E-Paper
Advertisement

వాయు కాలుష్యం నుంచి రక్షణకు ఏ మాస్క్ ధరించాలి.. N95, N99, KN95 మధ్య తేడాలివే

వాయు కాలుష్యం నుంచి రక్షణకు ఏ మాస్క్ ధరించాలి.. N95, N99, KN95 మధ్య తేడాలివే
Advertisement

Air Pollution N95 vs N99 Masks: నగరాల్లో రోజురోజుకూ పెరుగుతున్న వాయు కాలుష్యం ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. బయటకు అడుగుపెట్టాలంటేనే చాలామంది భయపడుతున్నారు. ముఖ్యంగా దీపావళి తర్వాత ఢిల్లీ, హైదరాబాద్ వంటి నగరాల్లో గాలి నాణ్యత ప్రమాదకర స్థాయికి చేరింది. ఇలాంటి పరిస్థితుల్లో మాస్క్ ధరించడం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. అయితే మార్కెట్లో N95, N99, KN95 వంటి రకరకాల మాస్కులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఏది ఎక్కువ రక్షణ ఇస్తుంది? ఏ మాస్క్ కొనడం మంచిది? తెలుసుకుందాం.

హైదరాబాద్‌లో ప్రమాదకర స్థాయికి చేరిన వాయు కాలుష్యం

దీపావళి వేడుకల తర్వాత హైదరాబాద్‌లో వాయు కాలుష్యం ఒక్కసారిగా పెరిగింది. నవంబర్ 8న రాత్రి 9:30 గంటల సమయంలో నగర సగటు AQI 509కు చేరుకుంది. ఇది అత్యంత ప్రమాదకరమైన కాలుష్య స్థాయి.
aqi.in డేటా ప్రకారం.. రాత్రి 7:30 నుంచి 8:30 గంటల మధ్య హైదరాబాద్ నగరంలో AQI 176 నుంచి ఒక్కసారిగా 321కు పెరిగింది. నగరంలోని 50కి పైగా ప్రాంతాల్లో కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరింది. బేగంపేటలోని ప్రకాశ్ నగర్ మెట్రో స్టేషన్ వద్ద అత్యధికరంగా AQI 828గా నమోదైంది. దేశ రాజధాని ఢిల్లీలో అయితే AQI 637 ఉంది.

AQI అంటే ఏంటి?

Advertisement

AQI (గాలి నాణ్యత సూచిక) అనేది గాలిలోని కాలుష్య స్థాయిని తెలిపే కొలమానం. గాలి ఎంత స్వచ్ఛంగా లేదా కలుషితంగా ఉందో, అది మన ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలియజేస్తుంది. దీని సంఖ్య ఎంత ఎక్కువ ఉంటే గాలి కాలుష్యం అంత తీవ్రంగా ఉందని అర్థం. గాలిలోని PM2.5, PM10 వంటి సూక్ష్మ కాలుష్య కణాలు శ్వాస ద్వారా ఊపిరితిత్తుల్లోకి చేరవచ్చు. అందుకే బయటకు వెళ్లేటప్పుడు సరైన మాస్క్ ధరించడం ముఖ్యం.

N95 మాస్క్

N95 మాస్క్ 0.3 మైక్రాన్ పరిమాణంలోని పరీక్షా కణాల్లో కనీసం 95 శాతాన్ని ఫిల్టర్ చేస్తుంది. ఇందులో ఉండే బహుళ పొరల ఫిల్ట్రేషన్ వ్యవస్థ సూక్ష్మ కణాలను అడ్డుకుంటుంది. PM2.5 కాలుష్యం నుంచి రక్షణ పొందేందుకు ఇది మంచి ఎంపిక. అయితే మాస్క్ ముఖానికి సరిగ్గా సరిపోవాలి. కొనుగోలు చేసేటప్పుడు NIOSH ఆమోదం పొందిన అసలైన మాస్క్‌ను ఎంచుకోవాలి.

N99 మాస్క్

Advertisement

N99 మాస్క్ కూడా N95 మాదిరిగానే పనిచేస్తుంది. అయితే దీని ఫిల్ట్రేషన్ సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. ఇది 0.3 మైక్రాన్ పరీక్షా కణాల్లో కనీసం 99 శాతాన్ని ఫిల్టర్ చేస్తుంది. అయితే ఎక్కువ ఫిల్ట్రేషన్ సామర్థ్యం ఉన్నంత మాత్రాన అన్ని సందర్భాల్లో ఇది మెరుగైన రక్షణ ఇస్తుందని చెప్పలేం. ముఖానికి సరిగ్గా సరిపోకపోతే కాలుష్య గాలి లోపలికి ప్రవేశిస్తుంది.

