Potato Spring Roll: రోజూ ఒకే రకమైన స్నాక్స్ తిని పిల్లలు బోరింగ్‌గా ఫీలవుతున్నారా? బయట స్ట్రీట్ ఫుడ్స్ తిని ఆరోగ్యం పాడవుతుందనే.. టెన్షన్ ఉందా? అయితే మీకోసం.. ఒక సూపర్ ట్రెండీ అండ్ హెల్తీ రెసిపీ ఉంది.అదే పొటాటో స్ప్రింగ్ రోల్. బంగాళదుంపలతో చేసే ఈ స్నాక్ పైకి గోల్డెన్ కలర్ లో క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా అద్భుత మైన రుచితో ఉంటుంది. పుట్టిన రోజు వేడుకలకైనా, సాయంత్రం పూట పిల్లల స్నాక్స్ కోసమైనా ఇది పర్ఫెక్ట్ ఛాయిస్. మరి ఈ రెసిపీని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
ఉడికించి పొట్టు తీసిన బంగాళదుంపలు-3
స్ప్రింగ్ రోల్ షీట్స్ – అవసరమైనన్ని
సన్నగా తరిగిన ఉల్లిపాయ-1
పచ్చిమిర్చి తరుగు-2 స్పూన్లు
అల్లం వెల్లుల్లి పేస్ట్-1 స్పూన్
కారం -అర స్పూన్
గరం మసాలా-అర స్పూన్
మైదా పిండి-2 స్పూన్లు
నూనె – డిప్ ఫ్రైకి సరిపడా
ఉప్పు – రుచికి సరిపడా
కొత్తిమీర తరుగు – కొద్దిగా
1. మొదటగా ఉడికించిన బంగాళదుంపలను మెత్తగా మెదుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి కొద్దిగా నూనె వేయాలి. నూనె వేడెక్కిన.. తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఉల్లిపాయలు కొద్దిగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు మగ్గనివ్వాలి. ఆ తర్వాత మాష్ చేసి పెట్టుకున్న బంగాళదుంప మిశ్రమాన్ని అందులో కలపాలి. దీనికి తగినంత ఉప్పు, కారం, గరం మసాలా వేసి బాగా కలపాలి. మసాలాలన్నీ బంగాళదుంపలకు బాగా పట్టిన తర్వాత చివరగా కొద్దిగా కొత్తి మీర తరుగు వేసి స్టవ్ ఆఫ్ చేయాలి. ఈ స్టఫింగ్ ను పూర్తిగా చల్లారబెట్టాలి.
2.ఇప్పుడు ఒక చిన్న గిన్నెలో మైదా పిండి, కొద్దిగా నీరు కలిపి పేస్ట్ లా తయారు చేసి పక్కన పెట్టుకోవాలి. స్ప్రింగ్ రోల్ షీట్ ను ఒక ప్లేట్ లో పరుచుకోవాలి. దాని మధ్యలో తయారు చేసుకున్న పొటాటో స్టఫింగ్ ను కొద్దిగా ఉంచి, రోల్ లా చుట్టాలి. చివర్లలో మైదా పేస్ట్ రాసి ఊడిపోకుండా గట్టిగా సీల్ చేయాలి. ఇలా అన్ని షీట్లతో రోల్స్ తయారు చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకోవాలి. నూనె మీడియంగా వేడెక్కిన తర్వాత తయారు చేసుకున్న స్ప్రింగ్ రోల్స్ ను వేయాలి. మంటను మీడియం ఫ్లేమ్ లో ఉంచి రోల్స్ అన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు క్రిస్పీగా వేయించుకోవాలి. హై ఫ్లేమ్ లో పెడితే పైకి మాడిపోతాయి కాబట్టి జాగ్రత్తగా వేయించాలి.
Also Read: ఇలా వంకాయ ఫ్రై చేస్తే..అందరూ లొట్టలేసుకుంటూ తింటారు
3. రోల్స్ వేగిన తర్వాత నూనె లేకుండా టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే..గుమగుమలాడే రెస్టారెంట్ స్టైల్ ఆలూ స్ప్రింగ్ రోల్స్ సిద్ధం! వీటిని టమాటో కెచప్ లేదా మైనోస్ తో తింటే.. రుచి వేరే లెవెల్‌లో ఉంటుంది.
ఈ పొటాటో స్ప్రింగ్ రోల్స్ ప్రత్యేకత ఏంటంటే..ఇవి చూడటానికి చాలా అట్రాక్టివ్‌గా ఉంటాయి.ముఖ్యంగా.. పిల్లలు వీటిని ఎంతో ఇష్టంగా తింటారు.ఇంట్లో ఉండే సాధారణ పదార్థాలతోనే..తక్కువ టైంలో.. వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీకెండ్ లో మీ పిల్లల కోసం..ఈ ట్రెండీ స్నాక్ ని తప్పకుండా ట్రై చేయండి, వాళ్ళు ఎంతో ఆనందిస్తారు!