Fire Accident: హైదరాబాద్‌లో మరో అగ్ని ప్రమాదం. సిటీ శివారులోని దుండిగల్ తండాలో రాంకీ కంపెనీలో మంటలు చెలరేగాయి. కెమికల్ రియాక్ట్ అవ్వడంతో భారీగా మంటలు వ్యాపించాయి. రాంకీ కంపెనీలో అగ్ని ప్రమాదం చూసి పక్కనున్న తండా వాసులు భయంతో పరుగులు తీశారు. ప్రమాదం సమయంలో ఎంత మంది కార్మికులు పనిచేస్తున్నారు, వాళ్ల పరిస్థితి ఏమిటనే ఆందోళన వ్యక్తమవుతోంది.
ప్రమాదం ఎలా జరిగింది?
ప్రాథమిక సమాచారం ప్రకారం, రాంకీ అనే ప్రైవేట్ పరిశ్రమలో రాత్రి షిఫ్ట్ సమయంలో.. కెమికల్స్‌ను మిశ్రమం చేయడంలో లోపం ఏర్పడి, ఆకస్మికంగా భారీ పేలుడు సంభవించింది. ఆ వెంటనే మంటలు ఎగసిపడటం, దట్టమైన పొగ వ్యాపించింది.
సమీప ప్రాంతాల్లో భయంతో పరుగులు
రాంకీ పరిశ్రమకు చాలా సమీపంగా ఉన్న తండా గ్రామంలో.. నివాసం ఉండే ప్రజలు అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనతో ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.
కార్మికుల పరిస్థితి ఏమిటి?
ప్రమాదం సమయంలో కంపెనీలో ఎంతమంది కార్మికులు.. పని చేస్తున్నారన్న విషయంపై ఇంకా స్పష్టత లేదు. కొంతమంది సురక్షితంగా బయటపడినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే మరికొంతమంది వివరాలు తెలియకపోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల అదుపు చేస్తున్నారు. మూడు ఫైర్ ఇంజిన్లు ఘటనా స్థలానికి చేరుకొని.. మంటల్ని నియంత్రించేందుకు ప్రయత్నించాయి.
పోలీసుల, అధికారులు స్పందన
అగ్ని ప్రమాద సమాచారం అందిన వెంటనే.. డుండిగల్ పోలీస్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిశ్రమ యాజమాన్యంతో మాట్లాడి ఘటనకు.. గల కారణాలపై నివేదిక కోరారు. ప్రాథమికంగా ఇది కెమికల్ రియాక్షన్ వల్ల జరిగిన ప్రమాదంగా భావిస్తున్నారు. ప్రమాదానికి బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని.. స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
పరిశ్రమ భద్రతపై మరోసారి ప్రశ్నలు
ఈ ఘటన మరోసారి పరిశ్రమల్లో భద్రత ప్రమాణాలపై.. తీవ్ర ప్రశ్నలు రేకెత్తిస్తోంది. రాత్రి షిఫ్ట్‌లో వర్కర్లు ఉంటే, వారికోసం ఎమర్జెన్సీ ఎగ్జిట్, ప్రొటెక్షన్ వ్యవస్థలు ఉన్నాయా? కెమికల్స్‌కు సంబంధించి జాగ్రత్తలు తీసుకున్నారా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నెలలో రెండు మూడు సార్లు పరిశ్రమల్లో ఇలా అగ్నిప్రమాదాలు జరగడం భయాందోళనకు గురిచేస్తుంది.
Also Read: గంజాయి మత్తులో కారు పైకి ఎక్కి.. యువకుడు హల్ చల్..
అప్రమత్తత అవసరం
రాంకీ కంపెనీలో జరిగిన ఈ ప్రమాదం.. నగర శివారులోని పరిశ్రమల భద్రతా స్థాయిలపై మళ్లీ దృష్టిని సారించింది. సాంకేతికంగా అభివృద్ధి చెందుతున్న నగరానికి.. సమానంగా భద్రతా వ్యవస్థలు కూడా అభివృద్ధి చెందాలి. ప్రమాదాలు జరగకుండా ముందుగానే అప్రమత్తంగా ఉండే విధానాలు.. తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కార్మికుల ప్రాణాలను కాపాడటం పరిశ్రమ యాజమాన్య బాధ్యత కాబట్టి, సంబంధిత శాఖలు మరింత కఠిన నియంత్రణ చర్యలు తీసుకోవాల్సిన సమయం ఇది.
హైదరాబాద్ లో మరో కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం
దుండిగల్ తండాలోని రాంకీ కంపెనీలో చెలరేగిన మంటలు
కెమికల్ రియాక్ట్ అవ్వడంతో వ్యాపించిన మంటలు
భయంతో పరుగులు తీసిన సమీప తండా వాసులు
ప్రమాద సమయంలో ఎంత మంది కార్మికులు ఉన్నారు..? వారి పరిస్థితి ఏమిటనే ఆందోళనలు pic.twitter.com/waPvJWgTvd
— BIG TV Breaking News (@bigtvtelugu) July 23, 2025