Jio Rs 123 Plan: తక్కువ ధరలో నాణ్యమైన సేవలు అందించే టెలికాం సంస్థల్లో రిలయన్స్ జియో ఒకటి. ఈ క్రమంలోనే ఇటీవల తీసుకొచ్చిన రూ.123 ప్లాన్ యూజర్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. సామాన్య, మధ్యతరగతి యూజర్లు దీనిని రీఛార్జ్ చేసుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్లు జియో వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో రూ.123 ప్లాన్ ప్రత్యేకతలు, దానిని రీఛార్జ్ చేసుకోవడం వల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటో ఈ కథనంలో చూద్దాం.
జియో ఈ రూ. 123 రీఛార్జ్ ప్లాన్ ను 28 రోజుల వ్యాలిడిటీతో తీసుకొచ్చింది. ముఖ్యంగా జియోఫోన్ 4G ఫీచర్ ఫోన్ ను వినియోగిస్తున్న వారిని దృష్టిలో ఉంచుకొని ఈ ప్లాన్ ను రూపొందించింది. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకోవడం ద్వారా యూజర్ కు రోజుకు దాదాపు రూ. 4.39 మాత్రమే ఖర్చవుతుందని జియో వర్గాలు పేర్కొన్నాయి.
ఈ ప్లాన్ కింద యూజర్లు.. దేశవ్యాప్తంగా ఏ నెట్ వర్క్ కు అయినా ఉచితంగా కాల్స్ చేసుకోవచ్చు. 28 రోజుల పాటు ఎంతైనా మాట్లాడుకోవచ్చు. ఇక డేటా విషయానికి వస్తే.. ప్రతిరోజూ 0.5 GB (500 MB) చొప్పున మొత్తం 28 రోజులకు 14 GB హై-స్పీడ్ డేటా లభించనుంది. రోజువారీ డేటా పరిమితి పూర్తయినప్పటికీ ఇంటర్నెట్ కట్ అవ్వకుండా 64 Kbps వేగంతో కొనసాగుతుందని జియో వెల్లడించింది. మరోవైపు ఈ ప్లాన్ మెుత్తానికి 300 ఎస్ఎంఎస్ లు లభించనున్నాయి.
Also Read: నటుడు కావాలనే కల.. కుటుంబ ఒత్తిడితో చదువు.. చివరకు 19వ అంతస్తు నుంచి దూకి..!
ఈ రూ.123 ప్లాన్ లో కాల్స్, డేటాతోనే ఆగకుండా జియో తన వినోద సేవలను కూడా ఫ్రిగా అందిస్తోంది. పాటల కోసం ‘జియోసావన్’ (JioSaavn), లైవ్ టీవీ ఛానెళ్ల కోసం ‘జియోటీవీ’ (JioTV) సబ్‌స్క్రిప్షన్లను యూజర్ వినియోగించుకోవచ్చు. ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా (Vi) వంటి సంస్థలతో పోలిస్తే ఈ ధరకు (రూ.123) ఇన్ని ప్రయోజనాలు అందించడం జియోకే చెల్లిందని నిపుణులు అంటున్నారు. జియో ఫీచర్ ఫోన్ ఉండి.. చౌకైన రీఛార్జ్ ప్లాన్ కోరుకుంటే ఈ రూ.123 ప్లాన్ ది బెస్ట్ అని పేర్కొంటున్నారు.
Also Read: స్క్రాప్ బిజినెస్ ఎలా ప్రారంభించాలి? ఎక్కడ కొనాలి, ఎవరికి అమ్మాలి? చెత్త నుంచి సూపర్ సంపాదన