KN95 మాస్క్

KN95 మాస్క్ చైనాకు చెందిన GB2626 ప్రమాణాలను అనుసరిస్తుంది. ఇది 0.3 మైక్రాన్ పరీక్షా కణాల్లో కనీసం 95 శాతాన్ని ఫిల్టర్ చేస్తుంది. కాలుష్యం నుంచి రక్షణ కోసం దీనిని కూడా ఉపయోగించవచ్చు. అయితే మార్కెట్లో నకిలీ మాస్కులు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. అందువల్ల తయారీదారు వివరాలు, ధ్రువీకరణను పరిశీలించి కొనడం మంచిది.

సర్జికల్ మాస్కులు వద్దు

సర్జికల్ మాస్కులు ప్రధానంగా పెద్ద తుంపర్లు, ద్రవ చుక్కల నుంచి రక్షణ కోసం తయారుచేస్తారు. ఇవి N95, KN95 మాస్కుల మాదిరిగా ముఖానికి వాయు కాలుష్యం సమయంలో సరిపోవు. దీంతో అంచుల నుంచి కాలుష్య గాలి లోపలికి వెళ్లవచ్చు. కాబట్టి PM2.5 వంటి సూక్ష్మ కణాల నుంచి రక్షణకు వీటిపై ఆధారపడకూడదు.

Also Read: 59 ఏళ్ల వయసులో టీనేజర్ లాంటి ఫిట్‌నెస్.. ఇండస్ట్రీలోనే అత్యంత ఫిట్ హీరో హెల్త్ సీక్రెట్

మాస్క్ కొనేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి

మాస్క్ కొనేటప్పుడు ఫిల్ట్రేషన్ సామర్థ్యంతో పాటు మరికొన్ని విషయాలు గమనించాలి.
మాస్క్ ముక్కు, నోరు, గడ్డం పూర్తిగా కప్పాలి.
ముఖం చుట్టూ గాలి ప్రవేశించే ఖాళీలు ఉండకూడదు.
టైట్, లూజ్ సర్దుబాటు చేసుకునే స్ట్రాప్స్, నోస్ క్లిప్ ఉండాలి.
గడ్డం ఉంటే మాస్క్ సీల్ దెబ్బతినే అవకాశం ఉంటుంది.
నమ్మకమైన విక్రేతల దగ్గర మాత్రమే బ్రాండెడ్ మాస్కులు కొనాలి.
మాస్కులను శుభ్రమైన, పొడి ప్రదేశంలో భద్రపరచాలి.

Also Read: దీపావళి వేళ రికార్డు స్థాయి వ్యాపారం.. కేవలం ఢిల్లీలోనే రూ.లక్షల కోట్లకుపైగా.. దేశవ్యాప్తంగా ఎంతంటే

N95, N99, KN95లో ఏది ఎంచుకోవాలి?

N95, KN95 మాస్కులు రెండూ 95 శాతం ఫిల్ట్రేషన్ ప్రమాణాన్ని కలిగి ఉంటాయి. N99 మాస్క్ 99 శాతం గాలి ఫిల్ట్రేషన్  చేస్తుంది. అయితే మాస్క్ క్వాలిటీ, ధ్రువీకరణతో పాటు ముఖానికి సరిపోయే విధానం కూడా ముఖ్యం. అందుకే మీకు సరిపోని N99 మాస్క్ కంటే సరిపడే N95 మాస్క్ మెరుగైన రక్షణ అందించవచ్చు. కాలుష్యం ఎక్కువగా ఉన్నప్పుడు బయట తిరగడం తగ్గించడంతో పాటు సరైన మాస్క్ ధరించడం మంచిది.

Related News

ఆలూ స్ప్రింగ్ రూల్స్..క్రిస్పీ అండ్ టేస్టీ ఈవినింగ్ స్నాక్ రెసిపీ

ఇలా వంకాయ ఫ్రై చేస్తే..అందరూ లొట్టలేసుకుంటూ తింటారు

సొరకాయ మెంతాకు రోటి పచ్చడి..రుచిలో అదుర్స్,తయారీ కూడా చాలా సింపుల్!

భారత్‌లోకి టపాసులు ఎప్పుడు వచ్చాయి.. దీపావళి బాణాసంచా వెనుక ఇంత చరిత్ర ఉందా?

59 ఏళ్ల వయసులో టీనేజర్ లాంటి ఫిట్‌నెస్.. ఇండస్ట్రీలోనే అత్యంత ఫిట్ హీరో హెల్త్ సీక్రెట్

పిల్లలు పబ్లిక్ ప్లేస్‌లో మొండి చేస్తున్నారా? ఈ టిప్స్‌తో సులభంగా హ్యాండిల్ చేయండి

దీపావళి వంటకాలు తిని కడుపునొప్పి తీవ్రంగా అనిపిస్తోందా? ఈ సమస్యలుంటే సర్జరీ అవసరం

Big Stories

Advertisement
×