Jyothi Rai Photos: బిగ్ బాస్ సీజన్ 8లో కేవలం 14 మంది మాత్రమే రావడంతో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చే కంటెస్టెంట్ ఎవరు అని అందరిలో ఆసక్తి మొదలయ్యింది. ‘గుప్పెడంత మనసు’ సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా అడుగుపెట్టనుందనే వార్త అందరినీ ఎగ్జైట్ చేస్తోంది.
‘గుప్పెడంత మనసు’ సీరియల్‌లో జగతి మేడమ్‌గా కనిపించి ప్రేక్షకులకు చాలా దగ్గరయ్యింది జ్యోతి రాయ్ అలియాస్ జ్యోతి పూర్వజ్. ఆ సీరియల్‌లో తన క్యారెక్టర్ చనిపోయిన తర్వాత తెలుగు బుల్లితెరపై కనిపించడం మానేసింది.
1985 ఫిబ్రవరీ 23న కర్ణాకటలోని మడికెరీలో జన్మించింది జ్యోతి. తెలుగు, కన్నడ ఇండస్ట్రీల్లో నటిగా గుర్తింపు సంపాదించుకున్నా మలయాళ, తమిళం లాంటి భాషలపై కూడా తనకు పట్టు ఉంది.
తెలుగులో ‘గుప్పెడంత మనసు’తో, కన్నడలో ‘కిన్నారి’ వంటి సీరియల్స్‌తో పాపులర్ అయ్యింది జ్యోతి రాయ్. అంతే కాకుండా ఇప్పుడిప్పుడే వెండితెరపై అడుగుపెట్టడానికి సిద్ధమవుతోంది.
కన్నడలో ఇప్పటికే పలు చిత్రాల్లో నటించి ఆకట్టుకున్న జ్యోతి రాయ్.. తెలుగులో కూడా వెండితెరపై తన డెబ్యూకు సిద్ధమయ్యింది. ‘ఏ మాస్టర్ పీస్’ అనే మూవీతో ప్రేక్షకులను పలకరించనుంది.
బిగ్ బాస్ సీజన్ 8లో కంటెస్టెంట్‌గా రమ్మని జ్యోతి రాయ్‌ను ముందుగానే సంప్రదించారట మేకర్స్. కానీ పలు కమిట్మెంట్స్ వల్ల లాంచ్‌లోనే కంటెస్టెంట్‌గా ఎంటర్ అవ్వడం తనకు కుదరలేదని సమాచారం.
ఇక తాజాగా ప్రసారమయిన ఎపిసోడ్‌లో కంటెస్టెంట్స్‌కు ఒక లిమిట్‌లెస్ సర్ప్రైజ్ ఉంటుందని నాగార్జున హింట్ ఇచ్చారు. అది జ్యోతి రాయ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ గురించే అని చాలామంది ప్రేక్షకులు ఫిక్స్ అయిపోతున్నారు.
ప్రతీ సీజన్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చినవారు.. హౌజ్‌లో మరింత ఫన్, మరింత పోటీని యాడ్ చేస్తారు. జ్యోతి కూడా అలాగే చేస్తుందని బుల్లితెర ప్రేక్షకులు ఆశిస్తున్నారు.
ఆన్ స్క్రీన్ మంచి పాత్రలను ఎంచుకుంటూ సోషల్ మీడియాలో హాట్ ఫోటోషూట్స్ పోస్ట్ చేస్తూ ఉండే జ్యోతి రాయ్.. అసలు పర్సనాలిటీ ఏంటో బిగ్ బాస్‌తో చూడాలని ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు.