BigTV English

Sexual Freedom: ఈ దేశం వాళ్లకు ఎప్పుడూ ‘అదే’ పని.. మరి ఇండియా?

Sexual Freedom: ఈ దేశం వాళ్లకు ఎప్పుడూ ‘అదే’ పని.. మరి ఇండియా?

ప్రపంచ దేశాలలో లైంగికత అనేది భిన్నమైన అర్థాలను, భిన్న అభిప్రాయాలను కలిగి ఉంది. అన్ని దేశాల్లోనూ లైంగిక విషయాలను బహిరంగంగా మాట్లాడలేవు. కొన్ని దేశాల్లో మాత్రం లైంగిక చర్యల గురించి, లైంగిక అభిప్రాయాలు గురించి స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం ఉంది. ఆ దేశ సంస్కృతీ సాంప్రదాయాలను బట్టి ఇలాంటి అంశాలు ఆధారపడి ఉంటాయి. కొన్ని దేశాలు లైంగికతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాయి. కొన్ని దేశాల్లో మాత్రం దాని గురించి మాట్లాడడమే పాపంలా భావిస్తారు. కేవలం అది నాలుగు గోడల మధ్య జరిగే ఒక ప్రక్రియ గానే చూస్తారు.


డ్యూరెక్స్ సర్వే, గ్లోబల్ ప్రామిస్క్యూటీ ఇండెక్స్ లాంటి అధ్యయనాలు చెబుతున్న ప్రకారం ప్రపంచ దేశాలు లైంగిక విషయాల్లో ఎలాంటి అభిప్రాయాలను కలిగి ఉన్నాయో తెలుసుకుందాం.

కొన్ని దేశాలు లైంగిక స్వేచ్ఛను అధికంగా కలిగి ఉన్నాయి. అది వారి సంస్కృతిలో భాగం. దాని గురించి వారు బహిరంగంగా మాట్లాడగలరు. తమ అభిప్రాయాన్ని చెప్పగలరు. అలాంటి దేశాలు ఇక్కడ ఉన్నాయి.


ఆస్ట్రేలియా
ఈ దేశం లైంగిక స్వేచ్ఛ విషయంలో ఎంతో ముందడుగు వేసింది. అధ్యయనాలు చెబుతున్న ప్రకారం ఇక్కడ ప్రజలు ఒక్కొక్కరు సగటున 13 మందితో లైంగిక సంబంధాలను పెట్టుకుంటారు. 80 శాతం మంది కంటే ఎక్కువ మంది ప్రజలు వివాహానికి ముందే లైంగిక కార్యాలపాలకు ఓకే చెబుతారు. వారిది చాలా ఓపెన్ మైండ్. లైంగిక విద్య కూడా చదువులో భాగం చేస్తారు. వీరికి స్వేచ్ఛ చాలా ఎక్కువ. తమ భాగస్వామికి లైంగిక సంబంధాలు ఉన్నాయని తెలిసి కూడా ఎంతోమంది వాటిని తేలికగా తీసుకుంటూ ఉంటారు.

గ్రీస్
గ్రీస్ లో కూడా లైంగిక సంబంధాలు అధికంగానే ఉన్నాయి. ఏడాదిలో ఇక్కడి ప్రజలు 160 సార్లు లైంగిక కార్యకలాపాల్లో పాల్గొంటారని తేలింది. ప్రపంచంలోనే ఈ దేశం ఈ విషయంలో మొదటి స్థానంలో ఉంది. గ్రీస్ లో అందమైన ద్వీపాలు, రొమాంటిక్ వాతావరణం ఉంటుంది. దానివల్ల ఇలా ఎక్కువ మంది సన్నిహితంగా ఉండేందుకు ఇష్టత చూపిస్తారని కూడా చెప్పుకుంటారు. అందుకే ఇతర దేశాల నుంచి గ్రీస్ కు హనీమూన్‌కు వెళ్లే వారి సంఖ్య కూడా ఎక్కువే.

నెదర్లాండ్స్
ఇక్కడ చట్టాలు లైంగిక స్వేచ్ఛకు ఎంతో మద్దతును ఇస్తాయి. స్కూల్లో కూడా లైంగిక విద్య నేర్పిస్తున్నారు. ఈ దేశంలో నివసిస్తున్న ప్రజల్లో 65 శాతం మంది తమ లైంగిక అవసరాల గురించి ఓపెన్ గా మాట్లాడగలరు.

