E-Paper
Advertisement

అందగాళ్లు, శ్రీమంతులు కాదు.. ఈ 6 గుణాలున్న అబ్బాయిలంటేనే అమ్మాయిలకు పిచ్చి!

అందగాళ్లు, శ్రీమంతులు కాదు.. ఈ 6 గుణాలున్న అబ్బాయిలంటేనే అమ్మాయిలకు పిచ్చి!
Advertisement

Relationship Tips: ప్రేమలో పడటానికి అందం, డబ్బు కారణం కావచ్చు. కానీ ఒక వ్యక్తితో జీవితాంతం కలిసి ఉండాలనుకోవడానికి అవి మాత్రమే సరిపోవు. ఎందుకంటే.. బంధం బలంగా ఉండాలంటే ప్రేమతో పాటు నమ్మకం, గౌరవం, భద్రత కూడా ఉండాలి. కొంతమంది పురుషులు ఖరీదైన బహుమతులు ఇవ్వకపోయినా, గొప్పలు చెప్పుకోకపోయినా మహిళల మనసులో ప్రత్యేక స్థానం సంపాదించుకుంటారు. అసలు అలాంటి పురుషుల్లో ఉండే లక్షణాలు ఏంటి? ప్రముఖ డేటింగ్ కోచ్ బ్లెయిన్ ఆండర్సన్ చెప్పిన విషయాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

కష్టాల్లోనూ ప్రశాంతంగా ఉంటాడు..

జీవితంలో సమస్యలు రావడం సహజం. అలాంటి సమయంలో కోప్పడటం, గొడవపడటం లేదా మాట్లాడకుండా దూరంగా ఉండటం కంటే ప్రశాంతంగా సమస్యను పరిష్కరించే వ్యక్తి మహిళలకు నచ్చుతాడు. కష్టకాలంలో భయపడకుండా, భాగస్వామికి అండగా నిలిచే వ్యక్తిపై సహజంగానే నమ్మకం పెరుగుతుంది.

గొప్పలు చెప్పుకోడు..

Advertisement

అందరినీ ఆకట్టుకోవాలనే తాపత్రయం లేని వ్యక్తుల్లో ప్రత్యేకమైన ఆకర్షణ ఉంటుంది. తన గురించి పదే పదే గొప్పగా చెప్పుకోకుండా, ఉన్నది ఉన్నట్టుగా ఉండే వ్యక్తిని మహిళలు ఇష్టపడతారు. నిజమైన ఆత్మవిశ్వాసం మాటల్లో కాదు, ప్రవర్తనలో కనిపిస్తుంది.

భద్రత, నమ్మకం ఇస్తాడు..

భాగస్వామితో ఉన్నప్పుడు మనసులోని విషయాలను భయం లేకుండా చెప్పుకోగలగాలి. తప్పులు చేసినప్పుడు అవమానించకుండా, కష్టాల్లో వదిలేయకుండా అండగా నిలవాలి. శారీరక భద్రతతో పాటు మానసికంగా కూడా భరోసా ఇచ్చే వ్యక్తిని మహిళలు వదులుకోవడానికి ఇష్టపడరు.

Advertisement

Also Read:  దీపావళి రోజున కొబ్బరికాయతో ఈ చిన్న పని చేస్తే.. మీ ఇంట్లో ఐశ్వర్యం తాండవిస్తుంది!

తనకంటూ ఓ ప్రపంచం ఉంటుంది..

ప్రేమలో ఉన్నంత మాత్రాన స్నేహితులను, ఇష్టాలను, వ్యక్తిగత జీవితాన్ని వదులుకోవాల్సిన అవసరం లేదు. తనకంటూ లక్ష్యాలు, అభిరుచులు, స్నేహాలు ఉన్న వ్యక్తి బంధంలోనూ మంచి సమతుల్యత పాటిస్తాడు. తన జీవితాన్ని తానే ఆనందంగా గడిపే వ్యక్తి భాగస్వామికి కూడా వ్యక్తిగత స్వేచ్ఛ ఇస్తాడు.

తన విలువ తెలుసుకుంటాడు..

తనకు ఏది కావాలో, ఏది వద్దో తెలిసిన వ్యక్తిని మహిళలు గౌరవిస్తారు. బంధం కోసం తన విలువలను వదులుకోకుండా, అవసరమైనప్పుడు హద్దులు పెట్టుకునే వ్యక్తిపై మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. ప్రతి విషయంలోనూ ఎదుటివారిని సంతోషపెట్టాలనే ప్రయత్నం చేయకుండా తన ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటాడు.

జీవితానికి ఓ లక్ష్యం ఉంటుంది..

జీవితంలో ఏదో ఒకటి సాధించాలనే తపన ఉన్న వ్యక్తి మహిళలను ఆకట్టుకుంటాడు. దీనికోసం పెద్ద పెద్ద కలలు కనాల్సిన అవసరం లేదు. తనకు నచ్చిన పనిపై ఆసక్తి చూపిస్తూ, భవిష్యత్తు కోసం కష్టపడుతూ ముందుకు సాగాలి. లక్ష్యం, పట్టుదల ఉన్న వ్యక్తితో జీవితం పంచుకోవాలని మహిళలు కోరుకుంటారు.

Also Read: మాట్లాడేటప్పుడు కళ్లు పక్కకు తిప్పడం బలహీనత కాదా? సైకాలజీ చెప్తున్న అసలు నిజమిదే!

Tags

Related News

సోషల్ మీడియా ఇష్టంలేని బాయ్‌ఫ్రెండ్.. రీల్స్ అంటే పడిచచ్చే గర్ల్‌ఫ్రెండ్.. ప్రేమ నిలుస్తుందా?

పిల్లలు అన్ని రంగాల్లో రాణించాలని తపనపడుతున్నారా? తల్లిదండ్రులు చేసే తప్పులు ఇవే

మనసులో ఒకటి, మెదడులో మరొకటి.. ఈ తేదీల్లో పుట్టినవారు ఎప్పుడూ నిర్ణయాల్లో తడబడుతుంటారు

డ్రాగన్ ఫ్రూట్ తింటే చర్మానికి ఇన్ని ప్రయోజనాలా? రోజూ ఇలా తినండి

వాయు కాలుష్యం నుంచి రక్షణకు ఏ మాస్క్ ధరించాలి.. N95, N99, KN95 మధ్య తేడాలివే

ఆలూ స్ప్రింగ్ రూల్స్..క్రిస్పీ అండ్ టేస్టీ ఈవినింగ్ స్నాక్ రెసిపీ

ఇలా వంకాయ ఫ్రై చేస్తే..అందరూ లొట్టలేసుకుంటూ తింటారు

Big Stories

Advertisement
×