BigTV English

Srilanka in India Map: ఇండియా మ్యాప్‌లో శ్రీలంక ఎందుకు ఉంటుంది..?

Srilanka in India Map: ఇండియా మ్యాప్‌లో శ్రీలంక ఎందుకు ఉంటుంది..?

Reason for Srilanka in Indian Map: మనకు తెలియని విషయాలు ఈ అనంత విశ్వంలో ఎన్నో దాగున్నాయి. అందులో ఇండియా మ్యాప్‌లో శ్రీలంక ఉండటం. మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. సరిహద్దు దేశాలు సగమే ఉంటే.. శ్రీలంక మాత్రం పూర్తిగా కనిపిస్తుంది. అలా ఎందుకు ఉందని ఎప్పుడైనా ఆలోచించారా..? అది ఉంటే మనకు ఎందుకు? లేకుంటే మనకు ఎందుకు అంటారా? ఎప్పుడైనా దీని గురించి అవసరం రావొచ్చు. కాబట్టి ఇప్పుడు తెలుసుకోండి.


మన సరిహద్దు దేశాలుగా పాకిస్థాన్, చైనా, బంగ్లాదేశ్‌ ఉన్నాయి. మీరు ఇండియా మ్యాప్ గమనించినట్లయితే ఇవేమి కనిపించవు. కానీ శ్రీలంక మాత్రం పూర్తి మ్యాప్ కనిపిస్తుంది. దాని అర్థం ఆ దేశంతో మనకు సత్సంబంధాలు ఉన్నాయని కాదు. అలా భావిస్తే పప్పులో కాలేసినట్లే. ఇండియా మ్యాప్‌‌లో మరో దేశాన్ని చూపించడం చట్టనరీత్యా నేరం. కానీ శ్రీలంకను చూపిస్తే మాత్రం నేరంగా పరిగణించడం లేదు. ఐక్యరాజ్య సమితిలో ‘లా ఆఫ్ ది సీ’ పేరుతో అంతర్జాతీయ చట్టం ఉంది. దీనినే సముద్రపు చట్టం లేదా ఓషన్‌ లా అంటారు.

Read More : Dead Sea : ఈ సముద్రంలో మునిగిపోలేరు..!


ఈ చట్టం అమలుపై 1956లో యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ది లా ఆఫ్ ది సీ కాన్ఫరెన్స్ నిర్వహించగా 1958 నుంచి ఈ చట్టం అమలులోకి వచ్చింది. దీని ప్రకారం.. సముద్రానికి సంబంధించిన సరిహద్దులు, ఒప్పందాలపై ఏకాభిప్రాయానికి వచ్చారు. ఒక దేశం సముద్రతీరంలో ఉన్న ప్రాంతాన్ని కూడా ఆ దేశ మ్యాప్‌లో చూపించాలి. ఈ బేస్‌లైన్ దూరమనేది 200 నాటికల్ మైళ్లు(370 కిలోమీటర్లు). మన ఇండియా మ్యాప్‌లో శ్రీలంక చూపించడానికి కారణం ఇదే. ఎందుకంటే శ్రీలంక.. తమిళనాడులోని రామేశ్వరం నుంచి 18 నాటికల్ మైల్స్ మాత్రమే ఉంది. అంటే 54 కిలోమీటర్ల దూరం మాత్రమే. అందుకే ఇండియా మ్యాప్‌లో శ్రీలంక ఒక ముఖ్యమైన స్థానాన్ని సంపాదించింది.

Tags

Related News

Priyanka Tare: ఘనంగా SK మిస్సెస్ ఇండియా యూనివర్స్ ఇంటర్నేషనల్ అందాల పోటీలు.. విజేత ఎవరంటే?

Chia Seeds: నానబెట్టిన చియా సీడ్స్ తింటే.. ఇన్ని లాభాలా ?

Heart Health: హార్ట్ ఎటాక్స్ రాకూడదంటే.. ఈ టిప్స్ ఫాలో అవ్వాల్సిందే ?

Hyderabad: ఘనంగా రన్ ఫర్ ఎస్ఎంఏ – 2025 కార్యక్రమం!

Vitamin D: విటమిన్ డి కోసం.. ఏ టైమ్‌లో ఎండలో నిలబడాలి ?

Iron Rich Foods:తరచూ నీరసంగా, అలసిపోయినట్లు అనిపిస్తోందా? అయితే ఇవి తినండి

Big Stories

×