BigTV English

Water : వావ్.. గాలి నుంచి నీరు తీస్తున్నారు..!

Water : వావ్.. గాలి నుంచి నీరు తీస్తున్నారు..!

Water Drawn Air : జీవకోటికి గాలి ఎంత ముఖ్యమో నీరు కూడా అంతే. నీరు లేకుంటే ఈ భూమిపై జీవం అనేది ఉండదు. నీరు లేకుంటే జీవకోటి మనుగడ సాధించలేదు. భూమిపై నీటికి అంతటి ప్రాధాన్యత ఉంది. కానీ ప్రస్తుత కాలంలో భూమిపై పెరుగుతున్న కాలుష్యంతో నీరు కూడా కలుషితం అవుతోంది. సహజమైన నీరు దొరకడం కష్టంగా మారింది. ఈ క్రమంలోనే గాలి నుంచి నీరు తీసే పద్ధతిని కనుగొన్నారు.


భూమిపై ఉన్న చెరువులు, నదులు చాలా వరకు ఎండిపోతున్నాయి. కాలుష్యం కారణంగా జీవ నదుల్లో నీరు తాగేందుకు పనికి రాకుండా పోతోంది. అంతేకాకుండా వర్షాలు సరిగా కురవకపోవడం, ఎండలు పెరిగిపోవడం వల్ల నీటి సమస్యలు తలెత్తుతున్నాయి. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే భవిష్యత్‌ ఏంటని ఆలోచించిన ఓ కంపెనీ గాలి నుంచి నీటిని తయారు చేస్తుంది.

Read More : ఈ జంతువులు రాత్రి కూడా వేటాడతాయి..!


గాలి నుంచి నీరు తీయడం అనేది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. భవిష్యత్‌లో ఇలాంటి ప్లాంట్లు రావడం ఖాయం. ఎందుకంటే నీటి నుంచి కరెంట్‌ ఎలా తీస్తారో అలానే గాలి నుంచి నీటి అణువులను కూడా వేరుచేస్తారు. ఇవి మనం తాగవచ్చు.

మన దేశంలోనే గుజరాత్‌కు చెందిన డైరీ చైర్మన్‌ శంకర్‌ చౌదరి గాలి నుంచి నీటిని తయారు చేశారు. ఇందుకోసం రెండు సోలార్‌ ప్లేట్లు వాడారు. ఎయిర్‌ స్టీమ్‌ టెక్నాలజీతో రోజుకు 120 లీటర్ల స్వచ్ఛమైన నీటిని సేకరిస్తున్నారు. తాజాగా బెంగళూరుకు చెందిన ఉరు ల్యాబ్స్‌లో కూడా గాలి నుంచి నీటిని తీస్తున్నారు.

Read More : గబ్బిలాలు తలక్రిందులుగా ఎందుకు వేలాడతాయి..? ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ..!

మనం గాలి నుంచి ఎంతటి నీటినైనా తీయచ్చు. ఇలా తీయడం వల్ల పర్యావరణానికి కూడా ఎటువంటి హాని జరగదు. గాలి నుంచి నీటిని తీయడానికి రెండు పరికరాలు వాడుతున్నారు. మొదటిది అబ్జార్వర్‌.. ఇది గాలి నుంచి నీటని స్వీకరిస్తుంది. రెండవది డిజార్వర్‌.. ఇది గాలి నుంచి తీసుకున్న నీటిని వాటర్‌గా మారుస్తుంది. ప్రస్తుతం ఈ నీటిని లీటర్‌ రూ.5కు విక్రయిస్తున్నారు.

గాలి నుంచి నీటిని తీసే విధానం భారతీయ రైల్వేలో ఎప్పటి నుంచో ఉంది. మన హైదరాబాద్‌లోని సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లోనూ ఇలా తయారు చేసిన నీటిని లీటర్‌కు రూ.5కు అమ్ముతున్నారు. అయితే రైల్వే తయారు చేస్తున్న నీళ్లు కాస్త ఖరీదైనవి. తయారీకి కాస్త ఖర్చు కూడా ఎక్కువే.

Tags

Related News

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Steel Pans: స్టీల్ పాత్రల్లో.. వీటిని పొరపాటున కూడా వండకూడదు !

Oral Health: వర్షాకాలంలో తరచూ వచ్చే గొంతు నొప్పికి.. ఈ టిప్స్‌తో చెక్ !

Diabetic Patients: షుగర్ పేషెంట్లు ఎలాంటి ఫుడ్ తినాలో తెలుసా ?

Big Stories

×