మొఘలాయ్ పాలనలో ఎన్నో రకాల వంటలు మనకు పరిచయమయ్యాయి. ఇప్పటికీ కూడా మొగలాయి స్టైల్ లో బిర్యాని, చికెన్ కర్రీ, మటన్ కర్రీ, ఫిష్ కర్రీ వంటివి కొన్ని రెస్టారెంట్లలో అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు మేము మొఘలామ్ స్టైల్ లో చేపల కూర ఎలా వండాలో ఇచ్చాము. ఇది అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి ఈ చేపల రెసిపీని ఫాలో అయి చూడండి. మీకు కచ్చితంగా నచ్చుతుంది.
మొఘలాయ్ చేపల కూరకు కావలసిన పదార్థాలు
చేప ముక్కలు – అరకిలో
పసుపు – ఒక స్పూను
నిమ్మరసం – ఒక స్పూను
పెరుగు – మూడు స్పూన్లు
గరం మసాలా – ఒక స్పూను
నూనె – అరకప్పు
ఉల్లిపాయలు – రెండు
వెల్లుల్లి రెబ్బలు – మూడు
అల్లం – చిన్న ముక్క
గసగసాలు – మూడు స్పూన్లు
ఉప్పు – రుచికి సరిపడా
మిరియాల పొడి – ఒక స్పూను
ధనియాలు – రెండు స్పూన్లు
కారం – రెండు స్పూన్లు
వెనిగర్ – ఒక స్పూను
బాదం పలుకులు – ఎనిమిది
జీలకర్ర – రెండు స్పూన్లు
కొత్తిమీర తరుగు – రెండు స్పూన్లు
మొఘలాయ్ చేపల కర్రీ రెసిపీ
1. చేపలను పరిశుభ్రంగా కడిగి ఒక గిన్నెలో వేయాలి.
2. అందులో పసుపు, నిమ్మరసం, ఉప్పు వేసి బాగా కలిపి అరగంట పాటు మ్యారినేట్ చేసుకోవాలి.
3. ఇప్పుడు మిక్సీలో ఉల్లిపాయల ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు మిరియాలు, అల్లం, కొత్తిమీర, జీలకర్ర, కారం, పసుపు, బాదం పలుకులు, ఉప్పు, గసగసాలు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
4. స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి. ఆ నూనె వేడెక్కిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కలను వేసి ఒక్కొక్కటిగా వేయించుకోవాలి.
5. అవన్నీ వేగిన తర్వాత అందులోనే ముందుగా రుబ్బి పెట్టుకున్న మసాలా పేస్ట్ ను కూడా వేసి కలుపుకోవాలి.
6. చిన్న మంట మీద అది పచ్చి వాసన పోయేవరకు వేయించాలి.
7. తర్వాత పెరుగు, గరం మసాలా పొడి వేసి బాగా కలుపుకోవాలి.
8. తగినంత నీళ్లను పోసి ఒకసారి కలిపి పైన మూత పెట్టి ఉడికించుకోవాలి.
9. ఇది చిక్కటి గ్రేవీలా అయ్యే వరకు ఉంచాలి. తర్వాత మూత తీసి పైన కొత్తిమీర తరుగును చల్లుకోవాలి.
10. అంతే టేస్టీ మొఘలాయ్ చేపల కూర రెడీ అయినట్టే. దీన్ని అన్నం, పులావులతో తింటే రుచి అదిరిపోతుంది. అంతే కాదు బగారా రైస్ తో తిన్నా టేస్టీగా ఉంటుంది.
ఇప్పుడు ఒకేలాంటి చేపలను తినే బదులు ఇలా మొఘలాయ్ స్టైల్లో కొత్తగా చేపల కూరను ప్రయత్నించి చూడండి. ఇది మీకు కచ్చితంగా నచ్చుతుంది. మామూలు చేపల కూరతో పోలిస్తే దీని వండడం కూడా చాలా సులువు. ఇక్కడ మేము చెప్పిన పద్ధతిలో చేస్తే కూరా చాలా త్వరగా సిద్ధమైపోతుంది.