Numerology| కొంతమందికి ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. ఒక పని ప్రారంభించాలనుకుంటారు. ఇంతలోనే మరో అవకాశం కనిపిస్తే దాని వైపు మనసు మళ్లుతుంది. చివరకు ఏ పని చేయాలో తెలియక అయోమయానికి గురవుతారు. న్యూమరాలజీ (అంకశాస్త్రం) ప్రకారం రెండు ప్రత్యేక మూల అంకాలు ఉన్నవారిలో ఇలాంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయని చెబుతారు.
ఈ రెండు మూలాంకాల వ్యక్తులు ఆలోచనల్లో చురుగ్గా ఉంటారని న్యూమరాలజీ వివరిస్తుంది. అయితే, ఒకే నిర్ణయంపై నిలబడలేకపోవడం వల్ల కొన్నిసార్లు ఇబ్బందులు ఎదుర్కొంటారని నమ్ముతారు. మరి ఈ మూలాంకాల వారి స్వభావం ఎలా ఉంటుంది? వారు ఎదుర్కొనే సమస్యలేమిటో తెలుసుకుందాం.
న్యూమరాలజీ ప్రకారం మూలాంకం 5 ఉన్నవారు తెలివైనవారు, ఆసక్తి కలిగినవారు, స్వేచ్ఛను ఇష్టపడేవారు. కొత్త విషయాలు నేర్చుకోవడం, విభిన్న అనుభవాలను పొందడం వీరికి చాలా ఇష్టం. ఒకే పనిని ఎక్కువ కాలం చేయడం వీరికి నచ్చకపోవచ్చు. కొత్త అవకాశాలు, మార్పులు వీరిని త్వరగా ఆకర్షిస్తాయి. అందుకే ఎప్పుడూ ఏదో ఒక కొత్త పని చేయాలని ఆలోచిస్తుంటారు.
అయితే, ఇదే స్వభావం కొన్నిసార్లు సమస్యగా మారుతుంది. ఒక పని పూర్తికాకముందే మరో పనిని ప్రారంభించే అవకాశం ఉంటుంది. దీంతో ముఖ్యమైన పనులు మధ్యలోనే ఆగిపోవచ్చు. ఏకాగ్రత తగ్గడం వల్ల ఉద్యోగం, వ్యక్తిగత జీవితంపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది.
మూలాంకం 5 ఉన్నవారు కొన్నిసార్లు తొందరగా నిర్ణయాలు తీసుకుంటారని న్యూమరాలజీ చెబుతోంది. నిర్ణయం తీసుకున్న తర్వాత కొత్త ఆలోచన వస్తే దాన్ని మార్చుకోవచ్చు. ఇలా తరచూ నిర్ణయాలు మార్చడం వల్ల పనుల్లో ఆలస్యం జరగవచ్చు. ఇతరులకు కూడా వీరి ప్రణాళికలు అర్థం కాకపోవచ్చు. అందుకే ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఆలోచించడం, పనులను పూర్తిచేయడంపై దృష్టి పెట్టడం మంచిది.
న్యూమరాలజీ ప్రకారం మూలాంకం 2 ఉన్నవారు సున్నిత మనస్కులు, భావోద్వేగపరులు, ఊహాశక్తి కలిగినవారు. ఇతరుల భావాలను సులభంగా అర్థం చేసుకోగలరు. చిన్న విషయాలను కూడా మనసుకు తీసుకుంటారు. అయితే, అతిగా ఆలోచించడం వల్ల కొన్నిసార్లు ఇబ్బందులు ఎదురవుతాయి. ఇతరులు చెప్పే మాటలు వీరిపై ఎక్కువ ప్రభావం చూపవచ్చు. దీంతో నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం జరుగుతుంది.
Also Read: ఆఫీస్‌లో సహోద్యోగులతో స్నేహం మంచిదే.. కానీ ఈ విషయాలు మాత్రం వారికి చెప్పకూడదు
ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు దానిలోని మంచి, చెడు విషయాలను వీరు బేరీజు వేస్తారు. ఇతరుల అభిప్రాయాలకు కూడా ప్రాధాన్యత ఇస్తారు. దీంతో తమకు ఏది మంచిదో తెలిసినా ముందడుగు వేయడానికి సంకోచిస్తారు.
కొన్నిసార్లు మనసు చెప్పేది ఒకటైతే, వాస్తవ పరిస్థితులు మరోలా ఉండవచ్చు. ఈ రెండింటి మధ్య సమతుల్యత సాధించలేక అయోమయానికి గురవుతారు.
Also Read: ఆ దేశంలో అంతా రివర్స్.. ప్రజలకు కరెంట్ బిల్లు చెల్లిస్తున్న ప్రభుత్వం.. ఎలాగంటే
న్యూమరాలజీ ప్రకారం మూలాంకం 5 ఉన్నవారు కొత్త ఆలోచనలతో దృష్టి మళ్లించుకోవచ్చు. మూలాంకం 2 ఉన్నవారు భావోద్వేగాల కారణంగా నిర్ణయాలు వాయిదా వేయవచ్చు. స్పష్టమైన లక్ష్యాలు, ఓపిక, ఆత్మవిశ్వాసం ఉంటే ఈ సమస్యలను అధిగమించవచ్చు.
Also Read: నెలకు రూ.68 కోట్లు సంపాదిస్తున్న మిస్టర్ బీస్ట్.. పెద్ద యూట్యూబర్ కావాలంటే ఏం చేయాలి