E-Paper
Advertisement

ఇలా వంకాయ ఫ్రై చేస్తే..అందరూ లొట్టలేసుకుంటూ తింటారు

ఇలా వంకాయ ఫ్రై చేస్తే..అందరూ లొట్టలేసుకుంటూ తింటారు
Advertisement

Andhra Style Vankaya Fry: ముఖ్యంగా తెలుగు వంటకాల్లో వంకాయకు ప్రత్యేక స్థానం ఉంది. వంకాయతో ఏ కూర చేసినా రుచి అద్భుతంగా ఉంటుంది. అయితే.. చాలా మంది పిల్లలు వంకాయ అనగానే తినడానికి ఇష్టపడరు. అలాంటి వారికీ కూడా వంకాయ అంటే ఇష్ట పడేలా చేసే అద్భుతమైన రెసిపీనే ఈ ఆంధ్ర స్టైల్ వంకాయ ఫ్రై. పర్ఫెక్ట్ మసాలా దినుసులు, గుమ గుమలాడే పోపుతో చేసే ఈ ఫ్రై టేస్ట్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. మరి ఈ రెసిపీని ఎంతో రుచిగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

కావలసిన పదార్థాలు:

గుండ్రని లేదా పొడవుగా ఉండే తాజా వంకాయలు-అర కిలో

Advertisement

నూనె – సరిపడా

పసుపు – అర టీస్పూన్

Advertisement

కారం – 1 స్పూన్

ధనియాల పొడి – 1 స్పూన్

జీలకర్ర పొడి – అర స్పూన్

గరం మసాలా – అర స్పూన్

అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 స్పూన్

శనగపిండి లేదా బియ్యం పిండి – 2 స్పూన్లు

ఉప్పు – రుచికి సరిపడా

కరివేపాకు – రెండు రెమ్మలు

కొత్తిమీర తరుగు – కొద్దిగా

తయారీ విధానం:

1.మొదటగా వంకాయలను శుభ్రంగా కడిగి, పొడవుగా లేదా మీకు నచ్చిన ఆకారంలో ముక్కలుగా కట్ చేసుకోవాలి. వంకాయలు కట్ చేశాక నల్లగా మారాకుండా ఉప్పు వేసిన నీటిలో కొద్దిసేపు ఉంచాలి. ఆ తర్వాత నీటిని పూర్తిగా వడకట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో కట్ చేసుకున్న వంకాయ ముక్కలను.. తీసుకోవాలి. అందులో పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరి పడా ఉప్పు వేయాలి. వీటికి అదనంగా రెండు స్పూన్ల శనగపిండి లేదా బియ్యం పిండిని కలపడం వల్ల వంకాయ ముక్కలు నూనెలో వేగాక క్రిస్పీగా వస్తాయి. ఈ మసాలాలన్నీ ముక్కలకు బాగా పట్టేలా చేతితో కలిపి ఒక పది నిమిషాలు నానిన తర్వాత పక్కన పెట్టాలి.

Also Read: 10 నిమిషాల్లో అదిరిపోయే గోధుమ రవ్వ ప్రసాదం..ఈజీగా చేయండిలా!

2. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఫ్రైకి సరిపడా నూనె పోసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత మసాలా పట్టించి..పెట్టుకున్న వంకాయ ముక్కలను కొద్ది కొద్దిగా వేయాలి. మంటను మీడియం ఫ్లేమ్ లో.. ఉంచి వంకాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే.. ముక్కలన్నీ సమానంగా వేగుతాయి. వంకాయ ముక్కలు క్రిస్పీగా మారిన తర్వాత, చివరిగా కొద్దిగా కరి వేపాకు, సన్నగా తరిగిన కొత్తిమీరను వేసి మరో నిమిషం పాటు వేయించాలి. ఆ తర్వాత నూనె లేకుండా.. ముక్కలను టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే.. ఘుమఘుమలాడే క్రిస్పీ ఆంధ్ర స్టైల్ వంకాయ ఫ్రై రెడీ అయిపోయినట్లే!

ఈ వంకాయ ఫ్రై ప్రత్యేకత ఏంటంటే.. పైకి క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా చాలా జ్యూసీగా ఉంటుంది. సాంబార్ అన్నం, రసం అన్నం, పప్పు చారు లేదా ముద్దపప్పుతో.. ఈ ఫ్రై కాంబినేషన్ అద్భుతంగా సెట్ అవుతుంది. వీకెండ్ లో లేదా ప్రత్యేకమైన రోజుల్లో మీ ఇంట్లో ఈ రెసిపీని ట్రై చేస్తే అందరూ మీ వంటకానికి ఫిదా అయిపోతారు.

Related News

సొరకాయ మెంతాకు రోటి పచ్చడి..రుచిలో అదుర్స్,తయారీ కూడా చాలా సింపుల్!

భారత్‌లోకి టపాసులు ఎప్పుడు వచ్చాయి.. దీపావళి బాణాసంచా వెనుక ఇంత చరిత్ర ఉందా?

59 ఏళ్ల వయసులో టీనేజర్ లాంటి ఫిట్‌నెస్.. ఇండస్ట్రీలోనే అత్యంత ఫిట్ హీరో హెల్త్ సీక్రెట్

పిల్లలు పబ్లిక్ ప్లేస్‌లో మొండి చేస్తున్నారా? ఈ టిప్స్‌తో సులభంగా హ్యాండిల్ చేయండి

దీపావళి వంటకాలు తిని కడుపునొప్పి తీవ్రంగా అనిపిస్తోందా? ఈ సమస్యలుంటే సర్జరీ అవసరం

కొత్త డేటింగ్ ట్రెండ్.. ప్రేమలో అనుబంధం తగ్గితే బ్రేకప్ చేయకుండా మంకీ బ్రాంచింగ్

దీపావళికి టపాసులు కాలుస్తూ గాయపడ్డారా? కాలిన గాయలకు వెంటనే ఇలా చేయండి

Big Stories

Advertisement
×