BigTV English

Salted Watermelon: పుచ్చకాయపై ఉప్పు చల్లుకుని తినాలా ? వద్దా ?

Salted Watermelon: పుచ్చకాయపై ఉప్పు చల్లుకుని తినాలా ? వద్దా ?

Salted Watermelon: సమ్మర్‌లో ఎక్కువగా లభించే పండ్లలో పుచ్చకాయ కూడా ఒకటి. పుచ్చకాయలో నీటి శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. అంతే కాకుండా అవి యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ గుణాలను కూడా కలిగి ఉంటాయి. బీటా కెరోటిన్, విటమిన్ సి వంటి పోషకాలు ఉంటాయి. అందుకే సమ్మర్‌లో వీటిని తినడం చాలా మంచిదని చెబుతుంటారు. డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండటానికి పుచ్చకాయ తినడం మంచిది.


పుచ్చకాయలో తక్కువ కేలరీలు ఉంటాయి కాబట్టి.. వీటిని ఎక్కువ పరిమాణంలో కూడా తినవచ్చు. పుచ్చకాయను ముక్కలుగా కోసి లేదా స్మూతీగా తయారు చేసుకుని చాలా మంది తినడానికి ఇష్టపడుతుంటారు. ఇదిలా ఉంటే.. పిల్లలు మాత్రం పుచ్చకాయ రసాన్ని తాగడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు.

మనలో చాలా మంది పుచ్చకాయలను కోసి.. వాటి ముక్కలపై ఉప్పు చల్లుకుని తింటూ ఉంటారు. ఇలా చేయడం వల్ల  రుచి చాలా వరకు పెరుగుతుంది. కానీ ముందుగా పుచ్చకాయపై ఉప్పు రాసుకుని తినడం సరైనదా ? కాదా? అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. మరి ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.


పుచ్చకాయపై ఉప్పు చల్లుకుని తినడం వల్ల కలిగే ప్రయోజనాలు:

నిజానికి.. చాలా మందికి వివిధ రకాల పండ్లపై ఉప్పు చల్లుకుని తినే అలవాటు ఉంటుంది. పుచ్చకాయపై ఉప్పు చల్లి తినడం వల్ల పుచ్చకాయ యొక్క తీపి పెరుగుతుంది . అంతే కాకుండా దాని రుచి కూడా పెరుగుతుంది. పుచ్చకాయపై ఉప్పు చల్లడం వల్ల దాని యొక్కదాని రసం బయటకు వస్తుంది. దీంతో మరింత జ్యూసీగా అనిపిస్తుంది. ఉప్పు చల్లిన పుచ్చకాయ మరింత తీపి రుచి కలిసి తినడానికి బాగుంటుంది.

పుచ్చకాయపై ఉప్పు చల్లుకుని తినడం వల్ల కలిగే నష్టాలు:

రుచికరమైన పుచ్చకాయ మీ శరీరంపై నిశ్శబ్ద హంతకుడిలా ప్రభావం చూపుతుంది. తరచుగా పండ్లపై ఉప్పు చల్లుకుని తింటే శరీరంలో సోడియం అంటే ఉప్పు పరిమాణం పెరుగుతుంది. అధిక ఉప్పు , చక్కెర రెండూ శరీరానికి హానికరం అని మనందరికీ తెలిసిన విషయమే. అందుకే అధికంగా ఉప్పు తినడం వల్ల రక్తపోటు వంటి సమస్యలు తలెత్తుతాయి. రక్తపోటుకు సంబంధించిన సమస్యలు ఉన్నవారు తక్కువ ఉప్పు తీసుకోవడం మంచిది. అలాంటి వారు పుచ్చకాయపై ఉప్పు చల్లుకుని తినకుండా ఉండటం మంచిది.

పుచ్చకాయ ఒక హైడ్రేటింగ్ పండు. విటమిన్ ఎ , విటమిన్ సి వీటిలో సమృద్ధిగా ఉంటాయి. మీరు రుచి కోసం పుచ్చకాయపై కొద్దిగా ఉప్పు చల్లితే.. అది పుచ్చకాయ తినడం వల్ల లభించే పోషకాలపై పెద్దగా ప్రభావం చూపదు. కానీ పుచ్చకాయపై ఉప్పు చల్లుకునే ముందు.. మీరు రోజంతా ఎంత ఉప్పు తిన్నారో గుర్తుంచుకోవాలి.

Also Read: రోజూ దానిమ్మ జ్యూస్ తాగితే.. ఏమవుతుంది ?

పుచ్చకాయను ఉప్పుతో తినాలా ? వద్దా?

శరీరానికి హాని కలిగించే ఎటువంటి సమస్యలు మీకు లేకుంటే ఉప్పు తినడం మీ ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీరు పుచ్చకాయకు ఉప్పు వేసి దాని రుచిని ఆస్వాదించవచ్చు. కానీ మీరు ఒక రోజులో అవసరమైన దానికంటే ఎక్కువ ఉప్పు తిన్నట్లయితే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది.

Related News

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Weight Loss: ఈ యోగాసనాలతో.. 10 రోజుల్లోనే వెయిట్ లాస్

Sugar: చక్కెర తినడం 30 రోజులు ఆపేస్తే.. ఏం జరుగుతుందో తెలుసా ?

Hair Care Tips: వర్షంలో జుట్టు తడిస్తే..… వెంటనే ఇలా చేయండి?

Paneer Effects: దే…వుడా.. పన్నీరు తింటే ప్రమాదమా?

Hair Growth Tips: ఈ టిప్స్ పాటిస్తే.. వారం రోజుల్లోనే ఒత్తైన జుట్టు !

Big Stories

×