BigTV English

Rice Water Face Serum: రైస్ వాటర్‌తో ఫేస్ సీరం.. ఎలా తయారు చేసుకోవాలంటే ?

Rice Water Face Serum: రైస్ వాటర్‌తో ఫేస్ సీరం.. ఎలా తయారు చేసుకోవాలంటే ?

Rice Water Face Serum: బియ్యం నీటిలో అనేక పోషకాలు ఉంటాయి. ఇవి చర్మ సౌందర్యానికి చాలా మేలు చేస్తాయి. ఇదిలా ఉంటే కొరియన్ స్కిన్ కేర్ ప్రపంచ వ్యాప్తంగా చాలా ప్రజాదరణ పొందింది. దీని ప్రత్యేకత ఏంటంటే.. సహజ పదార్ధాలతో తయారు చేయబడిన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్. కొరియన్ బ్యూటీ సీక్రెట్స్‌లో అత్యంత ప్రాచుర్యం పొందినది రైస్ వాటర్. ఇది చర్మాన్ని లోతుగా పోషించడంలో, మెరుగుపరచడంలో సహాయపడుతుంది. మీరు కూడా కొరియన్ గ్లాస్ స్కిన్ లాగా మచ్చలేని , మెరిసే చర్మాన్ని కోరుకుంటే గనక మీరు ఇంట్లోనే రైస్ వాటర్‌తో ఫేస్ సీరం తయారు చేసుకోవచ్చు.


మార్కెట్‌లో దొరికే ఫేస్ సీరం కొనడానికి ఎక్కువగా ఖర్చు అవుతుంది. ఫేస్ సీరం చర్మాన్ని మృదువుగా, ప్రకాశవంతంగా మార్చడంలో సహాయపడుతుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఫేస్ సీరంను ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు . ముఖ్యంగా రైస్ వాటర్ తో ఫేస్ సీరం తయారు చేసుకుని వాడటం వల్ల అద్భుత ప్రయోజనాలు ఉంటాయి. అంతే కాకుండా దీనికి ఎక్కువగా ఖర్చు చేయాల్సిన అవసరం కూడా ఉండదు. మరి రైస్ వాటర్‌తో ఇంట్లోనే ఫేస్ సీరం ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

బియ్యం నీళ్లలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మం యొక్క రంగును మెరుగుపరుస్తాయి. అంతే కాకుండా ముడతలను కూడా తగ్గిస్తాయి. ఈ ఫేస్ సీరం తయారు చేయడానికి ఎక్కువ సమయం కూడా పట్టదు.


రైస్ వాటర్ ఫేస్ సీరం యొక్క ప్రయోజనాలు:
చర్మాన్ని మెరిసేలా చేస్తుంది: బియ్యం నీటిలో ఉండే విటమిన్ బి , ఇ చర్మాన్ని పోషించి, ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా మారుస్తాయి.

మచ్చలు, పిగ్మెంటేషన్‌ను తగ్గిస్తుంది: ప్రతిరోజూ బియ్యం నీటిని ఉపయోగించడం వల్ల చర్మంపై ఉన్న నల్లటి మచ్చలు క్రమంగా తొలగిపోతాయి. అంతే కాకుండా స్కిన్ టోన్ కూడా సమానంగా మారుతుంది.

వృద్ధాప్య వ్యతిరేక లక్షణాలు : దీనిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు ముడతలు , ఫైన్ లైన్లను తగ్గించడంలో సహాయపడతాయి. అంతే కాకుండా చర్మాన్ని యవ్వనంగా, తాజాగా ఉంచుతాయి.

చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది: బియ్యం నీరు చర్మంలో తేమను నిలుపుకుంటుంది. అంతే కాకుండా పొడిబారకుండా నిరోధిస్తుంది. చర్మాన్ని కూడా మృదువుగా ఉంచుతుంది.

ఇంట్లో రైస్ వాటర్ ఫేస్ సీరం ఎలా తయారు చేసుకోవాలి ?

అవసరమైన పదార్థాలు:

½ కప్పు ముడి బియ్యం

1 కప్పు- నీరు

1 టీస్పూన్- కలబంద జెల్

1- విటమిన్ ఇ క్యాప్సూల్స్

3-4 చుక్కల- రోజ్ వాటర్

తయారీ విధానం:

బియ్యాన్ని కడిగి నానబెట్టండి – ముందుగా, అర కప్పు బియ్యాన్ని బాగా కడిగి ఒక కప్పు నీటిలో 5-6 గంటలు నానబెట్టండి.

బియ్యం నీటిని వడకట్టండి – ఇప్పుడు ఈ నీటిని ఫిల్టర్ చేసి ఒక గిన్నెలో ఉంచండి. మీ రైస్ వాటర్ సిద్ధంగా ఉంది.

సీరం సిద్ధం చేసుకోండి – ఈ బియ్యం నీటిలో ఒక టీస్పూన్ కలబంద జెల్, ఒక విటమిన్ E క్యాప్సూల్ , 3-4 చుక్కల రోజ్ వాటర్ కలపండి.

బాగా కలపండి – ఇప్పుడు అన్ని పదార్థాలను బాగా కలపండి. తద్వారా మృదువైన లిక్విడ్ ఏర్పడుతుంది.

ఒక సీసాలో నిల్వ చేయండి – ఈ సీరంను శుభ్రమైన స్ప్రే బాటిల్ లేదా డ్రాపర్ బాటిల్‌లో నిల్వ చేయండి.

Also Read: జామ ఆకులను ఇలా వాడితే.. జన్మలో జుట్టు రాలదు !

ఇలా వాడండి:

ప్రతిరోజూ ఉదయం, రాత్రి శుభ్రమైన ముఖంపై దీన్ని అప్లై చేయండి.

సున్నితంగా అప్లై చేసి చర్మంలోకి ఇంకిపోనివ్వండి.

దీనిని టోనర్ లేదా మాయిశ్చరైజర్‌గా కూడా ఉపయోగించవచ్చు.

Related News

Weight Loss: ఈ యోగాసనాలతో.. 10 రోజుల్లోనే వెయిట్ లాస్

Sugar: చక్కెర తినడం 30 రోజులు ఆపేస్తే.. ఏం జరుగుతుందో తెలుసా ?

Hair Care Tips: వర్షంలో జుట్టు తడిస్తే..… వెంటనే ఇలా చేయండి?

Paneer Effects: దే…వుడా.. పన్నీరు తింటే ప్రమాదమా?

Hair Growth Tips: ఈ టిప్స్ పాటిస్తే.. వారం రోజుల్లోనే ఒత్తైన జుట్టు !

Gut Health: గట్ హెల్త్ కోసం.. ఎలాంటి ఆహారం తినాలి ?

Big Stories

×