వంకాయ కూరను ఇష్టపడని వారు కూడా వంకాయ దమ్ బిర్యానీని చాలా ఇష్టంగా తింటారు. దీన్ని చాలా సులువుగా చేసేయొచ్చు. ఒక్కసారి తిన్నారంటే జీవితంలో మర్చిపోలేరు. శాఖాహారులకు ఈ వంకాయ దమ్ బిర్యాని కచ్చితంగా నచ్చుతుంది. దీన్ని సులువుగా ఎలా చేయాలో చెప్పాము.
వంకాయ దమ్ బిర్యానీకి కావలసిన పదార్థాలు
బాస్మతి బియ్యం – రెండు కప్పులు
కొత్తిమీర తరుగు – నాలుగు స్పూన్లు
పుదీనా తరుగు – నాలుగు స్పూన్లు
దాల్చిన చెక్క – చిన్న ముక్క
బిర్యానీ ఆకులు – రెండు
లవంగాలు – ఆరు
యాలకులు – నాలుగు
అల్లం వెల్లుల్లి పేస్టు – రెండు స్పూన్లు
పచ్చిమిర్చి – నాలుగు
ధనియాల పొడి – రెండు స్పూన్లు
గరం మసాలా – ఒక స్పూను
జీలకర్ర – ఒక స్పూను
నిమ్మరసం – రెండు స్పూన్లు
కారం – రెండు స్పూన్లు
నెయ్యి – రెండు స్పూన్లు
నూనె – రెండు స్పూన్లు
పసుపు – అర స్పూను
ఉప్పు – రుచికి సరిపడా
పెరుగు – ఒక కప్పు
వంకాయలు – ఆరు
ఉల్లిపాయలు – రెండు
వంకాయ దమ్ బిర్యాని రెసిపీ
⦿ బాస్మతి బియ్యాన్ని ముందుగానే అరగంట పాటు నానబెట్టుకోవాలి.
⦿ ఈ లోపు వంకాయలను శుభ్రంగా కడిగి గుత్తి వంకాయకు ఎలా కోసుకుంటారో అలా మధ్యలోకి నాలుగు చీలికలు చేసుకొని నీళ్లలో వేసి ఉంచండి. కాడలు అలాగే ఉంచాలి.
⦿ ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.
⦿ అందులో వంకాయలను వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి.
⦿ ఇక మిగిలిన నూనెలో ఉల్లితరుగును వేసి బాగా వేయించాలి.
⦿ అందులోని పచ్చిమిర్చి, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్,పు ధనియాల పొడి, గరం మసాలా, పసుపు కూడా వేసి బాగా కలుపుకోవాలి.
⦿ ఇది బాగా వేగుతున్నప్పుడు నిమ్మరసం తీసి కలుపుకోవాలి.8. తర్వాత పుదీనా తరుగు కొత్తిమీర తరుగు కూడా వేసి బాగా వేయించుకోవాలి.
⦿ ఇప్పుడు పెరుగును వేసి ఒకసారి కలుపుకోవాలి.
⦿ ముందుగా వేయించిన వంకాయలను కూడా అందులో వేసి పైన మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి.
⦿ ఈ లోపు మరొక స్టవ్ మీద అన్నం వండేందుకు గిన్నె పెట్టి బాస్మతి బియ్యాన్ని వేయాలి.
⦿ ఆ బియ్యం ఉడకడానికి సరిపడా నీళ్లను వేసి ఉప్పు, నెయ్యి, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకులు వేసి కలుపుకోవాలి.
⦿ పైన మూత పెట్టి అన్నం 70% ఉడికే దాకా ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి.
⦿ ఇప్పుడు వంకాయ ఉడుకుతున్న కళాయిలో మంట తగ్గించి వండుకున్న అన్నాన్ని పొరలు పొరలుగా వేసుకోవాలి.15. మధ్యమధ్యలో పుదీనా, కొత్తిమీర తరుగును చల్లుకోవాలి.
⦿ పైన మూత పెట్టి చిన్న మంట మీద పావుగంట సేపు వదిలేయాలి. తర్వాత స్టౌ ఆఫ్ చేసేయాలి.
⦿ వెంటనే మూత తీయకుండా పది నిమిషాలు అలాగే ఉంచాలి.18. తర్వాత మూత తీసి చూస్తే వంకాయ దమ్ బిర్యాని రెడీగా ఉంటుంది.
⦿ ఇది వండుతున్నప్పుడే మంచి సువాసన వస్తుంది.
⦿ వంకాయని ఇష్టపడని వారు కూడా ఈ వంకాయ దమ్ బిర్యాని తినేస్తారు. అంత రుచిగా ఉంటుంది.
ఇక్కడ మేము చెప్పిన పద్ధతిలో మీరు వంకాయ దమ్ బిర్యాని చేసి చూడండి. అద్భుతంగా ఉంటుంది. శాకాహారులకు నచ్చే వంటకం ఇది.
Also Read: రైస్ వాటర్‌తో ఫేస్ సీరం.. ఎలా తయారు చేసుకోవాలంటే ?