పండుగ సమయంలో అందంగా కనిపించాలన్న ఆరాటం అందరిలో ఉంటుంది. అందుకే కొన్ని రకాల ఆహారాలు తినడం మానేస్తే మీ చర్మం బిగుతుగా సున్నితంగా ఉంటుంది. అందాన్ని సొంతం చేసుకోవడానికి కొందరు అమ్మాయిలు రకరకాల కాస్మోటిక్స్‌ను, సౌందర్య చికిత్సలను చేయించుకుంటారు. నిజానికి అలాంటివి ఏమీ చేయించుకోకుండా సహజంగానే అందాన్ని కాపాడుకోవచ్చు. కొన్ని రకాల ఆహారాలు అధికంగా తినడం ద్వారా కొన్నింటిని తినడం మానేయడం ద్వారా చర్మాన్ని రక్షించుకోవాలి. ఇక్కడ మేము మీ చర్మాన్ని పాడు చేసే ఆహారపు అలవాట్ల గురించి చెప్పాము. వీటిని ఎంత తక్కువగా తింటే అంత మంచిది.
మిర్చిబజ్జీలు, ఛాట్
బయటి ఆహారాన్ని తినడం తగ్గించుకోండి. మిర్చి బజ్జీలు, చాట్, నూడుల్స్, చిప్స్ వంటివి తినేవారికి చర్మం త్వరగా ముడతలు పడుతుంది. వీటివల్ల శరీరంలో జీవక్రియలు సరిగా పని చేయలేవు. జీవక్రియల సాఫీగా సాగకపోతే ఆ ప్రభావం శరీరంపై తద్వారా చర్మంపై పడుతుంది. కాబట్టి చర్మం పాలిపోయినట్టు మారుతుంది. అలాగే చర్మం జిడ్డుగా మారే అవకాశం కూడా ఉంది. ఈ జిడ్డుగా మారడం వల్ల మొటిమల సమస్య పెరిగిపోతుంది.
చాక్లెట్లు
చాక్లెట్లు అంటే ఎంతో మంది అమ్మాయిలకు ఇష్టం. నిజానికి చాక్లెట్లు చర్మాన్ని దెబ్బతీస్తాయి. చాక్లెట్ లో ఉండే చక్కెర చర్మ సమస్యలను పెంచేస్తుంది. శరీరంలో చక్కెర శాతం పెరిగితే చర్మంలో ముడతలు అధికమైపోతాయి. అలాగే చర్మం డల్ గా, నీరసంగా కనిపిస్తుంది. చక్కెర ఎక్కువ ఉత్పత్తి కూడా తగ్గిపోతుంది. చర్మం బిగుతుగా కాకుండా ముడతలు ఏర్పడేలా మారుతుంది. మీకు చాక్లెట్లు అంటే ఇష్టమైతే మీ అందం కోసం ఆ ఇష్టాన్ని వదులుకోవాల్సిన అవసరం ఉంది. మరీ తినాలనిపిస్తే డార్క్ చాక్లెట్లు ప్రతిరోజూ చిన్న ముక్క తినండి చాలు. అంతకుమించి తినకపోవడమే ఉత్తమం. ముఖ్యంగా యువత చాక్లెట్లకు దూరంగా ఉండాల్సిన అవసరం ఎక్కువ.
ఉప్పు
ఉప్పు అధికంగా తిన్న చర్మ సమస్యలు వస్తాయి. ప్యాకేజీ ఫుడ్ లో ఉప్పు అధికంగా ఉంటుంది. బయట దొరికే చిప్స్, జంక్ ఫుడ్‌లలో ఉప్పును అధికంగా వేస్తారు. ఉప్పు అధికంగా ఉండే ఆహారాలు కూడా ఆరోగ్యానికి, చర్మానికి ఏ మాత్రం మంచివి కాదు. ఈ ఉప్పు అధికంగా ఉండే ఆహారాల్లో సోడియం ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది చర్మ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఒక ఛాయను తగ్గిస్తుంది. మెరుపు లేకుండా చేస్తుంది. కాబట్టి ఉప్పుగా ఉండే ఆహారాలను ఎంత తగ్గిస్తే అంత మంచిది.
Also Read: ఇలాంటి బంగాళదుంపలను కొనొద్దు.. తినొద్దు – విషంతో సమానం
అలాగే మైదాతో చేసిన ఆహారాలు కూడా దూరంగా ఉండాలి. వైట్ బ్రెడ్, కేక్స్, పాస్తా వంటివి అధికంగా తీసుకోకూడదు. ఇవన్నీ కూడా మొటిమల సమస్యను పెంచి చర్మ సౌందర్యాన్ని తగ్గిస్తాయి. వీటిని తినకుండా ఉండడం వల్ల మీకు ఆరోగ్యపరంగాను సౌందర్యపరంగానూ మేలు జరుగుతుంది. కాబట్టి ఆరోగ్యం కోసం చర్మం కోసం మీరు పైన చెప్పిన ఆహారాన్ని ఎంత తగ్గిస్తే అంత ఉత్తమం.
అందం కోసం ప్రతిరోజూ ఎనిమిది లీటర్ల నీళ్లు తాగుతూ ఉండాలి. అలాగే పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు అధికంగా తీసుకోవాలి. నూనె తక్కువగా ఉండే ఆహారాలను తినాలి. పాలు, పెరుగు వంటివి కూడా రోజూ తీసుకోవాలి. ఇవన్నీ శరీరానికి ఆరోగ్యంతో పాటూ అందాన్ని అందిస్తాయి.