బ్రెజిల్
బ్రెజిల్‌లో ఉన్న జంటలు ఏడాదికి 145 సార్లు లైంగిక కార్యక్రమంలో పాల్గొంటారని అధ్యయనాలు చెబుతున్నాయి. అక్కడ పండుగలు ఎక్కువ. బీచ్ కల్చర్ కూడా ఎక్కువగానే ఉంటుంది. వారి జీవన శైలి చాలా ఉల్లాసంగా ఉంటుంది. అందుకే అక్కడ వారు ఎక్కువగా లైంగిక స్వేచ్ఛను కలిగి ఉంటారు. ఒకటికంటే ఒకరి కంటే ఎక్కువ మందితో రిలేషన్షిప్ ను పెట్టుకుంటారు.

మన దేశం పరిస్థితి ఏమిటి?
భారత్‌లో సంప్రదాయాలు ఎక్కువ. ఇప్పటికీ చాలా గ్రామాల్లో ఆడపిల్లలకు స్వేచ్ఛ లేదు. లైంగిక కార్యాకలాపాలు అన్నవి వివాహం తర్వాత మాత్రమే అని గట్టిగా నమ్మే సమాజమే ఇంకా ఉంది. అయినా కూడా కొంతమంది ఆ కట్టుబాట్లను దాటి స్వేచ్ఛా వాతావరణంలోకి అడుగుపెడుతున్నారు. మనదేశంలో ఒక వ్యక్తి ముగ్గురితో సంబంధాలు కలిగి ఉంటాడని తేలింది.

ఆస్ట్రేలియా వంటి పాశ్చాతయ దేశాలతో పోలిస్తే ఈ సంఖ్య చాలా తక్కువ. మన దేశంలో 60 శాతం మంది కంటే ఎక్కువ భారతీయులు తమ లైంగిక చర్యల్లో సంతోషంగా ఉన్నారని చెప్పారు. అంతేకాదు సన్నిహిత సమయాన్ని వారు ఎంతో గౌరవిస్తారు. మన సంస్కృతికి తగ్గట్టే నడుచుకుంటూ తమ లైంగిక అవసరాలను కూడా తీర్చుకుంటారు.

Also Read: హెయిర్ స్పా అంటే ఏమిటీ? జుట్టు రాలే సమస్యలను ఆపుతుందా? అబ్బాయిలూ చేయించుకోవచ్చా?

ఏ దేశంలోనైనా లైంగిక దృక్పథాలు వాళ్ళ సంస్కృతి, చరిత్ర, నమ్మకాలపైనే ఆధారపడి ఉంటాయి. అందుకే ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్ వంటి పాశ్చాత్య దేశాల్లో లైంగికతకు పూర్తిగా స్వేచ్ఛ ఉంది. అలాగే చట్టాల్లో కూడా దీనికి ప్రాముఖ్యతను ఇచ్చారు. విద్యలో కూడా లైంగికతకు ఒక ఎంతో మద్దతును ఇచ్చారు.

లైంగిక ప్రక్రియకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే దేశాల్లో ఆస్ట్రేలియాదే మొదటి స్థానం. ఆ తర్వాత గ్రీస్, బ్రెజిల్ వంటివి ఉన్నాయి. దీని ప్రకారం ప్రపంచంలో ఒక్కో దేశం ఒక్కో రకమైన సంస్కృతిని కలిగి ఉంది. లైంగిక స్వేచ్ఛ పట్ల, లైంగిక కార్యక్రమాల పట్ల కూడా దృక్పదాలు వేరువేరుగా ఉన్నాయి.

Related News

Cinnamon water: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీరు తాగితే.. మతిపోయే లాభాలు !

Junk Food: పిజ్జా, బర్గర్‌లు తెగ తినేస్తున్నారా ? జాగ్రత్త !

Health Tips: ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో చర్మం, జుట్టుకు బోలెడు లాభాలు !

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Weight Loss: ఈ యోగాసనాలతో.. 10 రోజుల్లోనే వెయిట్ లాస్

Sugar: చక్కెర తినడం 30 రోజులు ఆపేస్తే.. ఏం జరుగుతుందో తెలుసా ?

Big Stories

×