జీవితంలో ఒత్తిడి ఎక్కువైపోయి జుట్టు సమస్యలు పెరిగిపోతున్నాయి. దీనివల్ల జుట్టు అధికంగా రాలిపోతుంది. అలాగే చుండ్రు కూడా పట్టి ఎంతో ఇబ్బందిని కలిగి చేస్తోంది. జీవనశైలిలో విపరీతమైన మార్పులు, కాలుష్యం, పోషకాహారం అందకపోవడం వంటివి కూడా దీనికి కారణాలుగా తెలుస్తున్నాయి. అయితే వీటన్నిటికీ ఒక సమర్థవంతమైన పరిష్కారంగా హెయిర్ స్పా వినిపిస్తూ ఉంటుంది. అసలు హెయిర్ స్పా అంటే ఏమిటో కూడా చాలామందికి తెలియదు. ఇది జుట్టు రాలడాన్ని ఎలా ఆపుతుంది? అబ్బాయిలు హెయిర్ స్పా చేయించుకోవచ్చా? వంటి వివరాలను తెలుసుకుందాం.
హెయిర్ స్పా అంటే
హెయిర్ స్పా అనేది ఒక రకమైన చికిత్సగానే చెప్పుకోవాలి. తలపై ఉన్న చర్మాన్ని, వెంట్రుకలను రిపేర్ చేసే ఒక చికిత్స ఇది. జుట్టును శుభ్రపరచడంతో పాటు కండిషనింగ్ చేస్తుంది. అలాగే తలకు మసాజ్, స్టీమింగ్ వంటివి కూడా హెయిర్ స్పాలో భాగంగా చేస్తారు. నిపుణులు నాణ్యమైన షాంపూలు, కండిషనర్లు, సీరంలు, ఆయిల్స్ వంటివి ఉపయోగిస్తారు. ఇలా అప్పుడప్పుడు హెయిర్ స్పా చేయించుకోవడం వల్ల జుట్టు ఫోలికల్స్ బలంగా మారుతాయి. అలాగే తలలో రక్తప్రసరణ కూడా మెరుగుపడుతుంది. అప్పుడు వెంట్రుకలు మృదువుగా మెరుస్తూ ఉంటాయి. హెయిర్ స్పా చేయించుకున్న తర్వాత మీకు రిలాక్సింగ్ గా అనిపిస్తుంది. అలాగే ఒత్తిడి తగ్గినట్టు కూడా అనిపిస్తుంది .
జుట్టు రాలడం తగ్గుతుందా?
జుట్టు రాలడానికి ఒత్తిడి మాత్రమే కారణం కాదు. పోషకాహార లోపం, వారసత్వం, హార్మోన్లు అసంతుల్యత వంటివి కూడా ముఖ్య కారణాలుగానే చెప్పుకుంటారు. హెయిర్ స్పా అనేది జుట్టు రాలడాన్ని పూర్తిగా ఆపలేకపోవచ్చు. ఒకవేళ మీ జుట్టు ఒత్తిడి కారణంగా ఊడిపోతే హెయిర్ స్పా ఉపయోగపడుతుంది. అలాగే పోషకాహార లోపం కారణంగా జుట్టు ఊడిపోతే మీరు పోషకాలను ఆహారం ద్వారా భర్తీ చేసి జుట్టు తగ్గుదలను నిరోధించవచ్చు. అదే జన్యుపరమైన కారణాలు అయితే దానిని ఎవరూ ఆపలేరు. హార్మోన్ల అసమతుల్యత వల్ల జుట్టు రాలిపోతే వైద్యుల వద్దకు వెళ్లి ముందుగా హార్మోన్ల అసమతుల్యతకు చికిత్స తీసుకోవాలి. తద్వారా జుట్టు రాలే సమస్య చాలా వరకు తగ్గుతుంది.
అబ్బాయిలు హెయిర్ స్పా చేయించుకోవచ్చా?
హెయిర్ స్పా చేయించుకోవడానికి అమ్మాయిలు, అబ్బాయిలు అనే తేడా లేదు. ఎవరైనా చేయించుకోవచ్చు. జుట్టు రాలిపోతున్నా, చుండ్రు పడుతున్నా, జుట్టు మరీ పొడిబారుతున్నా…వారు హెయిర్ స్పాకు వెళ్ళవచ్చు. ఇది జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికే సహాయపడుతుంది. అమ్మాయిలు మాత్రమే హెయిర్ స్పా చేయించుకోవాలని లేదు. అబ్బాయిలకు కూడా హెయిర్ స్పా పద్ధతులు ఎన్నో ఉన్నాయి. కాబట్టి అబ్బాయిలకు వెళ్లాలనుకుంటే హెయిర్ స్పా చికిత్సను తీసుకోవచ్చు.
హెయిర్ స్పా విషయంలో ఎంతోమంది ఖర్చుకు వెనకాడుతూ ఉంటారు. అందుకే ఎక్కువసార్లు చేయించుకోలేము అనుకుంటారు. నిజంగానే హెయిర్ స్పా ప్రతి వారం చేయించుకోవాల్సిన అవసరం లేదు. నెలకు ఒకసారి చేయించుకుంటే చాలు మీ జుట్టు సమస్యలు చాలా వరకు తగ్గుతాయి. జుట్టు సమస్య మరీ తీవ్రంగా ఉంటే సెలూన్ నిపుణులు సలహా ఇస్తారు. దాన్నిబట్టి మీరు హెయిర్ స్పాకు వెళ్లాల్సి వస్తుంది. దీనిలో నాణ్యమైన వస్తువులు వాడతారు. కాబట్టి ఫలితాలు కూడా అద్భుతంగానే ఉంటాయి. అలాగే ఖర్చు కూడా కాస్త మధ్యస్థంగానే ఉంటుంది. తక్కువ ధరకు హెయిర్ స్పా సేవలో దొరకడం కష్టం.
Also Read: ఈ దేశం వాళ్లకు ఎప్పుడూ ‘అదే’ పని.. మరి ఇండియా?
హెయిర్ స్పా చేయించుకోవడం వల్ల ఉపయోగాలు
అప్పుడప్పుడు హెయిర్ స్పా చేసుకోవడం వల్ల మీ జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. జుట్టు రాలే సమస్య చాలా వరకు తగ్గుతుంది. అంతేకాదు మనసుకు, మెదడుకు రిలాక్స్ గా అనిపిస్తుంది. అమ్మాయిలు అబ్బాయిలు నెలకు ఒకసారి హెయిర్ స్పాకు వెళితే ఎంతో హాయిగా ఉంటుంది. జుట్టు సమస్యలతో బాధపడుతున్న వారు కచ్చితంగా హెయిర్ స్పాను ఒకసారి ప్రయత్నించి చూడండి. ఇది మీకు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. ఇంకెందుకు ఆలస్యం సెలూన్ కి వెళ్లి మీ జుట్టు సమస్యలను కు చెక్ పెట్టేందుకు ప్రయత్నించండి.