జుట్టును పెంచుకోవడానికి హెయిర్ సీరమ్ లు, సింథటిక్ చికిత్సలు అందుబాటులోకి వచ్చేసాయి. వీటితో కన్నా ప్రకృతి సిద్ధమైన నూనెలతో జుట్టును పెంచుకుంటేనే ఆరోగ్యం. శతాబ్దాలుగా జుట్టుకు సాంప్రదాయబద్ధమైన నూనెలను అప్లై చేయడం ద్వారా సంరక్షిస్తున్నారు. కొన్ని నూనెలు జుట్టు సంరక్షణలో అత్యంత శక్తివంతంగా పనిచేస్తాయి. జుట్టు కుదుళ్లను ఉత్తేజపరిచి వెంట్రుకల పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. ఎలాంటి నూనెలను జుట్టుకు అప్లై చేయడం ద్వారా పొడవుగా పెరిగేలా చేసుకోవచ్చు తెలుసుకోండి.
రోజ్మేరీ నూనెలు
రోజ్మేరీ నూనె జుట్టు పెరుగుదలకు ఎంతో సహకరిస్తుంది. శాస్త్రీయ అధ్యయనాలు ప్రకారం రోజు మీరు ఈ నూనె కణాల పునరుత్పత్తిని పెంచుతుంది. తలలో రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. జుట్టు కుదుళ్ళను బలోపేతం చేస్తుంది. జుట్టు రాలడానికి కారణమయ్యే హార్మోన్ అయినా డిహెచ్‌టిని ఎదుర్కోవడం ద్వారా జుట్టు రాలిపోకుండా అడ్డుకుంటుంది. రోజ్మేరీ ఆయిల్ ఒక్కదాన్నే జుట్టుకు అప్లై చేయకూడదు. కొబ్బరి నూనె లేదా జొజోబా వంటి ఆయిల్స్ లో కొన్ని చుక్కల రోజ్మేరీ ఆయిల్ వేసి బాగా కలిపి దాన్ని తలకు పట్టించాలి. అరగంట పాటు వదిలి తర్వాత షాంపూతో కడిగేసుకోవచ్చు. లేదా అలా వదిలేసిన పర్వాలేదు.
పుదీనా నూనె
పుదీనా నూనెను, పిప్పర్మెంట్ నూనె అని కూడా పిలుస్తారు. ఇది రిఫ్రెషింగ ఇచ్చే నూనె. నెత్తిమీద రక్తప్రసరణ పెంచడంలో ఇది ముందుంటుంది. నిద్రాణమైన జుట్టు కుదుళ్ళను ఉత్తేజపరుస్తుంది. పిప్పరమెంటు నూనె తలపై రక్త ప్రవాహాన్ని పెంచి జుట్టుకు శక్తినిస్తుంది. ఇది ఇన్ఫ్మేమేషన్ ని కూడా తగ్గిస్తుంది ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనెలో రెండు మూడు చుక్కల పిప్పర్మెంట్ ఆయిల్ వేసి తలకు బాగా పట్టించాలి. ఇదే చల్లదనాన్ని అందిస్తుంది. ఆ తరువాత జుట్టుకు షాంపూ చేసుకోవచ్చు.
లావెండర్ నూనె
లేవండర్ ఆయిల్ ఒత్తిడికి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అలాగే నిద్రను కూడా తెస్తుంది. దీనిలో యాంటీ మైక్రో బయోల్ లక్షణాలు ఎక్కువ. తలపై రక్తప్రసరణను మెరుగుపరిచే సామర్థ్యం దీనికి ఉంది. లావెండర్ ఆయిల్ నాడీ వ్యవస్థను శాంత పరచడంతో పాటు తలపై రక్తప్రసరణను పెంచడం వంటి ప్రయోజనాలను కలిగి ఉంటుంది. బ్యాక్టీరియల్ లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్ల వల్ల చుండ్రు, దురద వంటివి రాకుండా అడ్డుకుంటుంది. కొబ్బరి నూనెలో కొన్ని చుక్కల లావెండర్ ఆయిల్ వేసి తలకు మసాజ్ చేయండి. ఇది మీ జుట్టుకు ఎంతో పోషణను అందించడంతోపాటు తలపై ఉన్న మాడును కూడా రక్షిస్తుంది.
Also Read: పుచ్చకాయపై ఉప్పు చల్లుకుని తినాలా ? వద్దా ?
టి ట్రీ ఎసెన్షియల్ ఆయిల్
టి ట్రీ ఆయిల్ అన్ని సూపర్ మార్కెట్లలో లభిస్తుంది. దీనిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఎక్కువ. రోజ్మేరీ, పిప్పరమెంటు నూనెల్లాగే ఇది కూడా జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. తలపై ఉన్న చర్మాన్ని పరిశుభ్రంగా ఉంచి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అక్కడ ఉన్న చర్మాన్ని ఒత్తిడి నుంచి బయటపడేలా చేస్తుంది. అలాగే జుట్టు పెరుగుదలకు ఆటంకం కలిగించే ఇన్ఫెక్షన్లతో పోరాడడానికి సహాయపడుతుంది. కాబట్టి కొబ్బరి నూనెలో రెండు మూడు చుక్కల టీ ట్రీ ఆయిల్ వేసి తలకు పట్టించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అయితే టీ ట్రీ ఆయిల్ ని చాలా తక్కువ మొత్తంలోనే వాడడం మంచిది.