రసగుల్లా, గులాబ్ జామ్ ఇలా ఎన్నో రకాల స్వీట్లు ఉన్నాయి. వీటిని తిన్న తర్వాత నీరు తాగాలనిపిస్తుంది… కానీ తాగకూడదు. స్వీటు తిన్న వెంటనే నీరు తాగితే అది శరీరంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఆయుర్వేదం, ఆధునిక వైద్యశాస్త్రం రెండూ కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయి.
స్వీటు తిన్నాక నీరు తాగితే ఏమవుతుంది?
స్వీటు తిన్నాక నీళ్లు తాగడం అనేది చాలా చిన్న అలవాటు. కానీ ఇది మీ జీర్ణవ్యవస్థకు హాని కలిగిస్తుంది. ఆరోగ్య నిపుణులు చెబుతున్న ప్రకారం స్వీట్ తిన్నాక నీరు తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రతలో సమతుల్యత దెబ్బతింటుంది. రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోతాయి. జీర్ణక్రియ పై కూడా ప్రభావం పడుతుంది.
జీర్ణ వ్యవస్థపై ప్రభావం
స్వీటు నీటి కలయిక జీర్ణవ్యవస్థను ఎంతో ప్రభావితం చేస్తుందని ఆయుర్వేదం చెబుతోంది. ఆధునిక వైద్యశాస్త్రం కూడా ఈ విషయాన్ని నిజమేనని తేల్చింది. మన స్వీట్లు తిన్నప్పుడు మన పొట్టలో జీర్ణ ఎంజైమ్లు, ఆమ్లాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. ఆ స్వీట్ ను జీర్ణం చేయడానికి అవి పనిచేస్తాయి. అయితే స్వీటు తిన్న వెంటనే నీరు తాగితే అది కడుపులోని ఆమ్లాలను పలుచన చేస్తుంది. దీని కారణంగా జీర్ణక్రియ నెమ్మదిగా మారిపోతుంది. ఇది అజీర్ణానికి, గ్యాస్టిక్ సమస్యలకు, ఎసిడిటీ వంటి సమస్యలకు కారణం అవుతుంది. సరిగ్గా జీర్ణం కాదు. దీని వల్ల పొట్ట ఇబ్బందిగా అనిపిస్తుంది, అసౌకర్యంగా కూడా అనిపిస్తుంది.
స్వీటు తిన్న తర్వాత శరీరంలో గ్లూకోజ్ విడుదలవుతుంది. ఇది రక్తంలో కూడా కలిసి శోషణకు గురవుతుంది. స్వీట్లు తిన్న వెంటనే నీరు తాగితే… గ్లూకోజ్ నీటితో కలిసి మరింత వేగంగా శోషణకు గురవుతుంది. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరిగిపోతాయి. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారికి ఇది చాలా హానికరం. టైప్2 డయాబెటిస్ ప్రమాదాన్ని ఇది మరింత పెంచుతుంది. ఒక పరిశోధన ప్రకారం స్వీట్లు తిన్న తర్వాత నీరు తాగకపోవడం అనేది రక్తంలో చక్కెర స్థాయిలను కొంతవరకు నియంత్రించడానికి సహాయపడుతుంది. డయాబెటిస్ రోగులు ఎప్పుడైనా ఒక స్వీట్ ను తింటే వెంటనే నీరు తాగేయడం వంటి పనులు చేయకండి.
అరగంట వరకు నో వాటర్
పోషకాహార నిపుణులు చెబుతున్న ప్రకారం స్వీటు తిన్న తర్వాత అరగంట వరకు నీరు తాగకూడదు. ఆ తర్వాతే నీరు తాగాలి. అది అప్పుడే అది జీర్ణ ప్రక్రియ పై ఎలాంటి చెడు ప్రభావాన్ని చూపించదు. శరీర ఉష్ణోగ్రతను కూడా సమతుల్యంగా ఉంచుతుంది. సాధారణ నీటి కన్నా స్వీట్ తిన్నాక ఒక అరగంటకు గోరువెచ్చని నీరు తాగితే మంచిది.
స్వీటు తిన్న తర్వాత దాహం వేయడం చాలా సాధారణం. మీకు కూడా స్వీటు తిన్నాక ఎక్కువ దాహం వేస్తే వెంటనే నీరు తాగేయకండి. మిమ్మల్ని మీరు అదుపులో ఉంచుకోండి. తీపి తిన్న తర్వాత బాగా దాహంగా అనిపిస్తే ఏదైనా ఉప్పగా ఉన్నది తినడానికి ప్రయత్నించండి. దీనివల్ల దాహం సమస్య చాలా వరకు తగ్గుతుంది. నీటికి బదులుగా పండ్ల రసాన్ని నోటిలో వేసుకోవచ్చు లేదా పండును తినవచ్చు. అందులో ఉన్న నీటి ద్వారా కూడా దాహం తీసుకోవచ్చు. ఏది ఏమైనా స్వీట్ తిన్న తర్వాత నీరు తాగడం అనేది మాత్రం మంచి అలవాటు కాదు. ఇది ఆరోగ్యాన్ని చెడగొడుతుంది.