంకులను పడేసి మళ్లీ తాజా పెంకులన పెట్టండి.

కీరా దోశ (cucumber): మనం కిచెన్ లో సలాడ్, పెరుగు రాయితా చేసేందుకు కీరా దోశకాయ ఉపయోగిస్తుంటాం. ఈ కీర దోశ వాసన కూడా బల్లికి పడదు. పైగా కీరా దోశ ముక్కలు కిచెన్ లో పెట్టినప్పుడు ఫ్రెష్ నెస్ ఫీలింగ్ కలిగిస్తాయి. వంట చేసే ప్రాంతానికి సమీపంగా కీర దోశ ముక్కలు పెట్టండి.. బల్లి ఆ దరిదాపుల్లోకి రాదు.


Also Read: సింహాసనంపై శునకం.. రూ.3300 కోట్ల ఆస్తికి అధిపతి ఈ కుక్క.. ప్రైవేట్ ప్లేన్, బిఎండబ్ల్యూ కారు.. చీర్ గర్ల్స్

కాఫీ పౌడర్, పొగాకు : కాఫీ పౌడర్ ప్రతి ఇంట్లో ఉంటుంది. ఈ కాఫీ పౌడర్, పొగాకుని బాగా క్రష్ చేసి మిక్స్ చేయంది. ఆ తరువాత వంట గదిలోని మూలల్లో లేదా బల్లి తిరిగే ప్రదేశానికి దగ్గర్లో ఈ కాఫీ పౌడర్, పొగాకు మిశ్రమాన్ని పెట్టండి. కిచెన్ లో మంచి కాఫీ సుగంధంతో పాటు బల్లి వస్తుందని టెన్షన్ కూడా ఉండదు.

నిమ్మకాయ: నిమ్మకాయ లో బత్తాయి పండ్లు ఇంట్లో అందరూ ఇష్టంగా జ్యూస్ చేసుకొని తాగుతుంటారు. తాజా నిమ్మకాయలు లేదా బత్తాయి పండ్ల రసం తీసుకొని అందులో కొంచెం నీరు కలిపి పెట్టుకోవాలి. నిమ్మకాయ అయితే ఎక్కువ ఘాటుగా ఉంటుంది కాబట్టి అదే బెటర్. ఆ నిమ్మకాయ రసం, నీరు కలిపిన మిశ్రమాన్ని స్ప్రే బాటిల్ లో పోసి మీ కిచెన్ లో నలుమూలల స్ప్రే చేయండి. ఇలా చేయడం వల్ల బల్లిని తరిమేయవచ్చు ప్లస్ నిమ్మకాయ వాసన కూడా వంట గదిలో ఉంటుంది.

వెల్లలి, లవంగాలు: వెల్లులి రెబ్బలు, లవంగాలు కిచెన్ లోని మూలల్లో పెట్టండి. ఈ రెండు కూడా ఘూటు వాసన కలవి. అందుకే బల్లి ఈ వాసనకు దూరంగా ఉంటుంది. పైగా లవంగాల ఘూటు వాసన కిచెన్ ఫ్రెష్ ఫీలింగ్ తీసుకొస్తుంది.

కిచెన్ లో పరిశుభ్రత ముఖ్యం: వంటగదిలో వంట చేసిన తరువాత అక్కడ కూరగాయల చెత్త, కడగకుండా ప్లేట్ల వలస కాక్రోచ్, దోమలు, ఫ్రూట్ ఫ్లైస్ వంటి పురుగులు తిరుగుతుంటాయి. వీటిని తినేందుకే బల్లి కిచెన్ లో తిరుగుతుంటుంది. అందుకే వంటగదిని శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. కిచెన్ ఆహార పదార్థాలు చెల్లా చెదురుగా ఉండకుండా వెంటనే శుభ్రం చేస్తూ ఉండాలి.

Related News

Raksha Bandhan Wishes 2025: రాఖీ పండగ సందర్భంగా.. మీ తోబుట్టువులకు శుభాకాంక్షలు చెప్పండిలా !

Tan Removal Tips: ముఖం నల్లగా మారిందా ? ఇలా చేస్తే.. క్షణాల్లోనే గ్లోయింగ్ స్కిన్

Cinnamon water: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీరు తాగితే.. మతిపోయే లాభాలు !

Junk Food: పిజ్జా, బర్గర్‌లు తెగ తినేస్తున్నారా ? జాగ్రత్త !

Health Tips: ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో చర్మం, జుట్టుకు బోలెడు లాభాలు !

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Big Stories

×