BigTV English

Tajmahal: తాజ్ మహల్ కి ప్రమాద ఘంటికలు.. ఆందోళన కలిగిస్తున్న లీకేజీలు

Tajmahal: తాజ్ మహల్ కి ప్రమాద ఘంటికలు.. ఆందోళన కలిగిస్తున్న లీకేజీలు

Due to the heavy rains effected on Tajmahal leakage problem arrised: ప్రపంచంలోనే అందమైన కట్టడంగా ప్రాచుర్యం పొందింది తాజ్ మహల్..తన అమర ప్రేమకు చిహ్నంగా మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన భార్య ముంతాజ్ కు జ్ణాపక చిహ్నంగా కట్టించి మహా కట్టడం. ప్రపంచ వింతలలో ఒకటిగా చెప్పబడుతోంది తాజ్ మహల్. నాలుగువందల సంవత్సరాలు దాటినా ఇప్పటిక దాని శోభ,సౌందర్యం ఎంతమాత్రం తరగలేదు. పూర్తిగా పాలరాతితో కట్టిన తాజ్ మహల్ 1632 లో నిర్మాణం మొదలు పెట్టారు. దాదాపు 20 ఏళ్లు దీని నిర్మాణం కొనసాగింది. 1653 లో తాజ్ మహల్ నిర్మాణం పూర్తయింది. ప్రపంచ వింతల్లో ఒకటిగా విరాజిల్లుతోంది. 1983 లో యునెస్కో అరుదైన గుర్తింపు లభించింది. దీని నిర్మాణంలో దాదాపు 20 వేల మంది కార్మికులు పాల్గొన్నారు. అందుకే మహాకవి శ్రీశ్రీ తాజ్ మహల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలెవరు అంటూ అడిగారు.


భారీ వర్షాలతో లీకేజ్

తాజ్ మహల్ నిర్మాణానికి వెయ్యి ఏనుగులను ఉపయోగించారట. తాజ్ మహల్ కు సంబంధించిన సామాగ్రిని ఒక చోట నుంచి వేరే చోటుకు మార్చేందుకు ఈ వెయ్యి ఏనుగుల సాయం తీసుకున్నారు. నిండు పున్నమి రాత్రిలో తాజ్ మహల్ అందం రెట్టింపు అవుతుంది. తాజ్ మహల్ నిర్మాణానికి ఉపయోగించిన రాళ్లలో ఖురాన్ సూక్తులు కనిపిస్తాయి. కేవలం భారత దేశానికి చెందిన గ్రానైట్ తెల్ల రాతి ఫలకాలే కాదు విదేశాలనుంచి కూడా తెప్పించారట. అయితే అప్పుడే తెల్లరాతితో నిర్మించిన తాజ్ మహల్ తో పాటు నల్లరాతితో తయారుచేసిన తాజ్ మహల్ కూడా కట్టించాలని షాజహాన్ భావించారట. కాగా కొన్ని అనివార్య పరిస్థితిలో మొగల్ పాలకుల మధ్య అంతర్గత విభేదాలతో ఆ ప్రాజెక్టు అలానే అటకెక్కింది. తర్వాత వచ్చిన ఏ చక్రవర్తీ ఈ తరహా నిర్మాణానికి పూనుకోలేదు. అయితే ఇన్ని ప్రత్యేకతలు కలిగిన తాజ్ మహల్ పై ఢిల్లీ, ఆగ్రాలో కురుస్తున్న భారీ వర్షాలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.


Also read: పవన్ కు ఇష్టమైన ఫుడ్డు ఏమిటో తెలుసా? అదేమిటో తెలిస్తే ఆశ్చర్యపోతారు

ప్రమాదమేమీ లేదు

తాజ్ మహల్ ప్రధాన గోపురంపై వర్షపు నీటి లీకేజీని అధికారులు గమనించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఇంకా ఏ భాగాలలో డ్యామేజ్ అయిందో డ్రోన్ కెమెరాతో పరిశీలించారు. అయితే ప్రధాన గోపురంపై భాగాన లీకేజీ ఉందని గ్రహించారు. అక్కడ ఏర్పడిన చెమ్మ కారణంగానే వర్షపు నీరు లీకేజ్ అవుతూందని తాజ్ మహల్ నిర్వాహకులు చెబుతున్నారు. అయితే నాలుగు దశాబ్దాలుగా పర్యాటకులను కనువిందు చేస్తున్న తాజ్ మహల్ కు ప్రస్తుతం వచ్చిన ప్రమాదం ఏమీ లేదని అధికారులు అనడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సీపేజ్ వ్యవస్థలో లోపం కారణంగానే ఇది జరిగిందని అధికారులు చెబుతున్నారు. ఆగ్రాలో ఇటీవల గత 80 సంవత్సరాలుగా కురవని వర్షం కేవలం 24 గంలలలోనే కురిసింది. 151 మిల్లీమీటర్ల వర్షం కురవడంతో తాజ్ మహల్ కు స్వల్పంగా డ్యామేజ్ కలిగిందని..సాధ్యమైనంత త్వరలోనే ఈ లీకేజీలను పూడ్చేస్తామని అధికారులు చెబుతున్నారు. వర్షాలు కొద్దిగా తగ్గుముఖం పట్టగానే తాజ్ మహల్ కు రిపేర్ చేస్తామని అధికారులు అంటున్నారు.

Related News

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Big Stories

×