Noise Buds R1 Gaana Edition: వైర్‌లెస్ ఆడియో మార్కెట్‌లో వినియోగదారులను ఆకట్టుకునేందుకు టెక్ కంపెనీలు కొత్త ప్రయోగాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ ఆడియో బ్రాండ్ నాయిస్ (Noise), మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ గానా (Gaana)తో చేతులు కలిపింది. ఈ భాగస్వామ్యంలో భాగంగా Noise Buds R1 Gaana Edition ఇయర్‌బడ్స్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ప్రత్యేకమైన డిజైన్, వైర్‌లెస్ ఆడియో అనుభూతితో పాటు, ఏడాది పాటు ఉచితంగా మ్యూజిక్ వినే సదుపాయాన్ని అందించడం ఈ కొత్త ఇయర్‌బడ్స్‌లో ప్రధాన ఆకర్షణ. మరి ఈ ఇయర్‌బడ్స్‌లో ఉన్న ఫీచర్లు ఏమిటి? వీటి ధర ఎంత? గానా సబ్‌స్క్రిప్షన్ ఆఫర్ ఎలా పనిచేస్తుందనే వివరాలు చూద్దామా..
ఈ కొత్త ఇయర్‌బడ్స్ ధర భారత్‌లో కేవలం రూ.1,399 మాత్రమే ఉంది. ఈ ప్రైస్‌కి ఇలాంటి ఫీచర్స్ రావడం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. వీటిని నాయిస్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా లేదా గానా వెబ్‌సైట్, యాప్ ద్వారా కొనుగోలు చేసుకోవచ్చు. ఇక స్టాండర్డ్ ఎడిషన్ విషయానికి వస్తే.. ఇది మ్యాట్ బ్లాక్, మచ్చా గ్రీన్, స్నో వైట్, స్పెషల్ బ్లూ వంటి ఆకర్షణీయమైన రంగుల్లో నాయిస్ వెబ్‌సైట్‌తో పాటు ఫ్లిప్‌కార్ట్‌లో కూడా అందుబాటులో ఉంది.
Also Read: వావ్.. ఏకంగా 7 ఐఫోన్ మోడళ్లపై భారీ డిస్కౌంట్లు, యాపిల్ లవర్స్‌కు పండగ లాంటి ఆఫర్!
ఈ ఇయర్‌బడ్స్ ప్రత్యేకత ఏంటంటే.. వీటిని కొనుగోలు చేసిన ప్రతి ఒక్కరికీ రూ.799 విలువ చేసే గానా ప్లస్ (Gaana Plus) సబ్‌స్క్రిప్షన్ ఏడాది పాటు పూర్తిగా ఉచితంగా లభిస్తుంది. సాధారణంగా మనం మ్యూజిక్ వినేటప్పుడు వచ్చే యాడ్స్ చాలా చిరాకు తెప్పిస్తుంటాయి. కానీ ఈ సబ్‌స్క్రిప్షన్ ఉంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా యాడ్స్ లేని మ్యూజిక్‌ను ఎంజాయ్ చేయవచ్చు. అంతేకాదు.. మనకు నచ్చిన పాటలను ఆఫ్‌లైన్ డౌన్‌లోడ్ చేసుకోవడంతో పాటు హెచ్‌డీ ఆడియోలో కూడా వినొచ్చు.
ఇక ఇయర్‌బడ్స్‌లో మెయిన్‌గా చూసేది బ్యాటరీ లైఫే. Noise Buds R1 Gaana Edition ఛార్జింగ్ కేస్‌తో కలిపి మొత్తం 40 గంటల పాటు నాన్‌స్టాప్ ప్లేబ్యాక్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. అంటే రోజంతా వాడుకున్నా బ్యాటరీ అయిపోతుందనే టెన్షన్ ఉండదు. ఒకవేళ అర్జెంట్‌గా బయటకు వెళ్లాల్సి వస్తే.. కేవలం 10 నిమిషాలు ఛార్జ్ చేస్తే చాలు.. సుమారు 120 నిమిషాల పాటు పాటలు వినవచ్చు. ఇందులో ఉన్న ఇన్‌స్టా ఛార్జ్ టెక్నాలజీ ఈ పనిని చాలా సులభం చేస్తుంది.
ఈ Noise Buds R1 Gaana Editionలో 11ఎంఎం డైనమిక్ డ్రైవర్లను అమర్చారు. దీనివల్ల మంచి బాస్ ఫోకస్డ్ సౌండ్ లభిస్తుంది. అలాగే ఫోన్ మాట్లాడేటప్పుడు అవతలి వారికి మన గొంతు స్పష్టంగా వినిపించేందుకు క్వాడ్ మైక్రోఫోన్లు, ఎన్విరాన్‌మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ (ENC) టెక్నాలజీని అందించారు. దీనిద్వారా బయట ఎంత రద్దీగా ఉన్నా డిస్టర్బెన్స్ లేకుండా క్లియర్‌గా మాట్లాడొచ్చు. మొత్తానికి తక్కువ బడ్జెట్‌లో మంచి సౌండ్, బోలెడన్ని ఫీచర్లు కోరుకునే వారికి ఈ గానా ఎడిషన్ బడ్స్ ఒక మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు.
Also Read: మేడ్ ఇన్ ఇండియా మొబైల్స్ ఈజ్ బ్యాక్.. కార్బన్ నుంచి రాబోతున్న ఆ రెండు ఫోన్లు ఇవే!