HBD Suriya:ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరోగా పేరు సొంతం చేసుకున్న సూర్య (Suriya) నటుడు, నిర్మాత, టెలివిజన్ వ్యాఖ్యాతగా పలు రంగాలలో సత్తా చాటుతున్నారు. సూర్య అసలు పేరు శరవణన్ శివకుమార్ (Saravanan Sivakumar). ప్రేక్షకుల ఆదరణతో పాటు పలు అవార్డ్స్ కూడా సొంతం చేసుకున్న ఈయన.. తమిళనాడు స్టేట్ ఫిలిం అవార్డులు 3, సౌత్ ఫిలిం ఫేర్ అవార్డ్స్ 4, ఎడిసన్ అవార్డులు 2 అలాగే విజయ్ అవార్డుతో పాటు సినిమా అవార్డు కూడా అందుకున్నారు. అంతేకాదు భారతీయ ప్రముఖుల సంపాదన ఆధారంగా ఫోర్బ్స్ ఇండియా సెలబ్రిటీ 100 జాబితాలో ఆరుసార్లు సూర్య స్థానం సంపాదించుకున్నారు. ఇకపోతే ఈరోజు ఆయన పుట్టినరోజు కావడంతో ఆయనకు సంబంధించిన పలు విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
సేల్స్ బాయ్ నుండి స్టార్ హీరో స్థాయికి ఎదిగిన సూర్య..
1975 జూలై 23న ప్రముఖ తమిళ సినీ నటుడు శివకుమార్(Sivakumar), లక్ష్మీ (Lakshmi)దంపతులకు తమిళనాడు చెన్నైలో జన్మించారు. చెన్నైలోనే లయోలా కాలేజీ నుండి అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ బీకాం పట్టా అందుకున్నారు. చదువుకునే సమయంలోనే డైరెక్టర్ వసంత్ (Vasanth).. సూర్య తండ్రి శివకుమార్ తో ఉన్న సాన్నిహిత్యం కారణంగానే తను తీయబోయే సినిమాలో హీరోగా అవకాశం అందించారు. అయితే సూర్య ఆ సమయంలో తనకు హీరోగా చేసే ఆసక్తి లేదు అని, ఒకవేళ తను హీరోగా చేసినా ఎవరు చూస్తారు? అనే అనుమానంతో రిజెక్ట్ చేసినట్లు సమాచారం. అదే ‘ఆశై’.. అచ్యుత్ కుమార్ హీరోగా వచ్చిన ఈ సినిమా కి ఫైనాన్షియల్ గా కొంత కొరత ఏర్పడింది. అటు శివకుమార్ తన దగ్గర ఉన్న డబ్బును కార్తీ(Karthi ) చదువు కోసం ఖర్చు చేయడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారట. ఇక దాంతో చేసేదేమీ లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోలేక సూర్య 8 నెలల పాటు గార్మెంట్స్ ఎక్స్ పోర్ట్ ఫ్యాక్టరీలో సేల్స్ బాయ్ గా రూ.800లకు పనిచేశారట.
డబ్బు కోసమే హీరోగా మారిన సూర్య..
ఇక తర్వాత డైరెక్టర్ మణిరత్నం(Maniratnam ) , వసంత్ కలిసి అజిత్(Ajith ), విజయ్ (Vijay) లతో సినిమా చేయాలనుకున్నారు. అయితే ఆ సమయంలో అజిత్ బిజీగా ఉండడం వల్ల డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోయారట. దాంతో ప్రభుదేవాను అనుకున్నారు. కానీ వసంత్ మళ్లీ సూర్యనే హీరోగా పెట్టుకోవాలని ప్రయత్నాలు చేశారు. పైగా సూర్యకి హీరో అవ్వడం ఇష్టం లేదు. కానీ ఫైనాన్షియల్ గా ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో తప్పని పరిస్థితుల్లో డబ్బుల కోసం హీరోగా మారారట సూర్య.
శరవణన్ కాస్త సూర్యగా ఎలా మారారంటే?
ఇకపోతే స్క్రీన్ పేరు బాగాలేదని డైరెక్టర్ వసంత్ పేరు మార్చుకోమని చెప్పడంతో.. మీరే ఏదైనా పేరు పెట్టండి అని సూర్య సలహా ఇచ్చారట. ఇక ఆ సినిమాలో తన పాత్ర పేరు సూర్య కావడంతో అదే ఆయన నిజజీవితంలో సూర్యగా మారిపోయింది. అలా ఒక్కో మెట్టు ఎదుగుతూ తెలుగు, తమిళ్ భాషలలో సినిమాలు చేస్తూ స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకున్న సూర్య.. ప్రస్తుతం ఆర్జే బాలాజీ (RJ Balaji) దర్శకత్వంలో ‘కరుప్పు’సినిమా చేస్తున్నారు. ఈ సినిమా నుండి తాజాగా టీజర్ విడుదల చేయగా ఆద్యంతం ఆకట్టుకుంటుంది.
జ్యోతికతో రెండుసార్లు వివాహం.. ఎందుకు?
ఇక సూర్య వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే.. ప్రముఖ హీరోయిన్ జ్యోతిక(Jyothika) ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. దియా , దేవ్ అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇకపోతే కెరియర్ పీక్స్ లో ఉండగానే సూర్యాతో ఏడడుగులు వేసింది జ్యోతిక. అయితే ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే వీరిద్దరూ రెండుసార్లు వివాహం చేసుకున్నారు. సూర్య, జ్యోతిక అప్పటికే మూడు సినిమాలలో కలిసి నటించారు. ఇక 4వ సారి కలిసి ‘మాయావి’ అనే సినిమా చేస్తున్న సమయంలో ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఇంట్లో చెబితే సూర్య తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. దీంతో రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత తల్లిదండ్రులను ఒప్పించి 2006 సెప్టెంబర్ 11న బంధువులు , సన్నిహితుల సమక్షంలో వివాహం చేసుకున్నారు.
ALSO READ:Suriya Karuppu Teaser : భాయ్ ఇది సూర్య టైం – కుమ్మిపడేస్తాడు… ఆకట్టుకుంటున్న కరుప్పు టీజర్!